Steal Money
-
అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి!
సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ యూజర్లు జాగ్రత్త! యూజర్ల బ్యాంకు ఖాతాలనుంచి నగదును తస్కరించే యాప్‌లపై తాజాగా హెచ్చరిక జారీ అయింది. ఖాతాలో డబ్బులు, బ్యాంకింగ్ సమాచారం, పిన్లు, పాస్వర్డ్లు సహా ఇతర డేటాను దొంగిలించే లక్ష్యంతో మాల్వేర్ యాప్‌లను ట్రెండ్ మైక్రో భద్రతా పరిశోధన గుర్తించింది. తక్షణమే అన్ఇన్స్టాల్ చేయాలని హెచ్చరించింది. ఇలాంటి 17 ఆండ్రాయిడ్ యాప్‌లను సంస్థ గుర్తించింది. ఇవి మొబైల్ ఫోన్లోని టెక్స్ట్ సందేశాలను కూడా అడ్డుకుంటాయని, అలాగే మరింత ప్రమాదకరమైన మాల్వేర్ బారిన పడేలా చేస్తాయని హెచ్చరించింది. గూగుల్ ప్లేస్టోర్ సేఫ్టీ మెజర్స్‌ను అధిగమిస్తాయని యాప్‌లు డ్రాపర్-యాజ్-ఎ-సర్వీస్ (DaaS) మోడల్‌కు దారితీస్తాయని పేర్కొంది. అందుకే వాటిని డ్రాపర్ యాప్‌లు అంటారని ట్రెండ్ మైక్రోలోని భద్రతా పరిశోధకులు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్‌లో గత ఏడాది ట్రెండ్ మైక్రో కొత్త డా డ్రాపర్ వెర్షన్‌ను కనుగొంది. వీటిని ప్లేస్టోర్ నుంచి తొలగించినప్పటికీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో మిగిలి ఉండే అవకాశం ఉంది కనుక తక్షణమే తొలగించాలని సూచించింది. డ్రాపర్ యాప్‌ల జాబితా కాల్ రికార్డర్ APK రూస్టర్ VPN సూపర్ క్లీనర్- హైపర్ & స్మార్ట్ డాక్యుమెంట్ స్కానర్ - పీడీఎఫ్ క్రియేటర్ యూనివర్సల్ సేవర్ ప్రో ఈగిల్ ఫోటో ఎడిటర్ కాల్ రికార్డర్ ప్రో+ అదనపు క్లీనర్ క్రిప్టో యుటిల్స్ ఫిక్స్ క్లీనర్ యూనివర్సల్ సేవర్ ప్రో లక్కీ క్లీనర్ జస్ట్ ఇన్: వీడియో మోషన్ డాక్యుమెంట్ స్కానర్ ప్రో కాంకర్ డార్క్నెస్ సింప్లీ క్లీనర్ Unicc QR స్కానర్ కాపీ క్యాట్ యాప్‌లను నిషేధించేలా గూగుల్ కొత్త విధానాన్ని తీసుకురానుందని సమాచారం. ఇతర యాప్‌ల నుండి లోగోలు, డిజైన్లు లేదా టైటిల్స్‌ను క్లోన్ చేసే యాప్‌లపై ఆగస్టు 31 నుండి నిషేధం అమలు కానుంది. వినియోగదారు డేటాను ట్రాక్ చేసే, క్లిక్ ద్వారా ప్రకటనలకు దారి మళ్లించే వీపీఎన్ఎస్ సర్వీస్ ఇందులో భాగం. అంతేకాదు మొబైల్ గేమ్స్‌లో ఫుల్ పేజీప్రకటనలపై, 15 సెకన్ల తర్వాత కూడా క్లోజ్ కాని యాడ్స్ డెవలపర్లపై ఆంక్షలు సెప్టెంబర్ 30 నుంచి అమలు కానున్నాయి. స్క్రీన్ లోడింగ్ సమయంలో/గేమ్ ముందు లేదా తరువాతి లెవల్ ప్రారంభించే ముందు కనిపించే ప్రకటనల్ని గూగుల్ నిరోధిస్తుందని నివేదిక పేర్కొంది. అయితే, గేమ్‌లో రివార్డ్‌లను అన్‌లాక్ చేసే ప్రకటనలకు ఇది వర్తించదట. -
పదేళ్ల బాలుడు పది లక్షలు కొట్టేశాడు
ఇండోర్: అందరూ చూస్తుండగానే పదేళ్ల బాలుడు పది లక్షలు కాజేసిన షాకింగ్ ఘటన మంగళవారం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నీమూచ్ జిల్లాలోని జవద్ ప్రాంతంలో ఓ కార్పొరేటివ్ బ్యాంకు ఉంది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ బ్యాంకులోకి అందరూ కస్టమర్లతోపాటు ఓ బాలుడు ప్రవేశించాడు. అయితే రాగానే నెమ్మదిగా వెళ్లి క్యాషియర్ క్యాబిన్లోకి దూరి ఓ మూలకు నక్కాడు. ఎదురుగా బారెడంత క్యూ ఉన్నా వారెవరికీ ఈ బక్కపలుచని బుడ్డోడు కనిపించలేదు. పైగా అక్కడ క్యాబిన్లో సదరు ఉద్యోగి లేకపోవడంతో దొరికిందే చాన్సని అక్కడున్న 500 నోట్ల కట్టలను దొరికిన కాడికి అందుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి క్షణమాలస్యం చేయకుండా ఉడాయించాడు. (కరోనా : భార్య శాంపిల్స్ పనిమనిషి పేరుతో.. ) ఈ చోరీ అంతా కేవలం ముప్పై సెకన్లలోనే పూర్తి చేసేయడం విశేషం. అయితే ఆ పిల్లవాడు బ్యాంకు నుంచి అడుగు బయటపెట్టే ముందు అలారమ్ మోగింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు గార్డు అతని వెనకాలే పరిగెత్తాడు, కానీ అప్పటికే ఆ బుడ్డోడు జారుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమివ్వగా వారు బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అందులో ఆ పిల్లవాడికి బ్యాంకులో ఉన్న మరో వ్యక్తి సహకరించినట్లు స్పష్టమైంది. ఈ ఘటనపై జవద్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఓపీ మిశ్రా మాట్లాడుతూ.. "మైనర్ బాలుడుతోపాటు, అతనికి సహకరించిన వ్యక్తి వేర్వేరు దారుల్లో పరిగెత్తారు. ఆ ప్రాంతంలో రోడ్ల పక్కన ఉండే దుకాణాదారులను దీని గురించి ప్రశ్నిస్తున్నాం. సెక్యూరిటీ గార్డును సైతం విచారిస్తున్నాం" అని తెలిపారు. (ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా..) -
కరెన్సీ మెషీన్లు దోచేస్తున్నాయట..!
-
కరెన్సీ మెషీన్లు దోచేస్తున్నాయట..!
డబ్బు లెక్కపెట్టడం అనేది చాలా విసుగు పుట్టే విషయమే. అదీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు కస్టమర్లు తెచ్చిన లక్షలకొద్దీ డబ్బును లెక్కించాలంటే మరీ కష్టం. అందుకే కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు వాడుకలోకి వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులకు పని చాలా ఈజీ అయినట్లే చెప్పాలి. అయితే మనీ కౌంటింగ్ మెషీన్లు కూడా ఇప్పుడు డబ్బు దోచేసుకుంటున్నాయి.. జర జాగ్రత్త! అంటున్నారు నిపుణులు. చైనాలో తయారైన మెషీన్లతో ఈ తంటా వస్తోందని హెచ్చరిస్తున్నారు. అందుకే డబ్బు విషయంలో మనుషులే కాదు... మెషీన్లను కూడా నమ్మొద్దని చెప్తున్నారు. ఇది నిజంగా నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి...