State formation day celebrations
-
'పొట్టి శ్రీరాములు చరిత్రను నలుదిశలా వ్యాపిస్తాం'
సాక్షి, వైఎస్సార్ : రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములును ఎన్నటికీ మరువకూడదని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కడపలో ఎంపీ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో మా ప్రభుత్వం ఇప్పటి నుంచి ప్రతి ఏడాది నవంబర్ 1న అవతరణ వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని తెలిపారు. అలాగే పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను నలుదిశలా వ్యాపించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గత అయిదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొట్టి శ్రీరాములును విస్మరించి అవతరణ వేడుకలు నిర్వహించకపోవడం భాదకరమన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాశ్, ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యలు జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ను కలిసి సోమశిల ముంపు గ్రామ ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అట్లూరు, గోపవరం మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజల సమస్యలను కూడా పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. -
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతన్నారు. ఈ నేపథ్యంలో గుంటురు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించి రాష్ట్రావతరణ వేడుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అయిదేళ్లపాటు చంద్రబాబు రాష్ట్రానికి అవతరణ దినోనత్సవం లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. నవ నిర్మాణ దీక్షల పోరాటం పేరుతో చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్యు చేశారని, రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన పొట్టి శ్రీరాములుకు నివాళ్లు అర్పించే అవకాశాన్ని చంద్రబాబు పోగొట్టారని మండిపడ్డారు. నూతన ప్రభుత్వంగా ఏర్పడిన అనంతరం మళ్లీ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలు జరుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారని. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా సీఎం జగన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీ రాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. #APFormationDay — YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2019 పశ్చిమగోదావరి గణపవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఅవతరణ దినోత్సవ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే నర్సాపురం ఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యపాన నిషేధానికి నాంది పలుకుతూ 20% శాతం దుకాణాలను తొలగించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మహిళలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి మెయిన్ రోడ్డులో ఎంపీ మార్గాని భరత్, కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల సత్యనారాయణ పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు : బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నివాళులు అర్పించారు. అలాగే సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర వేడుకల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు..తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సబ్ కలెక్టర్ కె.దినేష్ కుమార్ పొట్టిశ్రీరాముల విగ్రహానికి పాలభిషేకం చేసి, నివాళులర్పించారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవి క్రిష్ణ రెడ్డి...చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మ్మెల్యే విడదల రజిని పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణాజిల్లా ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పామర్రు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్ర సాధనకు కృషి చేసిన శ్రీ పొట్టి శ్రీ రాములుకు నెల్లూరులో ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కావలిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్య వైశ్య సంఘం మహా సభ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారాకానాథ్ ఆధ్వర్యంలో స్టోన్ హౌస్ పేట లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చరిత్రను భావితరాలకు అందివ్వాలని ఆర్య వైశ్య సంఘం నేతలు సూచించారు. పొట్టి శ్రీరాములు సేవలను చంద్రబాబు విస్మరించారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్ర రాష్ట్ర అవతరణను జరపడం హర్షణీయమన్నా ప్రకాశం ఒంగోలులోని ఎన్టీఆర్ కళా పరిషత్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్యేలు అన్న రాంబాబు, కందుల నాగార్జున రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయనగరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంపురస్కరించుకొని గుర్ల మండలం వైఎస్సార్సీపీ కార్యాలయంలో విజయనగరం రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మజ్జి చిన్న శ్రీను పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం జరిపారు. అధే విధంగా సాలూరు పట్టణ మెయిన్ రోడ్లో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విశాఖపట్నం గాజువాకలో ఆర్యవ్తెశ్య సంఘం ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కులుకూరి మంగరాజు, కారమూరి మహేష్ పాల్గొన్నారు. వైయస్సార్ జిల్లా రాయచోటిలో ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ రోడ్డులో పోట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కర్నూల్ జిల్లాలోని మంత్రాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తహశీల్దారు కార్యాలయంలో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గోస్ఫాడు మోడల్ స్కూల్ లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిత్తూరు. జిల్లాలోని వైఎస్ఆర్సీపీ పార్లమెంటు కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి చేసి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్‌తోపాటు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీంఅహ్మద్.. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, ప్రై వేట్ సంస్థలు, పాఠశాలల్లోనే కాకుండా వివిధ సంఘాల ఆధ్వర్యాన ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జా తీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు ర్యాలీగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. రా ష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, మేయర్ నన్నపునేని నరేందర్, కలెక్టర్ వాకాటి కరుణ, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా, నగర పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు హన్మకొండ ఏకశిల పా ర్కులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. జెడ్పీ ైచె ర్‌పర్సన్ గద్దల పద్మ నర్సింగరావుతో పాటు సీఈఓ విజ య్‌గోపాల్, డిప్యూటీ సీఈఓ అనిల్ కుమార్‌రెడ్డి, ఉద్యోగులు ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. 3.20లక్షల మంది నిరక్షరాస్యులకు అక్షరాలు అవతరణ వేడుకల్లో భాగంగా సంపూర్ణ అక్ష్యరాస్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వయోజనులకు పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమా లు అక్షరాలు దిద్దించి కార్యక్రమాన్ని డిప్యూటీ సీ ఎం కడియం శ్రీహరి లాంఛనంగా ప్రారంభిం చారు. జిల్లాలోని మొత్తం 3.20లక్షల మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు 60వేల మంది వాలంటీర్లను ఎంపిక చేశామని, అంతర్జాతీయ అక్ష్యరాస్యతా దినోత్సవం నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని శ్రీహరి పిలుపునిచ్చారు. అనంతరం 101 మంది తెలంగాణ అమరవీరు ల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగా ల నియూమక పత్రాలను డిప్యూటీ సీఎం శ్రీహరి అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, మేయర్ నన్నపునేని నరేందర్, ఎం పీ సీతారాంనాయక్, డీఐజీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, జేసీ ప్రశాంత్ పాటిల్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ సుధీర్‌బా బు, తక్కెళ్లపల్లి రవీందర్రావు, వజ్రయ్య, స్వర్ణలత పాల్గొన్నారు. వికలాంగులకు పరికరాల పంపిణీ హన్మకొండ చౌరస్తా :వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధ వ్ కళా ప్రాంగణంలో వికలాంగులకు రూ.1.88 లక్షల విలువైన ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్టాప్స్, ఎంపీ 3 ప్లేయర్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఏజేసీ తిరుపతిరావు, డీడీ జగన్, శ్రీనివా స్, పర్యాటక శాఖ అధికారి శివాజీ, వికలాంగుల సంక్షేమ శాఖ ఇంచార్జి ఏడీ శంక ర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, భవానీప్రసాద్, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యాన టౌన్‌హాల్ లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శనను జేసీ ప్రారంభించారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ్రఆకట్టుకుంటుంది. అలరించిన సాంసృ్కతిక కార్యక్రమాలు హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ఆహుతులను అలరించాయి. భ్రమరాంబ ఆధ్వర్యాన మర్కజీ స్కూల్ విద్యార్థులు జయజయహే తెలంగాణ గీతానికి చేసిన నృత్యం, జి.రంజిత్ పేరిణి నత్యం, రేణుక శిష్యు లు చేసిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. -
ఆవిర్భావ వేడుకలు అదరగొట్టాలి
► వీడియో కాన్ఫరెన్సలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని తెలిపారు. వివిధ రంగాలలో కృషి చేసిన 25 మంది ప్రముఖులను గుర్తించి వారికి అవార్డులను ప్రదానం చేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్ధీకరించాలని, ఆస్పత్రులు, వసతి గృహాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయాలని సూచించారు. రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ముఖ్యమైన హోటళ్లలో తెలంగాణ వంటకాలు సరఫరా చేసేలా చూడాలని, కవి సమ్మేళనాలు, సెమినార్లు, డిబేట్లు, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటుచేయాలని, ఉదయం క్రీడాకారులతో తెలంగాణ రన్, సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లను విద్యుద్దీపాలతో అలంకరించి స్వీట్లు పంపిణీ చేయాలని, ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన అంశాలను తెలియజేస్తూ బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఆర్టీసీ బస్సులపై పోస్టర్లు, బ్యానర్లు అతికించాలని, దీపం, ఆసరా పింఛన్లతో పాటు ఉపాధిహామీ కూలీలకు కూడా స్వీట్లు పంపిణీ చేసేలా చూడాలని అన్నారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేపట్టాలని, అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురు ద్వారాలు అలంకరించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ మొదలుకొని జిల్లాస్థాయి వరకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని, అన్ని గ్రామాలలో శానిటేషన్ డ్రైవ్, పంచాయతీ భవనాలకు సున్నం వేయించాలని, ఐకేపీ మహిళా సంఘాలను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ శాఖ కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు చెల్లించాలని అదేశించారు. వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాం కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ప్రముఖులకు అవార్డులు ఇచ్చేందుకు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణకు అవార్డుల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శానిటేషన్ డ్రైవ్‌తో పాటు అవతరణ దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాన్ఫరెన్స్‌కు రాష్ట్రస్థాయి నుంచి రేమండ్ పీటర్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంజీ గోపాల్ పాల్గొనగా జిల్లా నుంచి అదనపు జాయింట్ కలెక్టర్ బాలాజీ రంజిత్ ప్రసాద్, డీఆర్డీఏ, డ్వామా పీడీ మధుసూదన్ నాయక్, దామోదర్‌రెడ్డి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, డీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.