
ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన స్టేటస్ రిపోర్టు, నిర్మాణ చిత్రాల పూర్తి సమాచారాన్ని అందజేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఒడిశా తరపు న్యాయవాది సుప్రీకోర్టుకు తన వాదనలు వినిపిస్తూ.. బచావత్ అవార్డుకు బిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారని, ప్రాజెక్టు ముంపుపై కనీస ముంపుపై కనీస అధ్యయనం కూడా చేయలేదని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టుపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని కానీ మణుగూరు ప్లాంట్, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలో కోరింది.
పోలవరం ప్రాజెక్టు యధావిధిగా కొనసాగుతుందని, ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. వీరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా రెండు వారాల్లోగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం అందజేస్తామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment