State Committee Members
-
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర కమిటీ, సీనియర్ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై డిసెంబర్ 27నాటి సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన పురోగతిని తెలుసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలను పరిగణన లోకి తీసుకుని వివరాలు సేకరించాలని గతంలో కేటీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణకు సంబంధించి కేటీఆర్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై రూపొందించిన నివేదికలను కేటీఆర్‌కు పార్టీ ఇన్చార్జీలు అంద జేశారు. సమావేశం సందర్భంగా నూతన సంవత్సరం తొలిరోజు తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు తరలివచ్చారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డితోపాటు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్ నేత తదితరులు ఉన్నారు. -
మీ ఇళ్లూ ఇలాగే ఉంటాయా..?
నరసరావుపేట టౌన్ : ‘ఏమిటీ ఈ దుర్వాసన.. మీ ఇళ్ళు కూడా ఇలానే ఉంటాయా.. రిజిష్టర్‌లో డ్యూటీ డాక్టర్ సంతకమేది? ఫ్యాన్లు, లైట్లు తిరగకపోతే పట్టించుకోరా..’ అంటూ వైద్యాధికారులను కాయకల్ప బృందం రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ షాలినీదేవి, డాక్టర్ ఇ.ప్రశాంత్ ప్రశ్నించారు. స్థానిక ఏరియా వైద్యశాలను బుధవారం సందర్శించిన వారు పలు విభాగాలను పరిశీలించారు. వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర విభాగంలోని రిజిష్ట్రర్‌లో డ్యూటీ డాక్టర్ సంతకం చేయకపోవటాన్ని తప్పుపట్టారు. విద్యుత్ వ్యవస్థను ఎప్పటికప్పుడు మెరుగుపర్చాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కాయకల్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న సేవల నాణ్యత, పారిశుద్ధ్యం, వైద్యశాల భవన పరిస్థితులు తదితర అంశాలపై ఆరా తీసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. మొదటి స్థానంలో నిల్చిన వైద్యశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షలు నగదు బహుమతి అందజేస్తుందని తెలిపారు. రెండో బహుమతిగా రూ.10 లక్షలు, మూడో బహుమతిగా రూ.6 లక్షలు ఇస్తారన్నారు. జిల్లా అంతటా వైద్యశాలలను పరిశీలించి నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు అందజేస్తామని డాక్టర్ షాలినీ తెలిపారు. ఆమె వెంట సూపరింటెండెంట్ డాక్టర్ మోహనశేషు ప్రసాద్, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ అంకినీడు ప్రసాద్, డాక్టర్ మాధవీలత, సిబ్బంది ఉన్నారు. -
టీ ఆల్‌మేవా రాష్ట్రకార్యవర్గం ఎన్నిక
హన్మకొండ చౌరస్తా : తెలంగాణ ఆల్ మైనారిటీ ఎంప్లాయూస్ అండర్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హన్మకొండ రాయపురలోని ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్లో ఏకగ్రీవంగా జరిగాయి. గౌరవ చైర్మన్‌గా ఎండీ.అబ్దుల్‌రషీద్, అధ్యక్షుడిగా ఆదిల్షరీఫ్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఖాజాఅజమొద్దీన్, ఉపాధ్యక్షులుగా అహ్మదుల్లాఖాన్, మొహసీన్, ఎండీ.గౌసిÄñæ¬ద్దీన్, ప్రధా న కార్యదర్శిగా ముజాహుద్దీన్, జహంగీర్‌బాబా, కోశాధికారిగా ఖాజాజుబేర్ సంయుక్త కార్యదర్శులుగా హఫీజ్‌ఖాన్, అజ్గర్ఖాన్ ఐటీ సెక్రటరీ ఆజం, ఖాజా జమీరొద్దీన్, ఫిరోజ్ మహిళా కార్యదర్శిగా రజీయ సుల్తానాలు ఎన్నికైనట్లు ఎండీ అబ్దుల్‌రషీద్ తెలిపారు. గత కార్యవర్గం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. -
వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుల నియామకం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు. జి.వి.సునీత, అరుణారెడ్డి, టి.కామేశ్వరి, కొల్ల గంగాభవాని, వై.దమయంతి, ముగడ గంగమ్మ, చెన్ను విజయ, గంగడ సుజాతను రాష్ట్ర కమిటీలో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి మంగళవారం తెలిపారు. వెన్నా సత్యనారాయణరెడ్డిని రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యునిగా నియమించినట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ టి.ఎస్.విజయచందర్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ లీగల్సెల్లోకి జయరాం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కమిటీలో గువ్వాజి జయరాంయాదవ్ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ చిత్తర్వు నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.