State problems
-
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. ఈ మేర కు బుధవారం పార్లమెంటు ఆవర ణలోని గాంధీ విగ్ర హం వద్ద ధర్నా చేపట్టారు. నిధులను వి డుదల చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్నాలో టీఆర్ఎస్ పార్లమెంట రీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, పసునూరి దయాకర్, బీబీ పా టిల్, మాలోతు కవిత, వెంకటేష్ నేత, రంజిత్‌రెడ్డి, బండ ప్రకాశ్, లింగయ్యయాదవ్, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు జీఎస్టీ, వివిధ పథకాల కింద రూ. 29,891 కో ట్లు, ఐజీఎస్టీ కింద రూ. 4,531 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 312 కోట్లు, యూఎల్బీ గ్రాంట్ కింద రూ. 393 కోట్లు, నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ భగీరథకు రూ. 19,204 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని ఎంపీలు తెలిపారు. -
కేంద్ర మంత్రుల దృష్టికి రాష్ట్ర సమస్యలు
మంత్రి హరీశ్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు బుధవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను, పలు శాఖల కార్యదర్శులతో భేటీ అయ్యారు. అనంతరం వివరాలను విలేకరులకు వివరించారు. పత్తి కోనుగోలు కేంద్రాల పెంపు, పత్తికి మద్దతు ధర కల్పించేలా చొరవ చూపాలని కేంద్ర జౌళి మంత్రి స్మృతి ఇరానీని కోరినట్టు తెలిపారు. ‘‘తెలంగాణలో ఈ ఏడు పత్తి అదనంగా మరో 5 లక్షల హెక్టార్లలో సాగవనుంది. కనుక దాదాపు 143 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరాం. గతేడాది 85 కొనుగోలు కేంద్రాలు పెట్టడంతో పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని మంత్రికి వివరించాం. మెదక్, నల్లగొండ, ఆలేరు, సూర్యపేటల్లోని సీసీఐ సబ్ సెంటర్లను వరంగల్‌కు మార్చాలని విజ్ఞప్తి చేశాం. ఈ నెల 15న తెలంగాణలో పర్యటించాల్సిందిగా జౌళి శాఖ కార్యదర్శి అనంత్ కుమార్ సింగ్‌ను ఇరానీ ఆదేశించారు. రాష్ట్రానికొచ్చే అధికారుల బృందంతో అన్ని అంశాలపైనా చర్చిస్తాం. వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో నాలుగు అంశాలపై చర్చించాం. పెసలకు మద్దతు ధర కల్పించాలని, మద్దతు ధర విధానంలో మార్పులు తెచ్చి తెలంగాణ రైతులను ఆదుకోవాలని కోరాం. రాష్ట్రవ్యాప్తంగా 58 ఈ–నామ్ సెంటర్లను కేటాయించారు. ఒక్కోదానికి రూ.75 లక్షలు రావాల్సి ఉండగా రూ.30 లక్షలే విడుదల చేశారు. మిగతా బకాయిలను విడుదల చేయాలని, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాలకు కొత్తగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరాం. గోదాముల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రానికి బకాయి ఉన్న రూ.132 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యావరణ, అటవీ అనుమతులపై అటవీ శాఖల కార్యదర్శి అజయ్నారాయణ ఝాతో చర్చించాం. కాళేశ్వరం తొలి దశ అనుమతుల మంజూరు ఆలస్యమవుతోందని చెప్పాం. వచ్చే సోమవారం ఉన్నత స్థాయి భేటీ నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ వెంటనే తొలి దశ అనుమతులొస్తాయి’’ అని మంత్రి వివరించారు. భేటీల్లో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రాల సమస్యలపై పంచాయితీ!
నీతి ఆయోగ్ మధ్యవర్తిత్వంలో చర్చలు.. కేంద్రం కొత్త ప్రయోగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను... ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పడ్డ నీతి ఆయోగ్‌కు అప్పగించింది. జనవరి మొదటి లేదా రెండో వారంలో రాష్ట్రాలవారీగా ఉన్నతాధికారులతో సమావేశమై చర్చలు జరపాలని సూచించింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగరియా అధ్యక్షతన ఢిల్లీలో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ భేటీలకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతోపాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కావాలని కేంద్రం ఆహ్వానించింది. రాష్టాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఆయా సమస్యలతో సంబంధమున్న కేంద్ర మంత్రిత్వశాఖల ముఖ్య కార్యదర్శులు కూడా సమావేశాలకు విధిగా హాజరు కావాలని ఆదేశించింది. కేంద్ర ఉన్నతాధికారులు, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో చర్చలు జరిపితే కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారమయ్యే అవకాశాలుంటాయని కేంద్రం భావిస్తోంది. నీతి ఆయోగ్ అధ్వర్యంలో జరిగే ఈ భేటీలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లే బృందానికి రాష్ట్ర ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య నేతృత్వం వహిస్తారు. రాష్ట్ర విభజనతో ముడిపడిన వివిధ అంశాలపై తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో కొన్ని పరిష్కారమైనప్పటికీ.. మరికొన్ని ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రధానంగా విద్యుత్, సాగునీటిపారుదల, విద్య, వైద్యం, మౌలిక వసతులు, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల రంగాలతోపాటు ఉమ్మడి హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకాలు తదితరాంశాల్లో తెలంగాణ, ఏపీ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు సైతం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఢిల్లీలో జరిగే భేటీ సందర్భంగా ఈ అంశాలన్నింటిపై కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు సమగ్రంగా చర్చించనున్నారు. సమస్యలున్న విభాగాలకు చెందిన ఉన్నతాధికారులందరూ ఈ సమావేశాలకు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటినీ నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తోంది. సమస్యలు, సంబంధిత వివరాలతో నివేదికలు తయారు చేయాలంటూ రాష్ట్ర ప్రణాళికశాఖ అన్ని శాఖలకు సమాచారం చేరవేసింది.