సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) కాంట్రాక్టర్‌పై రాష్ట్ర మంత్రి మండలి మరోసారి వరాల వర్షం కురిపించింది. కాంట్రాక్టర్ రోజువారీ ఖర్చుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంప్రెస్ట్ ఎమౌంట్‌ను రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కాంట్రాక్టర్ ఇప్పటికే చేసిన అదనపు పనుల బిల్లులపై క్లెయిమ్‌ల పరిష్కారానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వివాద పరిష్కార మండలి (డీఏబీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే కాంట్రాక్టు ఒప్పందంలో డీఏబీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
ప్రాథమికంగా రూ.వెయ్యి కోట్ల విలువైన కాంక్రీట్ పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించి వాటి విలువను ప్రస్తుత ధరల ప్రకారం లెక్కకట్టి టెండర్ల ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి పొద్దుపోయేవరకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో మంత్రి మండలి సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమైంది. మంత్రివర్గ ముఖ్య నిర్ణయాలివీ..
- అధ్యాత్మిక నగరం తిరుపతి సమీపంలో రూ.639 కోట్లతో ప్రపంచస్థాయి విజ్ఞాన నగరం (సైన్స్ సిటీ) నిర్మించేందుకు ఆమోదం.
- ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత కిదాంబి శ్రీకాంత్‌ను కేబినెట్ అభినందిస్తూ.. రూ.రెండు కోట్లు నజరానా ప్రకటన. డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగం ఇవ్వా లని నిర్ణయం. కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.15 లక్షలు, సహాయ కోచ్ సుధాకర్‌రెడ్డికి రూ.11.25 లక్షలు, మరో సహాయకుడు శ్రీకాంత్‌కు రూ.3.75లక్షలను ప్రోత్సాహకం.
- సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ)కు రాజధానిలో ఉచితంగా 3,838.86 ఎకరాలను అప్పగించేందుకు నిర్ణయం.
పోలవరం కాంట్రాక్టర్‌పై వరాల జల్లు
Published Thu, Nov 2 2017 1:14 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment