State Council of Ministers meetings
-
పోలవరం కాంట్రాక్టర్‌పై వరాల జల్లు
-
పోలవరం కాంట్రాక్టర్‌పై వరాల జల్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) కాంట్రాక్టర్‌పై రాష్ట్ర మంత్రి మండలి మరోసారి వరాల వర్షం కురిపించింది. కాంట్రాక్టర్ రోజువారీ ఖర్చుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంప్రెస్ట్ ఎమౌంట్‌ను రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కాంట్రాక్టర్ ఇప్పటికే చేసిన అదనపు పనుల బిల్లులపై క్లెయిమ్‌ల పరిష్కారానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వివాద పరిష్కార మండలి (డీఏబీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే కాంట్రాక్టు ఒప్పందంలో డీఏబీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ప్రాథమికంగా రూ.వెయ్యి కోట్ల విలువైన కాంక్రీట్ పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించి వాటి విలువను ప్రస్తుత ధరల ప్రకారం లెక్కకట్టి టెండర్ల ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి పొద్దుపోయేవరకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో మంత్రి మండలి సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమైంది. మంత్రివర్గ ముఖ్య నిర్ణయాలివీ.. - అధ్యాత్మిక నగరం తిరుపతి సమీపంలో రూ.639 కోట్లతో ప్రపంచస్థాయి విజ్ఞాన నగరం (సైన్స్ సిటీ) నిర్మించేందుకు ఆమోదం. - ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత కిదాంబి శ్రీకాంత్‌ను కేబినెట్ అభినందిస్తూ.. రూ.రెండు కోట్లు నజరానా ప్రకటన. డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగం ఇవ్వా లని నిర్ణయం. కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.15 లక్షలు, సహాయ కోచ్ సుధాకర్‌రెడ్డికి రూ.11.25 లక్షలు, మరో సహాయకుడు శ్రీకాంత్‌కు రూ.3.75లక్షలను ప్రోత్సాహకం. - సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ)కు రాజధానిలో ఉచితంగా 3,838.86 ఎకరాలను అప్పగించేందుకు నిర్ణయం. -
ఇకపై ప్రతి మంగళవారం..
మంత్రి మండలి సమావేశాలపై సీఎం ఫడ్నవీస్ సాక్షి, ముంబై: రాష్ట్ర మంత్రి మండలి సమావేశాలు ఇకపై ప్రతి మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి బుధవారం మంత్రిమండలి సమావేశాలు జరిగేవి. అయితే ఇకపై సమావేశాలను మంగళవారం నిర్వహించాలని శనివారం సీఎం ఫడ్నవీస్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షించారు. అనంతరం ఆయన డీజీపీతో సమావేశమయ్యారు. ఇటీవల అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దళితుల హత్యపై డీజీపీని అడిగి తెలుసుకున్నారు. వెంటనే విచారణ జరిపించి నివేదికను అందజేయాలని ఆదేశించారు.కాగా, రాష్ట్ర మంత్రి పంకజా ముండే ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సీఎంవో కార్యాలయంలో సమూల మార్పులు ఇదిలా ఉండగా, సమర్థవంతమైన పాలన అందించేందుకు వీలుగా సీఎంవో కార్యాలయంలో పలు మార్పులు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయ మార్గంలో సీఎంవో కార్యాలయ పనితీరును మార్చనున్నారు. మంత్రులకు సహాయకులుగా సమర్థులైన అధికారులను నియమించనున్నట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. మంత్రుల వద్ద పనులు పెండింగ్‌లో పడిపోకుండా ఈ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు. అలాగే స్థానిక సంస్థల పన్ను(ఎల్బీటీ) రద్దు, టోల్ ట్యాక్స్‌లపై ప్రశ్నించగా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నామన్నారు.