State Dinner
-
నూతన రంగాల్లోనూ కలిసి పనిచేస్తున్న భారత్, అమెరికా
వాషింగ్టన్: నూతన రంగాల్లోనూ భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికాలో పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం శ్వేతసౌధంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇచి్చన విందులో పాల్గొన్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం వచి్చన తనకు ఘన స్వాగతం పలికిన అమెరికా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాలు పెంపొందించుకుంటున్నాయని తెలిపారు. భారత్–అమెరికా సంబంధాలనే శ్రావ్యమైన గానాన్ని ఇరుదేశాల పౌరులే స్వరపర్చారని కొనియాడారు. రెండు దేశాల మైత్రి బలపడానికి భారతీయ–అమెరికన్ అయిన కమలా హ్యారిస్ ఎంతగానో కృషి చేస్తున్నారని మోదీ కొనియాడారు. ఈ విందులో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాల్గొన్నారు. -
State Dinner Menu: వైట్ హౌస్‌లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్ మెనూలో ఏముందంటే..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి వైట్ హౌస్‌లో పసందైన విందు ఇచ్చారు బైడెన్ దంపతులు. మోదీ శాకాహారీ కావడంతో వైట్ హౌస్ చెఫ్ నీనా కర్టిస్ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. దీంతో మోదీ కోసం తొలిసారిగా వైట్ హౌస్‌లో పూర్తిగా మొక్కల ఆధారితమైన రాష్ట్ర విందును ఏర్పాటు చేశారు. విందులో మోదీకి ఇష్టమైన వంటలకాలకు అమెరికన్ టచ్ ఇస్తూ ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. మోదీ వెజెటేరియన్ కావడంతో ఆయనకు వడ్డించే మెనూపై అందరి దృష్టి పడింది. ఫుడ్ మెనూలో ఏమేం ఐటెమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. మోదీకి ఇచ్చిన డిన్నర్ మెనూలో ప్రత్యేకమైంది మిల్లెట్స్. తృణధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న మోదీ కోసం ప్రత్యేకంగా మేరినేటెడ్ మిల్లెట్స్‌ను డిన్నర్ మెనూలో చేర్చారు. ఫస్ట్కోర్సులో మారినేటెడ్ మిల్లెట్, గ్రిల్ట్ కార్న్ కెర్నెల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మెలాన్, టాంగీ అవకాడో సాస్ అందించారు. ఆ తర్వాత మెయిన్ కోర్సులో భాగంగా స్టఫ్డ్ పోర్టోబెల్లో పుట్టగొడుగులు, క్రీమీ శాఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్ డిల్ యుగర్ట్ సాస్, క్రిస్డ్ మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్క్వాషెస్ వడ్డించారు. చివరగా స్ట్రాబెర్రీ కేక్‌తో వైట్ హౌస్‌లో డిన్నర్ విందును ముగించారు. -
వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు..
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ జూన్ 22 గురువారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం జూన్ 23) ప్రధాని నరేంద్ర మోదీకి స్టేట్ డిన్నర్ ఇచ్చారు. ఈ విందుకు హాజరైన వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను రెండు దేశాలకు చారిత్రకమైనదిగా ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఈ విందుకు దాదాపు 400 మంది అతిథులను బైడెన్ ఆహ్వానించారు. అతిథుల జాబితాలో భారత్‌కు చెందిన పారిశ్రామిక ప్రముఖులు ఇంద్ర నూయి, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, ఆంటోనీ బ్లింకెన్, శాంతను నారాయణ్, ఎరిక్ గార్సెట్టి, కెవిన్ మెక్‌కార్తీ, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, గినా రైమోండో తదితరులు ఉన్నారు. అమెరికాను సందర్శించే దేశాధినేతల గౌరవార్థం వైట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేయడం ఆనవాయితి. వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం.. స్టేట్ డిన్నర్ అనేది వైట్ హౌస్ ముఖ్యమైన వ్యవహారాలలో ఒకటి. కాగా బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లకు మాత్రమే ఇలాంటి విందు ఇచ్చారు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి విందు ఇవ్వడం ద్వారా భారత్‌కు బైడెన్ ఇస్తున్న ప్రాముఖ్యత వెల్లడైంది. #WATCH | Washington, DC | Mukesh Ambani and Nita Ambani arrive at the White House for the State Dinner pic.twitter.com/qJ1wP3KZym — ANI (@ANI) June 22, 2023