రైతు ఆత్మహత్యలపై విచారణ వాయిదా | high court to hear pil on farmer suicides two telugu states | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలపై విచారణ వాయిదా

Published Tue, Dec 1 2015 12:50 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

high court to hear pil on farmer suicides two telugu states

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో రైతు ఆత్మహత్యలపై దాఖలైన వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిగింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి భట్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇరు ప్రభుత్వాల తీరుపై తీవ్రంగా స్పందించింది. రైతు ఆత్మహత్యలపై ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై స్పందించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ]
 
అయితే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి..కానీ అవి సరిపోవని హైకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా అధికారుల అవినీతి కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని, అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 3 రోజుల్లోగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ అంశాలన్నింటిపై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement