ఫుట్‌బాల్ రాష్ట్ర జట్టుకు శిక్షణ
ఫుట్‌బాల్ రాష్ట్ర జట్టుకు శిక్షణ
Published Sat, Nov 5 2016 8:34 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
నరసరావుపేట ఈస్ట్ : జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనే అండర్–17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు క్రీడాకారుల శిక్షణా శిబిరం శనివారం సాయంత్రం సత్తెనపల్లి రోడ్డులోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ప్రారంభమైంది. గత నెల ఇదే స్టేడియంలో నిర్వహించిన 62వ అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకు అండమాన్‌లోని ఫోర్ట్‌బ్లేయర్‌లో జరగనున్న జాతీయ ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొంటుంది. ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ నాగసరపు సుబ్బరాయగుప్తా ప్రారంభించారు. ఈనెల 10 వరకు శిక్షణ ఉంటుంది. ఈ సందర్బంగా సుబ్బరాయగుప్తా మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి, జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు చిరంజీవులు, ఎన్.సురేష్‌కుమార్, స్టేడియం కన్వీనర్ మందాడి రవి, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement