పోలవరంపై కౌంటర్ దాఖలు చేయండి | POLAVARAM On Counter filed Make | Sakshi
Sakshi News home page

పోలవరంపై కౌంటర్ దాఖలు చేయండి

Published Tue, Jun 23 2015 2:11 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

పోలవరంపై కౌంటర్ దాఖలు చేయండి - Sakshi

పోలవరంపై కౌంటర్ దాఖలు చేయండి

ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించకుండా వారిని బలవంతంగా ఉన్న చోటు నుంచి ఖాళీ చేయిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గడువునిచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచేందుకు వీలుగా ఏపీ సర్కార్‌కు గడువునిచ్చిన హైకోర్టు, తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక కార్యకర్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement