ఏఎల్పీలో ఊపందుకున్న ఉత్పత్తి
వెయ్యి నుంచి 3వేల టన్నులకు..
మరో 15 రోజుల్లో 10వేల టన్నులు వెలికితీతకు నిర్ణయం
యైటింక్లయిన్కాలనీ(కరీంనగర్) : అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్టు నుంచి బొగ్గు ఉత్పత్తి ఊపందుకుంది. ప్రారంభంలో రోజుకు వెయ్యి టన్నులు వెలికితీసిన అధికారులు ఆ తర్వాత రెండు వేల టన్నులకు.. శుక్రవారం నుంచి మూడువేల టన్నులకు పెంచగలిగారు. షేరర్ యంత్రం కటింగ్ చేసిన బొ గ్గును చైనా స్టీల్కార్డ్ బెల్ట్ ద్వారా ఎప్పటికప్పు డు ఓసీపీ-1 సీహెచ్పీకి తరలిస్తున్నారు.
మెయింటనెన్స్ కోసం రోజూ ఉదయం5 నుంచి 11గంటల వరకు బొగ్గు రవాణాకు వి రామం ఇస్తున్నారు. కొద్ది రోజుల్లో సమస్యల న్నింటిని అధిగమించి రోజుకు 10వేల టన్ను ల బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా యాజమాన్యం ముందుకు సాగుతోంది. అంతకుముందే పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపడతామని ఆర్జీ-3 జీఎం వెంకట్రామయ్య, ఏఎల్పీ జీఎం భాస్కర్రావు, ప్రాజెక్టు ఏజీఎం వీరారెడ్డి పేర్కొన్నారు.
నెలకు 18వేల టన్నుల ఉత్పత్తి
విదేశీ యంత్రాల సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయి సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ట్రయల్న్ ్రపూర్తయిన త ర్వాత మూడు నెలల పాటు రోజుకు 18వేల ట న్నుల చొప్పున ఉత్పత్తి తీయడానికి అధికారులు యోచిస్తున్నారు. ఇందుకోసం ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.