steel planet
-
విశాఖ ఉక్కులో డిప్యుటేషన్ల రగడ
ఉక్కు నగరం (విశాఖ): విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది. తమకు అవసరమున్న పోస్టులు, విధివిధానాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలు నగర్నార్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖ ద్వారా బయటకు పొక్కాయి. స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చేపడుతున్న అనేక పొదుపు చర్యల్లో భాగంగా 500 మంది అధికారులు, ఉద్యోగులను నగర్నార్ ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపాలని యాజమాన్యం నిర్ణయించింది. తద్వారా ప్లాంట్‌పై ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్యం ప్రకటించింది. దశలవారీగా డిప్యుటేషన్దశలవారీగా పంపనున్న జాబితాలో మొదటి విడతగా 100 మంది అధికారులను డిప్యుటేషన్‌పై పంపేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఉక్కు యాజమాన్యం నగర్నార్ ప్లాంట్ యాజమాన్యానికి ఈ నెల 11న లేఖ రాసింది. ఆ లేఖపై స్పందిస్తూ నగర్నార్ ప్లాంట్ యాజమాన్యం తమకు కావాల్సిన సిబ్బంది, విధివిధానాలపై విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి లేఖ రాసింది. అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరుతూ ఓ నమూనాను పంపింది. అధికారులకు కావాల్సిన విభాగాలు, గ్రేడ్లకు చెందిన సిబ్బంది వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 23 నుంచి 25 వరకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోనే ఇంటర్వ్యూలు చేయనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా డిప్యుటేషన్ అంశాన్ని మొదటి నుంచీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు నగర్నాగర్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఖలోని విధి విధానాల్లో క్లారిటీ లేదని, ఉద్యోగుల వ్యక్తిగత అంగీకారంతో డిప్యుటేషన్ అంటే.. జరిగే పని కాదని ఉక్కు అధికారుల సంఘం (సీ) నాయకులు వ్యాఖ్యానించారు.డిప్యుటేషన్ ప్రతిపాదనను విరమించుకోవాలిస్టీల్ప్లాంట్లో మొత్తం 20 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం 12,600 మంది మాత్రమే ఉన్నారు. ఇందులోంచి కూడా ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు డిప్యుటేషన్‌పై పంపిస్తామంటే మేం ఎలా అంగీకరిస్తాం. ఉన్న ఉద్యోగులను ఉపయోగించి పూర్తి ఉత్పత్తి సాధించాలి గానీ.. డిప్యుటేషన్‌కు పంపడమేంటి. దీనిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. యాజమాన్యం ఆ ప్రతిపాదనను విరమించుకోవాలి. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షుడు, స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ -
విన్నారు... చూశారు
జమ్మలమడుగు,న్యూస్‌లైన్: జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను సెయిల్ ప్రతినిధుల బృందం ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సెయిల్ కంపెనీకి చెందిన ఆర్.కె.సిన్హా, ఏ.మైత్రి, బి.సర్కార్, కుమార్, ఎస్.సింగ్, సావర్ని, బెనర్జీ, సాహులతో కూడిన బృందం మైలవరం మండలం లింగాపురం సమీపంలోని ఎం.కంబాల దిన్నె వద్ద ఉన్న భూములతో పాటు బ్రహ్మణిని కూడా పరిశీలించారు. బ్రహ్మణికి కేటాయించిన భూముల వివరాలతో పాటు స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం యాజమాన్యం ఎంత ఖర్చు చేసిందో వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైలవరం మండలంలోని కంబాలదిన్నె సమీపంలో వున్న భూమిని పరిశీలించారు. అంతకుమునుపు బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్ మీటింగ్ హాల్లో బ్రహ్మణి ఇంజినీర్లు, స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ ఆవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడినారాయణరెడ్డి మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిలతో కలిసి చర్చించారు. నియోజకవర్గంలోనే చేపట్టాలి.. జమ్మలమడుగు నియోజకవర్గంలోనే స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే కడప ప్రాంతంలో ఎయిర్‌పోర్టుతో పాటు విద్య,వైద్యపరంగా ఎన్నో సదుపాయాలు సమకూరుతున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతమైన జమ్మలమడుగులో పరిశ్రమలు స్థాపించటానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చ ని, స్టీల్‌ప్లాంట్‌ను జమ్మలమడుగు నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలని కోరా రు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి కావలసిన నీటిని మైలవరం, గండికోట జలాశయాలనుంచి తీసుకోవచ్చన్నారు. ముడి సరుకులు రవాణా చేసుకోవటానికి నేషనల్ హైవేరోడ్డుతోపాటు, రైల్వే సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు. విద్యుత్ అవసరాల కోసం ఆర్టీపీపీ ఉందన్నారు. బ్రహ్మణిపై అనాసక్తి బహ్మణి పరిశ్రమపై సెయిల్ అధికారులు అసక్తి చూపలేదు. పరిశ్రమ ఏర్పాటు కోసం చైనా నుంచి ముడిసరుకు తీసుకుని వచ్చామని, ఓబుళాపురం నుంచి మైనింగ్ లీజు తీసుకున్నామని బ్రహ్మణి ప్రతినిధులు తెలిపారు. చైనా నుంచి వచ్చిన మిషనరీ పనికిరాదని ఓబుళాపురం గనులనుంచి వచ్చే ఐరన్ ఓర్ కంటే హోస్పేట్ ఐరన్‌ఓర్ నాణ్యమైనదిగా ఉంటుందని సూచిం చారు. బ్రహ్మణి పరిశ్రమకు సంబంధించిన భూముల కేసులు హైకోర్టులో ఉండటంతో సెయిల్అధికారులు స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించకుండానే వెళ్లిపోయారు. 20వేల కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం.. 20వేల కోట్లతో మూడు మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం భూములను పరిశీలించారని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి.గోపాల్ పేర్కొన్నారు. మైలవరం మండలంలోని ఎం.కంబాలదిన్నె సమీపంలో ప్రభుత్వానికి సంబంధించిన 6వేల ఎకరాల భూమి ఉండటంతో దానిని పరిశీలించామన్నారు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరిగితే నిరుద్యోగులకు ఉపాధితోపాటు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో కూడిన ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుందన్నారు. ఆర్డీఓ జి.రఘునాథరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. అన్ని వనరులు : ఎమ్మెల్యే ఆది స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి జమ్మలమడుగు నియోజకవర్గం అన్నివిధాలుగా అనువైందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మైలవరం మండలంలోని లింగాపురం సమీపంలో ఉన్న టన్నెల్క్యాంపు ఆఫీసు వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మణి ఆగిపోవడం, రాష్ట్ర విభజన జరుగడంతో జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని కేంద్రప్రభుత్వం సూచించిందన్నారు. అందులో భాగంగానే సెయిల్ కంపెనీ బృందం బ్రహ్మణి, కంబాలదిన్నె ప్రాంతాల్లో పర్యటించిందన్నారు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరిగితే లక్షకుటుంబాలు బాగుపడటంతోపాటు అనుబంధంగా 10వేల కోట్ల పెట్టుబడులతో సంస్థలు వస్తాయన్నారు. అంతేకాకుండా మెడికల్ , ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వస్తాయన్నారు. వైజాగ్ మాదిరిగా జమ్మలమడుగు సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్లాంట్‌కు కావలసిన 750 మెగావాట్ల విద్యుత్‌ను ఆర్టీపీపీ, విండ్‌పవర్, సోలార్ సిస్టం ద్వారా వినియోగించుకోవచ్చన్నారు. నేషనల్హైవే, రైల్వే లైన్ ఉన్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2500 ఎకరాలలోపే భూమి అవసరముంటుందని కంబాలదిన్నె సమీపంలో ఒకే చోట 6 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. -
సెయిల్పైనే ఆశలు
‘ఉక్కు’పరిశ్రమ ఏర్పాటుపై మళ్లీ జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిరుద్యోగ సమస్యను రూపుమాపేందు కు జిల్లాలో ‘బ్రహ్మణి’ ఉక్కు కర్మాగారం స్థాపనకు మహానేత వైఎస్ పూనుకున్నారు. ఆయన మృతి తర్వాత కిరణ్ సర్కారు పరిశ్రమను, అందుకు కేటాయించిన భూములు, నీటి కేటాయింపులను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో జిల్లాలో ‘ఉక్కు’ కర్మాగారం ఏర్పాటు చేయాలనే అంశాన్ని కేంద్రం పొందుపరిచింది. ఈ క్రమంలోనే ‘సెయిల్’ బృందం ఉక్కుపరిశ్రమ స్థాపన కోసం నేడు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో పర్యటించనుంది. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సాక్షి, కడప: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో ఒకటి, సీమాంధ్రలో మరొక స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ కు సంబంధించి ఖమ్మం జిల్లా బయ్యారంలో, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మన జిల్లాలో ఉక్కు పరిశ్రమను స్థాపిం చేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకర ణ బిల్లు-2014లో ఆమోదముద్ర వేశా రు. జూన్ 2వతేదీతో రాష్ట్రం రెండుగా విడిపోనుంది. ఈక్రమంలోనే కేంద్రపరిధిలోని సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) కంపెనీకి చెందిన 8మంది సభ్యుల బృందం ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకుని జిల్లా పర్యటనకు విచ్చేసింది. సెయిల్ డీజీఎంలు ఆర్కే సిన్హా, ఏ మైతీ, బి.సర్కార్, ఏ కుమార్, ఏఎస్.సావర్ని, ఎస్ సింగ్, అడిషనల్మేనేజర్లు ఆర్. బెనర్జీ, డి.సాహులు శనివారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ శశిధర్‌తో పాటు జి ల్లాలోని పలుశాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, నీటి లభ్య త, రవాణా సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో ఉక్కు పరిశ్ర మ ఏర్పాటుకు మూడు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ వివరించారు. జమ్మలమడుగు మండలం అంబవరం, మైలవరం మండలం కంబాలదిన్నె, చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిలను సూచించారు. ఈ మూడు ప్రాంతాల్లో నేడు సెయిల్ బృందం పర్యటించనుంది. కొప్పర్తి కూడా రేసులోనే..: చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిని కూడా కర్మాగారం స్థాపనకు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఏపీఐఐసీకి చెందిన 6,663ఎకరాల భూమి ఉంది. అంబవరం, కంబాలదిన్నెతో పాటు ఇక్కడ కూడా 2927.42 ఎకరాల్లో ఉక్కుపరిశ్రమ స్థాపన కోసం కలెక్టర్ సూచించారు. అయితే ఇక్కడ నీటి సమస్య ప్రధానంగా వేధించొచ్చు. సోమశిల నుంచి నీటిని రప్పించేందుకు అప్పటి సీఎం వైఎస్ 700 కోట్లతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అయితే 20శాతం పనులు పూర్తయ్యాయి. దీన్ని కిరణ్‌సర్కారు తుంగలోకి తొక్కింది. ఇది పూర్తయితే కొప్పర్తిలో కూడా పరిశ్రమ ఏర్పాటుకు అనువుగా ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం సహకారం కూడా అవసరం: సెయిల్ కంపెనీ పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చినా అందుకు సంబంధిం చిన భూ కేటాయింపులు, నీటి వనరుల ను రాష్ట్రప్రభుత్వమే చూసుకోవాలి. కొప్పర్తిలో పరిశ్రమ ఏర్పాటు చేయదలిస్తే ముందుగా రాష్ట్రప్రభుత్వం సోమశిల మంచినీటి పథకాన్ని పూర్తిచేయాలి. అప్పుడే సెయిల్ బృందం పరిశ్రమ స్థా పనపై ఆలోచిస్తుంది. అలాగే అంబవ రం, కంబాలదిన్నెల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా మైలవరం జలశాయం నుంచి నీటి కేటాయింపులు కల్పించాలి. మొత్తం మీద రాష్ట్రం విడిపోయిందనే బాధ ఓ వైపు ఉన్నా పరిశ్రమ ఏర్పాటుకు సెయిల్ బృందం రావడంతో జిల్లా వాసులు ఆనందంగా ఉన్నారు.