
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ జూన్ 22 గురువారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం జూన్ 23) ప్రధాని నరేంద్ర మోదీకి స్టేట్ డిన్నర్ ఇచ్చారు. ఈ విందుకు హాజరైన వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ కూడా ఉన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను రెండు దేశాలకు చారిత్రకమైనదిగా ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఈ విందుకు దాదాపు 400 మంది అతిథులను బైడెన్ ఆహ్వానించారు. అతిథుల జాబితాలో భారత్‌కు చెందిన పారిశ్రామిక ప్రముఖులు ఇంద్ర నూయి, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, ఆంటోనీ బ్లింకెన్, శాంతను నారాయణ్, ఎరిక్ గార్సెట్టి, కెవిన్ మెక్‌కార్తీ, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, గినా రైమోండో తదితరులు ఉన్నారు.
అమెరికాను సందర్శించే దేశాధినేతల గౌరవార్థం వైట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేయడం ఆనవాయితి. వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం.. స్టేట్ డిన్నర్ అనేది వైట్ హౌస్ ముఖ్యమైన వ్యవహారాలలో ఒకటి. కాగా బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లకు మాత్రమే ఇలాంటి విందు ఇచ్చారు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి విందు ఇవ్వడం ద్వారా భారత్‌కు బైడెన్ ఇస్తున్న ప్రాముఖ్యత వెల్లడైంది.
#WATCH | Washington, DC | Mukesh Ambani and Nita Ambani arrive at the White House for the State Dinner pic.twitter.com/qJ1wP3KZym
— ANI (@ANI) June 22, 2023