Luxor Group: Started With Only Rs 5000 And 5 Persons, Present Net Worth Is Rs 750 Crore - Sakshi
Sakshi News home page

Luxor Group: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!

Published Sat, Apr 29 2023 11:30 AM | Last Updated on Sat, Apr 29 2023 12:23 PM

Started only rs 5000 and 5 persons now this company net worth rs 750 crore - Sakshi

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సాహసాలు చేసినప్పుడే నలుగురికి ఆదర్శమవవుతారు, సమాజం మిమ్మలి గుర్తిస్తుంది. ఇలా సాహసాలు చేసినవారిలో ఒకరు 'దేవేందర్ కుమార్ జైన్'. కేవలం ఐదు మందితో రూ. 5వేలు పెట్టుబడితో ప్రారంభమై ఈ రోజు కోట్లు గడిస్తున్నారు. ఈయన విజయం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ప్రస్తుతం ఆయన ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నోయిడాలో ఉన్న స్టేషనరీ ఉత్పత్తుల తయారీ సంస్థ 'లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్' గురించి అందరూ వినే ఉంటారు. 1963లో ప్రారంభమైన ఈ కంపెనీ కేవలం రూ. 5000 పెట్టుబడితో మొదలైంది. అప్పట్లో ఇందులో ఉన్న ఉద్యోగులు కేవలం ఐదు మంది మాత్రమే. ప్రస్తుతం ఈ సంస్థ 95 దేశాల్లో ఉంది, ఇందులోని ఉద్యోగుల సంఖ్య సుమారు నాలుగు వేల కంటే ఎక్కువ.

సుమారు ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ ఆదాయం ఏకంగా రూ. 750 కోట్లు (2023 మార్చి నాటికి). ఇప్పుడు వార్షక ఆదాయం రూ. 1000 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. 1975లో మొదటిసారి ఈ కంపెనీ ఫైబర్ టిప్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, 1976 నాటికి మార్కర్లు, హైలైటర్ వంటి వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.

1980లో కంపెనీ అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా జపనీస్ బ్రాండ్ పైలట్ పంపిణీదారుగా నిలిచింది. ఆ తరువాత లక్సర్ కంపెనీ 1986లో ప్రపంచ వినియోగదారులపై ద్రుష్టి కేంద్రీకరించి అనేక కొత్త ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. ఇందులో పర్మినెంట్ మార్కర్, ఫ్లోర్ సెంట్ హైలైటర్ వంటి ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక కాలంలో మంచి అమ్మకాలను పొందాయి.

(ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!)

లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తరువాత దశలో డ్రాయింగ్, స్కెచింగ్ వంటి వాటికోసం కూడా కొత్త ఉత్పత్తులను తీసుకువచ్చింది. కంపెనీ తన ఉత్పత్తులలో నానో టెక్నాలజీ ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటికి కంపెనీ 'నానో క్లీన్' అని పేరు పెట్టింది.

(ఇదీ చదవండి: రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!)

రూ. 5000తో ప్రారంభమైన కంపెనీ పెన్నులు, స్టేషనరీ దగ్గర మాత్రమే ఆగిపోకుండా వివిధ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఇందులో లక్సర్ గ్రూప్ హాస్పిటల్, రియల్ ఎస్టేట్, రిటైల్, నానో క్లిప్ టెక్నాలజీ వంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను మాతో పంచుకోండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement