new Land Acquisition Act
-
చెప్పినదానికంటే ఎక్కువ పరిహారం
కొత్త భూసేకరణ చట్టానికి సర్కారు సవరణలు హైదరాబాద్: కొత్త భూసేకరణ చట్టంలో పేర్కొన్న దానికంటే నిర్వాసితులకు ఎక్కువ పరిహారం చెల్లించడానికి వీలుగా సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడం కోసం ఎక్కువ పరిహారం చెల్లించడానికి అంగీకరించాలంటూ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్(భూసేకరణ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ‘సవరణ’ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొత్త చట్టంలో సూచించిన సూత్రీకరణకు మించి పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ కల్పించారని, అందుకు అనుగుణంగా సవరణ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అంశాలు ► నిర్వాసితులతో జిల్లా కలెక్టర్ చర్చించి, పరస్పర ఆమోదయోగ్యమైన హేతుబద్ధమైన ధర నిర్ణయించాలి. ► {పతిపాదిత ప్యాకేజీ నిర్ణయించడానికి గల కారణాలను వివరిస్తూ జిల్లా కలెక్టర్ నివేదిక పంపించాలి. ► ప్యాకేజీలో భూమి ధర, భూమి కోల్పోతున్న రైతుకు అదనంగా ఇచ్చే పరిహా రం కలిపి ఉండాలి. అందులో ఉండే నిర్మాణాలు, చెట్లు, ఇతర ఆస్తులకు వేరుగా ధర నిర్ణయించి చెల్లించాలి. ► ఆర్ అండ్ బీ, హార్టికల్చర్ తదితర శాఖలతో సంప్రదించి ప్రతిపాదిత ప్యాకేజీలో హేతుబద్ధతను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.ప్రభుత్వం ఆమో దం తెలిపిన తర్వాత నిర్వాసితులతో కలెక్టర్ ఒప్పందం కుదుర్చుకోవాలి. -
పోలవరంపై కౌంటర్ దాఖలు చేయండి
ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించకుండా వారిని బలవంతంగా ఉన్న చోటు నుంచి ఖాళీ చేయిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గడువునిచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచేందుకు వీలుగా ఏపీ సర్కార్‌కు గడువునిచ్చిన హైకోర్టు, తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక కార్యకర్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. -
బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు
హైదరాబాద్ సిటీః పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించకుండా వారిని బలవంతంగా ఉన్న చోటు నుంచి ఖాళీ చేయిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ సామాజిక కార్యకర్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గ్రామీణాభివృద్ధి, గిరిజన వ్యవహారాలు, పర్యావరణ మంత్రిత్వశాఖల కార్యదర్శులను, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. మారిన పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్ల దగ్గర నుంచీ పూర్తిస్థాయిలో తిరిగి అధ్యయనం నిర్వహించేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోను ఆదేశించాలన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, నిర్వాసితులకు కొత్త చట్ట ప్రకారం పరిహారం అందచేసే పునరావాసం కల్పించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు బాధ్యతలను పోలవరం అథారిటీకి అప్పగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిర్వాసితులను ఖాళీ చేయించే చర్యలో భాగంగా వారి ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లతో అత్యవసర సేవలను నిలపుదలను చేస్తున్నారని, ఈ చర్యలను అడ్డుకోవాలని పుల్లారావు తన పిటిషన్లో కోర్టును కోరారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అని, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ సంబంధం లేకపోయినా కూడా నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్నారు. నిర్వాసితులకు కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ప్రైవేటు భద్రతా సిబ్బందిని వాడుతున్నారని, దీనిపై ప్రభుత్వాన్ని నిరోధించాలని అభ్యర్థించారు. -
సత్తుపల్లి బంద్ సంపూర్ణం
సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: నూతన భూ సేకరణ చట్టం ప్రకారం సింగరేణి భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపు మేరకు గురువారం చేపట్టిన సత్తుపల్లి పట్టణ బంద్ విజయవంతమైంది. తెల్లవారుజాము నుంచే అఖిలపక్షం నాయకులు ద్విచక్ర వాహనాలపై ప్రదర్శనగా తిరుగుతూ దుకాణాలను మూసివేయిం చారు. అలాగే పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, బ్యాంకులు కూడా బంద్ మూసివేశారు. అనంతరం సింగరేణి భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షల శిబిరం నుంచి రింగ్ సెంటర్ వరకు నిర్వాసిత రైతులు, అఖిల పక్షం నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష బృందం సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ మాట్టాడారు. న్యాయమైన పరిహారం చెల్లించాలని రెండేళ్లుగా భూ నిర్వాసితులు అధికారులను కోరుతున్నా పట్టించుకోకుండా నూతన భూసేకరణ చట్టం అమల్లోకి రావడానికి 48 గంటల ముందు కలెక్టర్ అవార్డు జారీ చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కలెక్టర్ జారీ చేసిన అవార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం, సింగరేణి భూ నిర్వాసిత రైతులు ఉడతనేని అప్పారావు, చల్లగుళ్ల నర్సింహారావు, గాదిరెడ్డి రాంబాబురెడ్డి, దండు ఆదినారాయణ, అమర్లపూడి రాము, మోరంపూడి పాండు, రావుల రాజబాబు, చిత్తలూరి ప్రసాద్, కూసంపూడి రవీంద్ర, వందనపు భాస్కర్‌రావు, తడికమళ్ల యోబు, అయూబ్‌పాషా,నారాయణవరపు శ్రీనివాస్, కంభంపాటి మల్లికార్జున్, వెల్ది జగన్మోహన్రావు, ఎండీ ఫయాజ్, ఏ.శరత్, సంధ్య, తన్నీరు జమలయ్య, వెల్ది ప్రసాద్, డీఎన్ చారి, పింగళి శ్యామేలు పాల్గొన్నారు. -
రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్సీ పొంగులేటి
సత్తుపల్లి, న్యూస్‌లైన్: నూతన భూసేకరణ చట్టం 48 గంటల్లో అమల్లోకి వస్తుందనగా హడావిడిగా జనరల్ అవార్డు జారీ చేయడాన్ని ఏఐసీసీ సమావేశాల్లో రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి భూ నిర్వాసితులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేసే విధంగా భూ సేకరణ చేసేటప్పుడు మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం వచ్చేలా యూపీఏ ప్రభుత్వం చట్టం చేసిందని అన్నారు. భూ నిర్వాసితులకు మేలు కలిగేలా జిల్లాకు చెందిన అన్నిరాజకీయ పార్టీల ప్రజా ప్రతి నిధులు ఐక్యంగా సీఎంతో చర్చించామన్నారు. న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించేందుకు ఉమ్మడిగా ఎటువంటి ప్రయత్నం లోపం లేకుండా చేస్తామన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలలో అవార్డు రద్దు అయ్యేలా ఒత్తిడి చేసి న్యాయం చేస్తామన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన మాట్లాడుతూ నూతన భూసేకరణ చట్టం వర్తించే విధంగా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధిగా సీఎంతో మాట్లాడతామన్నారు. సీఎంతో ఫోన్లో.. : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దీక్షా శిబిరం నుంచి ఫోన్లో మా ట్లాడారు. 13 రోజుల నుంచి భూ నిర్వాసితులు రిలేనిరాహారదీక్షలు చేస్తున్నారని.. కలెక్టర్ జారీ చేసిన అవార్డును రద్దు చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా కలెక్టర్ శ్రీనివాస్శ్రీనరేష్తో మాట్లాడారు. సింగరేణి సీఎండీతో చర్చించామని.. నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరామని అన్నా రు. ఆయన వెంట డీసీసీ ఉపాధ్యక్షులు కూసంపూడి మాధవరావు, ఉడతనేని అప్పారావు, పరెడ్ల సత్యనారాయణరెడ్డి, గాదె చెన్నారావు, సాల్మన్‌రాజు, చింతల పాటి సత్యనారాయణ, నరుకుళ్ల రవి, కొడిమెల అప్పారావు, ములకలపాటి రవి, వెల్ది ప్రసాద్, మౌలాలి పాల్గొన్నారు. -
కొత్తచట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: నూతన భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి భూ నిర్వాసితులు మంగళవారం సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీని ముట్టడించారు. కలెక్టర్ వైఖరి నశించాలని, సింగరేణి యాజమాన్య మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. వందలాది మంది నిర్వాసితులు తరలివచ్చి జేవీఆర్ ఓసీ గేట్లను మూసివేశారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు, ఉద్యోగులను విధులకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సింగు నర్సింహారావు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు పరిశ్రమల ఏర్పాటు పేరుతో వేలకోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వా లు నిర్వాసితుల పట్ల మాత్రం వివక్ష ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఏ పరిశ్రమ ఏర్పాటు చేసి నా నిర్వాసితులకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సత్తుపల్లిలో సింగరేణి ఓసీ-2 నిర్వాసితుల పట్ల జిల్లా కలెక్టర్ నిరంకుశంగా వ్యవహరించి కొత్త చట్టం అమలు కావటానికి రెండురోజుల ముందే హడావుడిగా ఆదివారం రోజు జనరల్ అవార్డు ను ప్రకటించడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ఆ అవార్డును రద్దు చేయాలని, లేకుంటే ఆందోళన లు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సత్తుపల్లి సీఐ యు.వెంకన్నబాబు భూ నిర్వాసితులు, సింగరేణి అధికారులతో చర్చించి ఆందోళనను విరమింప చేశారు. జేవీఆర్ ఓసీ మేనేజర్ వెంకటాచారికి నిర్వాసితులు వినతిపత్రం అందించగా.. నిర్వాసితుల సమస్యల ను పీఓ, జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఉడతనేని అప్పారావు, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, మామిళ్లపల్లి కృష్ణయ్య, వెల్ది ప్రసాద్, ములకలపా టి రవి, రావి నాగేశ్వరరావు, బొంతు రామారావు, మా రోతు నాగేశ్వరరావు, సీపీఐ డివిజన్ కార్యదర్శి దండు ఆదినారాయణ, యోబు, రామకృష్ణ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాలడుగు శ్రీనివాస్, సీపీఎం నాయకులు రావుల రాజబాబు, మౌలాలి, కిష్టారం సర్పంచ్ కడారి మదీన, ములకలపాటి విష్ణు పాల్గొన్నారు. -
అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన భూ సేకరణ చట్టం కొత్త ఏడాది తొలి రోజు నుంచి అమల్లోకి వచ్చింది. 1894 నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన ఈ సరికొత్త భూసేకరణ చట్టంతో భూములు కోల్పోయే రైతులు, గిరిజనులు సహా భూములు కోల్పోయే వారికి పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం అందుతాయని, ఆయా విషయాల్లో ప్రభుత్వాలు పూర్తిస్థాయి పారదర్శకతను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ బుధవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. దేశంలోని పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు తమకు అవసరమైన భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసుకోవడంలో ఈ చట్టం అడ్డంకి కాబోదని జైరాం వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు భూసేకరణ చేపట్టవని, ప్రజావసరాల కోసం నిర్మించే ప్రైవేట్ ప్రాజెక్టులకు జరిపే భూసేకరణకు 80 శాతం, పీపీపీ పద్ధతిలోని వాటికి 70 శాతం ప్రజామోదం తప్పనిసరన్నారు.