ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు | The formation of a grand state ceremonies | Sakshi
Sakshi News home page

ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

Published Fri, Jun 3 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

The formation of a grand state ceremonies

హన్మకొండ :  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, ప్రై వేట్ సంస్థలు, పాఠశాలల్లోనే కాకుండా వివిధ సంఘాల ఆధ్వర్యాన ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జా తీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు ర్యాలీగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. రా ష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, మేయర్ నన్నపునేని నరేందర్, కలెక్టర్ వాకాటి కరుణ, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా, నగర పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు హన్మకొండ ఏకశిల పా ర్కులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. జెడ్పీ ైచె ర్‌పర్సన్ గద్దల పద్మ నర్సింగరావుతో పాటు సీఈఓ విజ య్‌గోపాల్, డిప్యూటీ సీఈఓ అనిల్ కుమార్‌రెడ్డి, ఉద్యోగులు ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు.

 
3.20లక్షల మంది నిరక్షరాస్యులకు అక్షరాలు

అవతరణ వేడుకల్లో భాగంగా సంపూర్ణ అక్ష్యరాస్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వయోజనులకు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమా లు అక్షరాలు దిద్దించి కార్యక్రమాన్ని డిప్యూటీ సీ ఎం కడియం శ్రీహరి లాంఛనంగా ప్రారంభిం చారు. జిల్లాలోని మొత్తం 3.20లక్షల మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు 60వేల మంది వాలంటీర్లను ఎంపిక చేశామని, అంతర్జాతీయ అక్ష్యరాస్యతా దినోత్సవం నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని శ్రీహరి పిలుపునిచ్చారు. అనంతరం 101 మంది తెలంగాణ అమరవీరు ల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగా ల నియూమక పత్రాలను డిప్యూటీ సీఎం శ్రీహరి అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, మేయర్ నన్నపునేని నరేందర్, ఎం పీ సీతారాంనాయక్, డీఐజీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, జేసీ ప్రశాంత్ పాటిల్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ సుధీర్‌బా బు, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, వజ్రయ్య, స్వర్ణలత పాల్గొన్నారు.

 
వికలాంగులకు పరికరాల పంపిణీ

హన్మకొండ చౌరస్తా :వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధ వ్ కళా ప్రాంగణంలో వికలాంగులకు రూ.1.88 లక్షల విలువైన ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్‌టాప్స్, ఎంపీ 3 ప్లేయర్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఏజేసీ తిరుపతిరావు, డీడీ జగన్, శ్రీనివా స్, పర్యాటక శాఖ అధికారి శివాజీ, వికలాంగుల సంక్షేమ శాఖ ఇంచార్జి ఏడీ శంక ర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, భవానీప్రసాద్, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యాన టౌన్‌హాల్ లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శనను జేసీ ప్రారంభించారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ్రఆకట్టుకుంటుంది. 

 

అలరించిన సాంసృ్కతిక కార్యక్రమాలు
హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ఆహుతులను అలరించాయి. భ్రమరాంబ ఆధ్వర్యాన మర్కజీ స్కూల్ విద్యార్థులు జయజయహే తెలంగాణ గీతానికి చేసిన  నృత్యం, జి.రంజిత్ పేరిణి నత్యం, రేణుక శిష్యు లు చేసిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement