stay rejected
-
CAAపై స్టేకు సుప్రీం నిరాకరణ.. పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సూప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో దాఖలైన 230 పిటిషన్లపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక.. ఏప్రిల్ 8వ తేదీలోగా కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 9న వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్లో కోరిన విషయం తెలిసిందే. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు కూడా సీఏఏపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన: టీఎంసీ ఆరోపణలు -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై స్టేకు సుప్రీం నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద నిందితుడికి ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సవరణ, 2018పై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్ధానం గురువారం నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను, మార్చి 20న ఈ అంశంపై సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లను కలిపి విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఈ చట్టాన్ని నిర్వీర్వం చేస్తుందనే ఆందోళనతో గత ఏడాది ఆగస్ట్ 9న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ చట్టం తీవ్రంగా దుర్వినియోగమవుతుందంటూ దీనికి సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ అరెస్ట్‌లను నిలువరించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చుతూ ప్రభుత్వం నూతన సవరణలు చేపట్టింది. కాగా ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగిపై దాఖలైన కేసుల్లో నిర్ధిష్ట అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే అరెస్ట్ చేయాలనే నిబంధనలు సహా సుప్రీం కోర్టు పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని పరిష్కరిస్తూ ఈ చట్టానికి కోరలు తెచ్చేలా పార్లమెంట్లో ప్రభుత్వం సంబంధిత చట్టానికి నూతన సవరణలు ప్రతిపాదించింది. -
టీడీపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
-
హైకోర్టులో టీడీపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం స్టేను నిరాకరిస్తూ కేసును కొట్టివేసింది. ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను కోర్టు ముందు పెట్టాలని ఎన్ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. -
విభజనపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన ప్రక్రియపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే, ఈ విషయంలో కోర్టుకు ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి, ఇప్పుడైనా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్ దాఖలైంది. ఇంతకుముందు పలుమార్లు రాష్ట్ర విభజనపై పలువురు నాయకులు, న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, అప్పటికి ఇంకా సమయం పరిపక్వం కాలేదంటూ ఆయా పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.