హైకోర్టును ఆశ్రయించండి | POLAVARAM expats reference to the Supreme Court | Sakshi
Sakshi News home page

హైకోర్టును ఆశ్రయించండి

Published Thu, Jul 7 2016 2:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

హైకోర్టును ఆశ్రయించండి - Sakshi

హైకోర్టును ఆశ్రయించండి

పోలవరం నిర్వాసితులకు సుప్రీంకోర్టు సూచన
 
 సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. నూతన భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం, పునరావాసం కల్పించాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో 276 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వు కాపీ బుధవారం వెలువడింది.

గతంలో ఇదే అంశంపై హైకోర్టులో పలువురు సామాజిక కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేయగా పోలవరం నిర్వాసితుల నుంచి ఎలాంటి విన్నపం రాలేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా బాధితులు ఎవరైనా వస్తే పరిశీలిస్తామని పేర్కొంది. తాజాగా 276 మంది నిర్వాసితులు మరో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement