State Team
-
ఫుట్‌బాల్ రాష్ట్ర జట్టుకు శిక్షణ
నరసరావుపేట ఈస్ట్ : జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనే అండర్–17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు క్రీడాకారుల శిక్షణా శిబిరం శనివారం సాయంత్రం సత్తెనపల్లి రోడ్డులోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ప్రారంభమైంది. గత నెల ఇదే స్టేడియంలో నిర్వహించిన 62వ అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకు అండమాన్‌లోని ఫోర్ట్బ్లేయర్లో జరగనున్న జాతీయ ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొంటుంది. ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ నాగసరపు సుబ్బరాయగుప్తా ప్రారంభించారు. ఈనెల 10 వరకు శిక్షణ ఉంటుంది. ఈ సందర్బంగా సుబ్బరాయగుప్తా మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి, జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు చిరంజీవులు, ఎన్.సురేష్‌కుమార్, స్టేడియం కన్వీనర్ మందాడి రవి, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బేస్‌బాల్ రాష్ట్ర జట్టుకు భూలక్ష్మి ఎంపిక
అమరావతి : సబ్ జూనియర్స్ బేస్‌బాల్ రాష్ట్ర జట్టుకు అమరావతి శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థిని కె. భూలక్ష్మి ఎంపికైనట్లు హెచ్ఎం కొల్లి లక్ష్మీనారాయణ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో ఏలూరు సమీపంలోని పెదపాలెంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొన్న భూలక్ష్మి ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికైందని చెప్పారు. సెప్టెంబరు12న కేరళలోని త్రివేండ్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుదని తెలిపారు. విద్యార్థినిని వ్యాయామ ఉపాధ్యాయురాలు అనురాధ తదితరులు అభినందించారు. -
పొగాకు కొనుగోళ్లు జరపాల్సిందే
♦ ట్రేడర్లతో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ♦ నిల్వల కొనుగోళ్లపై మంత్రితో భేటీ అయిన రాష్ట్ర బృందం సాక్షి, న్యూఢిల్లీ : పొగాకు పంటకు మద్దతు ధరలేక, కొనేవారు లేక తీవ్ర ఇక్కట్లలో ఉన్నామని పొగాకు రైతులు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వద్ద మొరపెట్టుకున్నారు. పలువురు పొగాకు బోర్డు సభ్యులు, రైతులు, కొనుగోలుదారులు, సిగరెట్ తయారీ కంపెనీల ప్రతినిధులు, ఎగుమతిదారులు మంగళవారం నిర్మలాసీతారామన్‌తో సమావేశమయ్యారు. పొగాకు నిల్వలను కొనుగోలు చేయాలని, గత ఏడాది కొనుగోలు చేసిన సగటు ధరకు గానీ, మూడేళ్ల సగటు ధర గానీ చెల్లించాలని కోరారు. నిర్ధేశిత మొత్తంలో పొగాకు అవసరమని చెప్పిన తరువాత ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం సరికాదని వాపోయారు. ఈ నేపథ్యంలో నిర్మలాసీతారామన్ కొనుగోలుదారులను గట్టిగా నిలదీసినట్టు సమాచారం. సమావేశం అనంతరం వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏపీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్లు, ధరపై జులై 4న గుంటూరులో జరిగే సమావేశంలో తుది నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఓటుకు కోట్లు కేసు నిందితుడు రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం సంతోషకరమని పుల్లారావు అన్నారు.