stealing bikes
-
నగరంలోని సైకిళ్లన్నీ మాయం.. కారణం తెలిసి పోలీసులే షాక్!
చండీగఢ్: హరియాణాలోని పంచకుల జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా సైకిళ్లు మాయమవుతున్నాయి. ఒక్కసారిగా సైకిళ్లు మాయమవుతున్నట్లు ఫిర్యాదులు పెరగటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లోనే కేసు ఛేదించారు. అయితే.. పోలీసులే విస్తుపోయే సంఘటన ఎదురైంది. నగరంలోని సైకిళ్లన్నింటిని ఒకే వ్యక్తి ఎత్తుకెళ్లటం ఆశ్చర్యానికి గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచకుల జిల్లాలోని మంజ్రి గ్రామంలో రవి కుమార్(32) అనే వ్యక్తి జీవిస్తున్నాడు. పంచకుల జిల్లా మొత్తం తిరుగుతూ సైకిళ్లు ఎత్తుకెళ్లే పని పెట్టుకున్నాడు. ఇటీవలే సెప్టెంబర్ 14న సెక్టార్ 26లో సుమారు రూ.15,000 విలువ చేసే సైకిల్‌ను మాయం చేశాడు. సెక్టార్స్ 2,4,7,9,10,11,12,12A,20, 21,25లలో సైకిళ్లు చోరీకి గురయ్యాయనే ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజుల తర్వాత రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. నిఘా కెమెరాల ఆధారంగా మొత్తం 62 సైకిళ్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ‘సీసీటీవీ ఫుటేజ్, సైబర్ టెక్నాలజీ ఆధారంగా పంచకుల జిల్లా మొత్తం ఒకే వ్యక్తి సైకిళ్లు దొంగతనం చేసినట్లు తేలింది. ఈ సైకిళ్లు గరిష్ఠంగా రూ.20,000 వరకు ధర ఉన్నాయి.’ అని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన సైకిళ్లను అత్యంత తక్కువ ధరకు రూ.2,000లకే అమ్మటం.. వచ్చిన డబ్బును మత్తుపదార్థాలు కొనుగోలు చేసేందుకు వినియోగించటం చేస్తున్నాడు. ‘2021లో లుథియానా నుంచి చండీగఢ్‌లోని రాయ్‌పుర్ ఖుర్ద్‌కు మకాం మార్చాడు రవి. జిరాక్‌పుర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేవాడు. తన ఉద్యోగం పోయిన క్రమంలో మత్తుకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత పంచకులకు మారి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తున్నాడు.’ అని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపాడు. ఇదీ చదవండి: భర్తను చితకబాది.. భార్యను లాక్కెళ్లి ఆరుగురు గ్యాంగ్ రేప్! -
వయసు 21.. కేసులు 20.. జల్సాల కోసం వాహనాల చోరీ
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లో పని చేసే అతగాడికి ద్విచక్ర వాహనాలంటే సరదా. వాటిపై తిరగాలనే కోరికకు తన ఆర్థిక స్థోమత అడ్డు వస్తోంది. దీంతో వాహనాలను చోరీ చేసి చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు. చోరీ వాహనాలను విక్రయించినా, ఒకే దానిపై ఎక్కువ రోజులు తిరిగినా పోలీసులకు చిక్కుతుండటంతో తస్కరించిన దానిపై కొన్నాళ్లు చక్కర్లు కొట్టి వదిలేయడం మొదలెట్టాడు. ఈ పంథాలో ఇప్పటి వరకు 20 నేరాలు చేసిన 21 ఏళ్ల ఎం.వెంకటేశ్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్నట్లు డీసీపీ డి.సునీత రెడ్డి వెల్లడించారు. ఆసిఫ్‌నగర్ పరిధిలోని జిర్రా ప్రాంతానికి చెందిన వెంకటేష్ పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్థి చెప్పాడు. ఆపై చిన్న చిన్న పనులు చేసినప్పటికీ ప్రస్తుతం ఓ పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. వివిధ రకాలైన ద్విచక్ర వాహనాలపై తిరగాల న్నది ఇతడి కోరిక. అయితే వాటిని ఖరీదు చేయడానికి తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో 2016 నుంచి చోరీలు చేయడం మొదలెట్టాడు. తొలినాళ్లల్లో చోరీ చేసిన వాహనాలపై తిరిగి వదిలేసేవాడు. ఆపై వాటికి ఉన్న డిమాండ్ గుర్తించిన ఇతగాడు జిర్రా ప్రాంతంలో అనేక మందికి మాయమాటలు చెప్పి తక్కువ రేటుకు అమ్మాడు. ఆ సందర్భంలో ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు ఆయా వాహనాలను రికవరీ చేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై వచ్చిన ఇతడిని ఆ వాహనాలు ఖరీదు చేసిన వారు నిలదీయడంతో పాటు దాడులకు పాల్పడ్డారు. ఇకపై చోరీ చేసిన వాహనాన్ని ఎవరికీ విక్రయించకూడదని నిర్ణయించుకున్న వెంకటేష్ తన పంథా కొనసాగించాడు. 15 రోజుల తర్వాత.. మే నెల నుంచి ఇప్పటి వరకు ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, టప్పాచబుత్ర, మంగళ్‌హాట్, బోయిన్పల్లి పోలీసుస్టేషన్ల పరిధి నుంచి ఎనిమిది వాహనాలు తస్కరించాడు. ఒకదాన్ని చోరీ చేసిన తర్వాత పది పదిహేను రోజులు దానిపై చక్కర్లు కొడతాడు. ఆపై నిర్మానుష్య ప్రాంతంలో ఆ వాహనాన్ని పడేసి మరోటి చోరీ చేస్తాడు. ఇతడి వ్యవహారాలపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, కె.నర్సింహులు, షేక్ బురాన్‌లతో కూడిన బృందం వలపన్ని అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి రూ.5 లక్షల విలువైన 8 వాహనాలు స్వాదీనం చేసుకుని ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించింది. వీటితో సహా ఇప్పటి వరకు ఇతడిపై మొత్తం 20 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: పల్సర్ బైక్‌లే టార్గెట్.. ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఏర్పడిన పరిచయం.. -
పట్టపగలే రెచ్చిపోతున్న ఆకతాయిలు.. మాయమవుతున్న బైక్‌లు
అల్లిపురం: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నిత్యం వారి ఆగడాలతో అవస్థలు పడతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలల్లో వేర్వేరు చోట్ల ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయని పోలీసుల రికార్డులు ద్వారా తెలుస్తోంది. ఇంటి బయట వాహనాలు పెట్టుకుంటే తెల్లారేసరికి ఉంటుందో లేదో తెలియడం లేదని అల్లిపురంవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారుమెట్టలో పట్టపగలే వాహనాల్లో పెట్రోలు దొంగిలిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. గత నెల 28న నేరెళ్లకోనేరు, కంఠంవారి వీధి ప్రాంతాల్లో రాత్రి వేళ ఇంటి బయట నిలిపిన వాహనాలను దుండగులు తగులబెట్టారు. దీనిపై టూ టౌన్ శాంతి భద్రతల పోలీసులకు ఫిర్యాదు అందటంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. మత్తు పదార్థాలు వినియోగించే వారి పనే.. 32, 34 వార్డుల్లో గంజాయి, మత్తు ఇంజక్షన్లు వాడే వారు ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నారని, వారే మత్తులో ఇలాంటిì పనులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు. సీసీ కెమెరాలు అవసరం.. టూ టౌన్ పరిధిలోని ప్రధాన రహదారుల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ వాటిని ఏర్పాటు చేసి ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను స్థానికులు కోరుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. స్థానిక సంఘాల ప్రతినిధులు దాతలను ఏర్పాటు చేస్తే అందుకు తగిన విధంగా వారికి పోలీసు శాఖ సహకరిస్తుంది. ఇప్పటికే కొబ్బరితోటలో స్వస్ఛంద సంస్థల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతి రోజు ఈ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేస్తాం. – నరసింహారాజు, ఎస్ఐ,టూటౌన్ పోలీస్ స్టేషన్ అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందించండి 32, 34 వార్డుల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన, కొత్త వారు కనిపించినా వారిని నిలువరించి ప్రశ్నించండి. లేదా పోలీసులకు సమాచారం అందజేయండి. ఇప్పటికే బీట్లు పెంచాం. నిరంతర నిఘా ఏర్పాటు చేసాం. ఎవరి మీదైన అనుమానం వస్తే డయల్ 100కి గాని టూటౌన్ పోలీస్ స్టేషన్ 0891–2783672 నంబర్లకు తెలియజేయండి. – కూనిబిల్లి శ్రీను, క్రైం ఎస్ఐ, టూటౌన్ -
గజదొంగై ఇద్దరు భార్యలను మెయింటెన్ చేస్తూ..
బెంగళూరు: ఇద్దరు భార్యలను పోషించేందుకు ఒక భర్త దొంగ అవతారమెత్తాడు. అప్పటి వరకు కూలీనాలి చేసుకుంటూ బ్రతికిన అతడు రెండు కుటుంబాలను పోషించడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో స్కూటర్ల దొంగగా మారాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 స్కూటర్లు కొట్టేశాడు. వీటి విలువు దాదాపు రూ.15లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. వాటన్నింటిని వారు రికవర్ చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన మురళీ రామారావు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం చేయడం మొదలుపెట్టాడు. అయితే, క్రమంగా వారి పోషణ భారం కష్టమై పోయింది. దీంతో అప్పటి వరకు కూలిగా ఉన్న అతడు ఒక్కసారిగా దొంగ అవతారమెత్తాడు. ఒక భార్య దగ్గరకు వెళ్లే సమయంలో బస్సులో వెళుతూ వచ్చే సమయంలో ఓ స్కూటర్ కొట్టేసి దానిపై మరో భార్య వద్దకు వెళ్లేవాడు. అడిగిన ప్రతిసారి తన స్నేహితుల స్కూటర్లు అని చెప్పేవాడు. అయితే, ఈ నెల 5న మంత్రి మాల్ వద్ద హోండా డియో ద్విచక్ర వాహనాన్ని దొంగిలిస్తూ పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం బయటపడింది.