విచారణ నుంచి తెలంగాణను తప్పించండి
► ‘పోలవరం’పై ఎన్జీటీలో ఏపీ వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం పర్యావరణ అను మతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని తొలగించాలని ఏపీ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను కోరింది. పోలవరం ప్రాజెక్టుకు 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఇప్పుడు చెల్లవని ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృ త్వంలోని ధర్మాసనం బుధవారం విచారిం చింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ లోని భద్రాచలంసహా పలు గ్రామాలకు తీవ్ర ముంపు ఏర్పడుతుందని గతంలో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
అయితే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 90(3) ప్రకారం పోలవరం ప్రాజెక్టు తెలంగాణకు కూడా ఆమోదయోగ్యమే అని ఏపీ తరఫున సీనియర్ న్యాయ వాది ఏకే గంగూలీ వాదించారు. తెలంగాణ లోని ఏడు ముంపు మండలాలను రాష్ట్ర పునర్వ్యవస్థీ కరణ చట్టం ద్వారా ఏపీలో కలిపిన నేపథ్యం లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టువల్ల ఎలాం టి ముంపు ఉండదన్నారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీకోర్టులో కూడా పలు కేసు లు దాఖలైన నేపథ్యంలో ఎన్జీటీలో ప్రత్యే కంగా విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులను 2007లో జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథారిటీ రద్దు చేసిందని, దీనిపై హైకోర్టు స్టే విధించిం దని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ వాదనలపై బదులివ్వాలని పిటిష నర్లను ఆదేశించిన ట్రిబ్యునల్ తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.