stationery
-
రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సాహసాలు చేసినప్పుడే నలుగురికి ఆదర్శమవవుతారు, సమాజం మిమ్మలి గుర్తిస్తుంది. ఇలా సాహసాలు చేసినవారిలో ఒకరు 'దేవేందర్ కుమార్ జైన్'. కేవలం ఐదు మందితో రూ. 5వేలు పెట్టుబడితో ప్రారంభమై ఈ రోజు కోట్లు గడిస్తున్నారు. ఈయన విజయం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ప్రస్తుతం ఆయన ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. నోయిడాలో ఉన్న స్టేషనరీ ఉత్పత్తుల తయారీ సంస్థ 'లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్' గురించి అందరూ వినే ఉంటారు. 1963లో ప్రారంభమైన ఈ కంపెనీ కేవలం రూ. 5000 పెట్టుబడితో మొదలైంది. అప్పట్లో ఇందులో ఉన్న ఉద్యోగులు కేవలం ఐదు మంది మాత్రమే. ప్రస్తుతం ఈ సంస్థ 95 దేశాల్లో ఉంది, ఇందులోని ఉద్యోగుల సంఖ్య సుమారు నాలుగు వేల కంటే ఎక్కువ. సుమారు ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ ఆదాయం ఏకంగా రూ. 750 కోట్లు (2023 మార్చి నాటికి). ఇప్పుడు వార్షక ఆదాయం రూ. 1000 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. 1975లో మొదటిసారి ఈ కంపెనీ ఫైబర్ టిప్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, 1976 నాటికి మార్కర్లు, హైలైటర్ వంటి వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. 1980లో కంపెనీ అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా జపనీస్ బ్రాండ్ పైలట్ పంపిణీదారుగా నిలిచింది. ఆ తరువాత లక్సర్ కంపెనీ 1986లో ప్రపంచ వినియోగదారులపై ద్రుష్టి కేంద్రీకరించి అనేక కొత్త ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. ఇందులో పర్మినెంట్ మార్కర్, ఫ్లోర్ సెంట్ హైలైటర్ వంటి ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక కాలంలో మంచి అమ్మకాలను పొందాయి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తరువాత దశలో డ్రాయింగ్, స్కెచింగ్ వంటి వాటికోసం కూడా కొత్త ఉత్పత్తులను తీసుకువచ్చింది. కంపెనీ తన ఉత్పత్తులలో నానో టెక్నాలజీ ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటికి కంపెనీ 'నానో క్లీన్' అని పేరు పెట్టింది. (ఇదీ చదవండి: రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!) రూ. 5000తో ప్రారంభమైన కంపెనీ పెన్నులు, స్టేషనరీ దగ్గర మాత్రమే ఆగిపోకుండా వివిధ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఇందులో లక్సర్ గ్రూప్ హాస్పిటల్, రియల్ ఎస్టేట్, రిటైల్, నానో క్లిప్ టెక్నాలజీ వంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను మాతో పంచుకోండి. -
డీఈవో కార్యాలయంలో స్టేషనరీ మాయం
జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా స్టేషనరీని అమ్ముకోగా, మరో అటెండర్ ఏకంగా ఎస్సెస్సీ ఆన్సర్ షీట్లనే చిత్తుకాగితాల కింద అమ్మేశాడు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో ముగ్గురి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో దాచిన ఆన్సర్ షీట్లను అమ్ముకున్న ఉద్యోగిని సంబంధిత ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి పట్టించారు. ♦ రద్దీకి అమ్ముకున్న సిబ్బంది ♦ అందులో మూడు సర్వీసు రికార్డులు ♦ ఎస్సెస్సీ ఆన్సర్ షీట్లనే అమ్మేసిన మరో అటెండర్ ♦ మొత్తం విలువ రూ.3 లక్షలు ♦ నెల తర్వాత వెలుగులోకి ♦ మెమోలు జారీ నిజామాబాద్ అర్బన్ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పాత పేపర్లు, ఇతర విభాగాలకు చెందిన స్టేషనరీ మూడు సంవత్సరాలుగా పేరుకుపోయింది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో టెండర్ నిర్వహించి విక్రయించవల్సి ఉంది. అయితే రాత్రివేళ విధులు నిర్వర్తించే ఇద్దరు అటెండర్లు, మరో అటెండర్ కలిసి ఎవరికీ తెలియకుండా రాత్రివేళ అమ్ముకున్నట్లు తెలిసింది. రూ. లక్ష 50 వేల విలువ చేసే స్టేషనరీని సంచుల్లో నింపి విక్రయించారు. వచ్చిన డబ్బులను పంచుకున్నారు. ఈ పంపకాల్లో తేడాలు రావడంతో విక్రయించిన నెలరోజులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్టేషనరీ విక్రయించారని డీఈవో దృష్టికి వెళ్లడంతో ఆయన ముగ్గురికి చార్జి మెమోలు జారీ చేశారు. ఈ స్టేషనరీలో రిటైర్డు ఉద్యోగులకు సంబంధించి ముగ్గురి సర్వీస్ రికార్డులు ఉన్నాయి. రిటైర్డు అయిన ఓ ప్రధానోపాధ్యాయుడు బిల్లుల కోసం సర్వీస్ రికార్డును గతంలోనే డీఈవో కార్యాలయం లో అందజేశారు. ప్రస్తుతం సర్వీస్ రికార్డు కావాలని ఇటీవల డీఈవో కార్యాలయానికి వచ్చారు. సర్వీస్ రికార్డు స్టేషనరీకి సంబంధించిన స్థలంలో ఉందని సంబంధిత క్లర్క్ అక్కడవెళ్లి పరిశీలించగా స్టేషనరీ కనిపించలేదు. దీనిపై ఆరా తీయగా స్టేషనరీని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసిన విషయం తేలింది. ఆ స్టేషనరీలో మూడు సర్వీస్ రికార్డులు ఉన్నాయని కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దొంగచాటున స్టేషనరీని విక్రయించిన ఇద్దరు ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఎస్సెస్సీ ఆన్సర్ షీట్లు సైతం.. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాలను భద్రపరిచారు. వీటిని ఇటీవల వాల్యుయేషన్ నిర్వహించి అక్కడ ఒక గదిలో ఉంచారు. డీఈవో కార్యాలయానికి చెందిన అటెండర్ జవాబుపత్రాలను చిత్తుకాగితాల కింద విక్రయించాడు. సుమారు రూ. లక్ష 50 వేలు స్టేషనరీ విక్రయించడం ద్వారా అటెండర్ లబ్ధిపొందినట్లు తెలిసింది. కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్టేషనరీని అటెండర్ విక్రయించేటప్పుడు ఫొటోలు తీసి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో ఉద్యోగికి మెమో జారీ చేసి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. స్టేషనరీ విక్రయించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవల్సింది పోయి మెమోజారీ జారీ చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఘటన జరిగి నెలలు గడిచినా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యహవరిస్తున్నారని అంటున్నారు. -
రాజధానిలో 'వరల్డ్ స్టేషనరీ ఎక్స్ పో'..!
న్యూఢిల్లీః పాఠశాల విద్యార్థులకు, కార్యాలయాలకు కావలసిన పరికరాలు, నోట్ బుక్ లు, డైరీలు మొదలైన ఉత్పత్తులతో కూడిన ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో దేశ రాజధాని నగరంలో ప్రారంభం కానుంది. జూలై 29న ప్రారంభమయ్యే అతిపెద్ద ఎక్స్ పో మూడురోజులపాటు కొనసాగనుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రగతి మైదానంలో ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో శుక్రవారం ప్రారంభం కానుంది. సుమారు 7000 నుంచి 8000 వరకూ స్టేషనరీ ఉత్పత్తులే లక్ష్యంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మెక్స్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రత్యేక ప్రదర్శనను నిర్వహిస్తుంది. జూలై 29న ప్రారంభమై మూడు రోజుల పాటు అంటే 31వ తేదీ వరకూ జరిగే ఈ స్టేషనరీ ఫెయిర్ లో ప్రపంచవ్యాప్తంగా దొరికే వివిధ రకాల స్టేషనరీ ఉత్పత్తులు ఒకేచోట లభ్యమయ్యేట్లుగా.. వన్ స్టాప్ హబ్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ స్టేషనరీ ఎక్స్ పో లో వారి వారి బడ్జెట్ ను బట్టి చిన్న, మధ్య తరహా, భారీ కార్యాలయాలు, సంస్థలు, విద్యా సంస్థలు, మొదలైన అన్ని తరహాల వారికి అందుబాటులో ఉండేట్లుగా స్టేషనరీ ఉత్పత్తులను ఇక్కడ ఉంచనున్నారు. వినియోగదారులు ముఖ్యంగా ఆఫీసు, సంస్థలకు అవసరమైన పరికరాలను, ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఈ భారీ ఎక్స్ పో ప్రధాన కేంద్రంగా చెప్పొచ్చు. పెన్నులు, పెన్నిళ్ళు, కాగితాలు వంటి కార్యాలయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, పదిరూపాయలు మొదలుకొని వంద రూపాయల వరకూ అన్ని పరిథుల్లోనూ వస్తువులు అందుబాటులో ఉంటాయని మెక్స్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ డైరెక్టర్ హిమానీ గులాటీ తెలిపారు. దీంతోపాటు గిఫ్ట్ ఎక్స్ పో, ఆఫీస్ ఎక్స్ పో పేరున మరో రెండు ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన సుమారు 150 కంపెనీల వస్తువులు ఈ ప్రత్యేక వేదికలో లభ్యమౌతాయని గులాటీ తెలిపారు. -
Hetero admirable social service
పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత 5 వేల మంది విద్యార్థులకు స్కూలు బ్యాగులు పోలీస్ శాఖ నిర్మాణానికి సంస్థ అంగీకారం నక్కపల్లి : మండలంలో విద్య, వైద్య, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు హెటెరో యాజమాన్యం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని 23 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే సుమారు 5వేల మంది విద్యార్థులకు సోమవారం హెటోరో సంస్థ ఉచితంగా స్కూలు బ్యాగులు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేసింది. నక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో అనిత మాట్లాడుతూ హెటెరో సంస్థతో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిని చేయాలని ప్రజలకు, వివిధ పార్టీల నేతలకు సూచించారు. నక్కపల్లికి మంజూరైన సర్కిల్ పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణానికి నిధుల్లేక జాప్యం జరుగుతోందని తెలుసుకున్న హెటెరో యాజమాన్యం భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావడం గర్వకారణమన్నారు. నక్కపల్లి ఉన్నత పాఠశాలలో శిథిల భవనాల స్థానంలో అదనపు తరగతి గదులను నిర్మించి వసతి సమస్యను పరిష్కరించాలని, మండల ప్రజల వైద్య అవసరాలకు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సంస్థతో పరస్పర సహకార ధోరణితో వ్యవహరిస్తామని, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు. సంస్థ డెరక్టర్(ఫైనాన్స్) భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో కంటి వ్యాధులతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా కంటిచూపు పేరుతో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి శ్రస్త్రచికిత్స చేయిస్తామని తెలిపారు. అవసరమైతే వారికి నిరంతర వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని సంస్థ చైర్మన్ పార్థసారధి రెడ్డి భావిస్తున్నట్లు తెలిపారు. ఏటా యలమంచిలి డివిజన్ పరిధిలో పదోతరగతి చదువుతున్న 2వేలమంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, సంస్థ పరిసర ప్రాంత గ్రామాల విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్నామని, పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. వేంపాడు, ఉపమాక, నక్కపల్లి గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాల కోసం మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసామన్నారు. జిల్లా ఉప విద్యాశాఖాదికారి లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెటెరో సంస్థ దయతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వీసం వెంకటలక్ష్మి, తహశీల్దార్ జగన్నాథరావు, ఎంపీడీవో కృష్ణ, ఎంఈవో ప్రభాకర్, ప్రధానోపాధ్యాయుడు నూకరాజు, డీజీఎం గోపాలకృష్ణారెడ్డి, ప్రతినిధులు మురళి, రజనీకాంత్, సుబ్బారెడ్డి,పార్థసారధి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘జూన్’జాటం
నిత్యావసరాల ధరలు ఎన్నిమార్లు పెరిగినా ఎలాగోలా తట్టుకున్నారు. వేసవి రోజులన్నాళ్లు కరెంటు లేక పోయినా ఇంటిలో కాసింతైనా నిశ్చింతగా ఉండగలిగారు. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోతోంది. వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో నేటినుంచి బడిగంటలు మోగబోతున్నాయి. ఇంటి బడ్జెట్లో పిల్లాడి చదువు ఖర్చులు వచ్చి చేరబోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, దుస్తులు, బూట్లు, స్టేషనరీ సామగ్రి కొనుగోళ్లకు తల్లిదండ్రులు బడ్జెట్ లెక్కలు వేసుకుంటున్నారు. పెరిగిన ఖర్చుతో వారి గుండె ఝల్లుమంటోంది. అంచనాలకు మించిన పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితిల్లో తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అదనపు బడ్జెట్‌తో అన్నీ సమకూర్చి బడికి పంపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బ్యాగులు ... పాఠశాలలు మొదలుకొని కళాశాలల విద్యార్థుల వరకు పుస్తకాల మోతకు బ్యాగులు అవసరం. మార్కెట్లో అన్ని రకాల తరగతులకు సంబంధించిన బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. నర్సరీ నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు రకరకాల అనువైన బ్యాగులు విక్రయిస్తున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు రూ.250 నుంచి రూ.700 ధరల్లో బ్యాగులు దొరుకుతున్నా యి. కళాశాల విద్యార్థులకు పాఠ్య, నోట్‌బుక్స్ పెట్టుకోవడంతోపా టు ల్యాప్‌టాప్ పెట్టుకునే సౌలభ్యం గల బ్యాగులూ లభిస్తున్నాయి. ఒక్కో బ్యాగు రూ.వెయ్యి నుంచి రూ..1500 వరకు ధర ఉంది. నోట్‌బుక్స్ గతంతో పోలిస్తే నోట్ బుక్స్ ధర 20 శాతం మేర పెరిగింది. నిరుడు రూ.10 ధర పలికిన పుస్తకం నేడు రూ.12కు చేరింది. లాంగ్ నోట్‌బుక్ రూ.20 నుంచి రూ.22 పలుకుతోంది. రఫ్ నోట్స్లైతే రూ.12 నుంచి మార్కెట్లో లభ్యమవుతున్నారుు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నోట్ బుక్స్ ధరల్ని విపరీతంగా పెంచేయడంతో బయటి మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. సైకిళ్లు ఇంచుమించు అన్ని ప్రైవేటు పాఠశాలలకు స్కూల్ బస్సులు ఉన్నారుు. బస్సు సౌకర్యం అందుబాటులో లేక, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులుసైకిళ్లు వినియోగిస్తున్నారు. బాలురు, బాలికలకు సంబంధించి వివిధ రకాల మోడళ్లలో సైకిళ్లు మార్కెట్లో లభ్యమవుతున్నారుు. ఒక్కోటి రూ.3వేల నుంచి రూ.5వేలు పలుకుతోంది. కవర్లు, నేమ్ స్టిక్కర్లు.. ఏడాది పాటు పుస్తకాలు భద్రంగా ఉండాలంటే కనీస జాగ్రత్తలు అవసరం. పుస్తకాలు చిరగకుండా, మారిపోకుండా ఉండేందుకు అట్టలు, నేమ్ సిక్కర్లు తప్పనిసరి. వివిధ రకాల బొమ్మలతోకూడిన కాగితం, సింథటిక్ అట్టలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. పుస్తకాలకు భ ద్రతతో పాటు అందాన్నిఇచ్చే కవర్లు నాణ్యతనుబట్టి రూ.15నుంచి రూ.75వరకు, స్టిక్కర్లురూ.3 నుంచిరూ.10 వరకుమార్కెట్లో ధరపలుకుతున్నాయి. స్కేలు రూ.10 నుంచి రూ.45, పరీక్ష ప్యాడ్ రూ.20 నుంచి రూ.135 వరకు ధర ఉంది. టిఫిన్ బాక్స్‌లు.. విద్యార్థులు పాఠశాలకు తీసుకెళ్లేందుకు టిఫిన్ బాక్స్‌లు కావా లి. మార్కెట్లో వాటి ధర రూ.200 నుంచి రూ.400 వరకు ఉన్నాయి. రక రకాల కంపెనీలతో కూడిన టిఫిన్ బాక్స్‌లు లభిస్తున్నాయి. టిఫిన్ డబ్బాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా బ్యాగులు అమ్ముతున్నారు. ఒక్కో బ్యాగు ధర రూ.60 నుంచి రూ.140 వరకు ఉన్నాయి. వాటర్ బాటిళ్లు.. కొన్ని పాఠశాలల్లో తాగునీరు అందుబాటులో ఉండడం లేదు. విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్స్‌ల వెంట తా గునీరు తీసుకెళ్తున్నారు. నీటిని చల్లగా ఉంచే బాటిల్స్ కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. వర్షాకాలం, చలికాలాల్లో చల్లని నీరు పడని విద్యార్థులు వాటర్ బాటిల్స్‌ను తీసుకెళ్లవచ్చు. వాటర్ బాటిళ్ల ధర రూ.20 నుంచి రూ.100 వరకు ఉంటోంది. నీటిని చల్లగా ఉంచే విధంగా రూపొందించిన ప్రత్యేక బాటిళ్లురూ.200కు విక్రయిస్తున్నారు. షూస్.. సాక్స్‌లు.. నలుపు, తెలుపు బూట్లు, సాక్స్‌లు కూడా పాఠశాల ప్రారంభంతో కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. తరగతి, వయసు పెరగడంతో ఏటా బూట్లు కొనుగోలు చేయక తప్పడం లేదు. నర్సరీ విద్యార్థులకు రూ.150 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులకు రూ.200 నుంచి రూ.500 వరకు బూట్ల ధరలు ఉన్నాయి. సాక్స్‌ల ధరలు రూ.25 నుంచి రూ.40 వరకు ఉన్నాయి. కాటన్, నైలాన్ సాక్స్‌లు కూడా ఉన్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సాక్స్లపై పాఠశాల పేరును ముద్రించి అక్కడే విక్రయిస్తున్నాయి. పెన్నులు, పెన్సిళ్లు.. పెన్నులు, పెన్సిళ్లు లేకపోతే విద్యార్థులకు చదువు సాగదు. పెన్నులు రూ.3 నుంచి రూ.200 వరకు ఉన్నాయి. పెన్సిల్ రూ.2 నుంచి రూ.50 వరకు, ఎరేజర్ రూ.1 నుంచి రూ.5 వరకు లభిస్తున్నాయి. పలకలు, జామెట్రీ బాక్స్‌లు నర్సరీ నుంచి యూకేజీ వరకు పలకల వినియోగం తప్పనిసరి. మార్కెట్లో పిల్లలను ఆకట్టుకునేందుకు రకరకాల పలకలను ప్రవేశపెట్టారు. నలుపు రంగుపలక రూ.20కు లభిస్తోంది. చిన్నారుల్ని ఆకట్టుకునే మ్యాజిక్ స్లేట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఒక్కోటి రూ.200. వివిధ రకాల జామెట్రీ బాక్స్‌లు రూ.20 నుంచి రూ.300 వరకు లభిస్తున్నాయి. యూనిఫాం.. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు తప్పనిసరి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు యూనిఫాం ఉండాల్సిందే. వయసు, తరగతిని బట్టి ఒక్కో విద్యార్థికి రూ.300 నుంచి రూ.1000 వరకు యూనిఫాంకు ఖర్చు చేయాల్సి వస్తుంది. యూనిఫాం బట్టల అమ్మకాలు జరుగుతున్నప్పటికీ కుట్టు కూలీ ఖర్చు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు రెడీమేడ్ దుస్తులపై మొగ్గు చూపుతున్నారు. ఒక్కో స్కూల్‌కు ఒక్కో రకమైన యూనిఫాం ఉండడంతో అన్ని షాపుల్లో వాటి అమ్మకాలు సాగుతున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల్లోనే యూనిఫాంలు విక్రయిస్తున్నాయి. టై.. బెల్ట్.. టై.. బెల్ట్‌లు కూడా మార్కెట్లో అన్ని పాఠశాలలకు సంబంధించినవి అందుబాటులో ఉన్నాయి. పాఠశాలల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్కూళ్లో ఒక్కో టై రూ.50 నుంచి రూ.100 వరకు ఉంటుంది. బయట మార్కెట్లో వ్యాపారులు తక్కువ ధరకే టై, బెల్టుల అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో టై రూ.10 నుంచి రూ.20, బెల్ట్‌లు రూ.15 నుంచి రూ.30లకే లభిస్తున్నాయి. అప్పులు చేస్తున్నాం.. ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు. ఖరీఫ్ కోసం ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు పెట్టే కాలం వచ్చింది. ఎరువులు, విత్తనాలు కొనడానికే అప్పులు చేస్తున్నాం. ఇప్పుడే పిల్లలను స్కూలుకు పంపే సమయం వచ్చింది. వాళ్లకూ పైసలు కావాలి. మరింత అప్పు చేయక తప్పేలా లేదు. - శేఖర్‌రెడ్డి, నారెగూడ భారం పెరుగుతోంది.. పిల్లలను పాఠశాలలకు పంపాలంటే వారికి పుస్తకాలు, బూట్లు, యూనిఫాంలు, బ్యాగులు కొనాలి. సీజన్ కావడంతో వాటి ధరలు మండిపోతున్నాయి. స్కూలు ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. బస్‌ల ఫీజులు కూడా బాగా పెరిగాయి. ఏం చేస్తాం పిల్లల కోసం భారం మోయాల్సిందే. - ప్రభాకర్, గుబ్బడిపత్తేపూర్ ప్రభుత్వ ఆజమాయిషీ లేదు.. ఫీజుల వసూలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వేలకువేల రూపాయలు వసూలుచేస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. - డి. లలిత, విద్యార్థి తల్లి అప్పుల నెలగా మారింది.. ప్రైవేటు స్కూళ్ల అడ్డగోలు నిబంధనలతో జూన్ అంటేనే తల్లితండ్రులకు అప్పుల నెలగా మారింది. పుస్తకాలు, టైలు, పెన్నులు తదితర వస్తువులన్నీ పాఠశాలల్లోనే కొనుగోలు చేయలనడంతో ఎక్కువ ధరలు వెచ్చించి అప్పుల పాలవుతున్నాం. - మామిండ్ల ముత్యాలుయాదవ్, విద్యార్థి తండ్రి