రైతులు ఆపదలో ఉంటే ఆదుకోకుంటే ఎలా?: హైకోర్టు
హైదరాబాద్:రైతు ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. రైతు ఆత్మహత్యలపై నివారణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైతులు ఆపదలో ఉంటే ఆదుకోకుంటే ఎలా అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
సెలబ్రెటీలకు కోట్ల రూపాయలు ఇస్తూ వినోదంపై కూడా ఎక్కువ ఖర్చు చేసినప్పుడు రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై లేదా?అని నిలదీసింది. దీనిపై రెండు వారల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.