కడలి తరంగం
` వీధులన్నీ నిండిపోగా.. రోడ్లపై రాకపోకలు స్తంభించిపోయూరుు. వైఎస్సార్ జనభేరి పేరిట ఎన్నికల సమర శంఖారావం పూరించేందుకు శుక్రవారం నరసాపురం వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఆయనపై తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. స్టీమర్ రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. నిజాయితి, విశ్వసనీయత అనే పదాలకు అర్థం తెలిసిన వాడే నాయకుడు. కార్యకర్తలు కాలర్ ఎగరేసి అతనే మా నాయకుడని గర్వంగా చెప్పుకునేలా మసలుకునే వాడే నాయకుడు. ఒక మాట చెబితే దానిని నిలుపుకోవడంలో మడమ తిప్పని వాడే నాయకుడనిపించుకుంటాడ’ని నాయకుడనే పదానికి వైఎస్ జగన్ నిర్వచనం చెప్పారు.
ఆయన ప్రసంగించినంతసేపూ ప్రతి మాటకు జనం జయజయధ్వానాలు పలికారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆల్ ఫ్రీ హామీల మర్మాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డివిడమరిచి చెబుతున్నప్పుడు జనం ఆసక్తిగా విన్నారు. బాబు బుర్రలో ఇన్ని కుట్రలున్నాయా అని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన సోదరుడు కొత్తపల్లి జానకిరామ్, వందలాది మంది అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆప్యాయంగా పలకరిస్తూ...
శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమాశ్ర యం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు బయలుదేరారు. హనుమాన్ జంక్షన్ వద్ద కని పించిన వృద్ధులను ఆప్యాయంగా పలకరిం చారు. అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం సమీపంలో వైఎస్సార్ సీపీ నేత చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఫామ్ హౌస్‌లో కొద్దిసేపు ఆగారు. అక్కడి నుంచి తణుకు, పెరవలి, పెనుగొండ మీదుగా నరసాపురం పయనమయ్యారు. అడుగడుగునా ఆయనకు అభిమాన ప్రవాహం అడ్డుపడింది. ప్రతి ఒక్కరినీ ఆగిమరీ ఆయన పలకరించారు. మార్టేరు, పాలకొల్లు సెంటర్లలో పెద్దఎత్తున ప్రజలు జననేతకు జేజేలు పలికారు. నరసాపురంలో అడుగుపెట్టే సందర్భంలో జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగ తం లభించింది. యువకులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పూలతో అలంకరించిన ఏడు పంచకల్యాణి ఆశ్వాలతో కూడిన రథంపై జగన్మోహన్రెడ్డిని ఎక్కించి సభావేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు జనభేరి బహిరంగ సభ మొదలైంది.
వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంతసేపూ జనం పూల వర్షం కురిపించారు. చంద్రబాబులా సాధ్యం కాని హామీలు ఇచ్చి మాట తప్ప డం తనకు రాదని, చెప్పినవన్నీచేసి తీరుతానని, చెప్పనివి కూడా చేస్తానని జనానికి జగన్ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆవేశాన్ని రగిలించేలా.. జనాన్ని ఆలోచింపజేసేలా సాగింది. సభానంతరం వేదిక దిగుతున్నప్పుడు కూడా సమీప భవంతులపై నుంచి అభిమానులు పూలు చల్లి వీడ్కోలు పలికారు. అంతకుముందు సభలో వైఎస్ జగన్‌ను కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇతర నాయకులు గజమాలతో సత్కరించారు. పూల కిరీ టాన్ని జననేతకు అలంకరించేందుకు ప్రయత్నించగా జగన్ దానిని కొత్తపల్లి శిరస్సున ఉంచారు. అవినీతిపై రామబాణాన్ని ఎక్కుపెట్టినట్టు పూల ధనుస్సుతో బాణాన్ని జగన్ ఎక్కుపెట్టారు.
సభ ముగించుకుని రాత్రి బసకు పాలకొల్లులోని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నివాసానికి వెళ్లారు. జగన్మోహన్రెడ్డి వెంట పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్‌గౌడ్, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, నిడదవోలు వైసీపీ నేత జీఎస్‌రావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు, రాజోలు నియోజకవర్గ సమన్వయకర్త బొంతు రాజేశ్వరావు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాస్, నరసాపురం పట్టణ, మండల అధ్యక్షులు నల్లిమిల్లి జోషప్, దొంగ గోపాలకృష్ణ, పార్టీ నాయకులు సాయినాథ్ ప్రసాద్, తదితరులు ఉన్నారు.