‘ఉక్కు’పరిశ్రమ ఏర్పాటుపై మళ్లీ జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిరుద్యోగ సమస్యను రూపుమాపేందు కు జిల్లాలో ‘బ్రహ్మణి’ ఉక్కు కర్మాగారం స్థాపనకు మహానేత వైఎస్ పూనుకున్నారు. ఆయన మృతి తర్వాత కిరణ్ సర్కారు పరిశ్రమను, అందుకు కేటాయించిన భూములు, నీటి కేటాయింపులను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో జిల్లాలో ‘ఉక్కు’
కర్మాగారం ఏర్పాటు చేయాలనే అంశాన్ని కేంద్రం పొందుపరిచింది. ఈ క్రమంలోనే ‘సెయిల్’ బృందం ఉక్కుపరిశ్రమ స్థాపన కోసం నేడు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో పర్యటించనుంది. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి
ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
సాక్షి, కడప: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో ఒకటి, సీమాంధ్రలో మరొక స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ కు సంబంధించి ఖమ్మం జిల్లా బయ్యారంలో, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మన జిల్లాలో ఉక్కు పరిశ్రమను స్థాపిం చేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకర ణ బిల్లు-2014లో ఆమోదముద్ర వేశా రు. జూన్ 2వతేదీతో రాష్ట్రం రెండుగా విడిపోనుంది.
ఈక్రమంలోనే కేంద్రపరిధిలోని సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) కంపెనీకి చెందిన 8మంది సభ్యుల బృందం ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకుని జిల్లా పర్యటనకు విచ్చేసింది. సెయిల్ డీజీఎంలు ఆర్‌కే సిన్హా, ఏ మైతీ, బి.సర్కార్, ఏ కుమార్, ఏఎస్.సావర్ని, ఎస్ సింగ్, అడిషనల్‌మేనేజర్లు ఆర్. బెనర్జీ, డి.సాహులు శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ శశిధర్‌తో పాటు జి ల్లాలోని పలుశాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, నీటి లభ్య త, రవాణా సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో ఉక్కు పరిశ్ర మ ఏర్పాటుకు మూడు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ వివరించారు. జమ్మలమడుగు మండలం అంబవరం, మైలవరం మండలం కంబాలదిన్నె, చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిలను సూచించారు. ఈ మూడు ప్రాంతాల్లో నేడు సెయిల్ బృందం పర్యటించనుంది.
కొప్పర్తి కూడా రేసులోనే..:
చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిని కూడా కర్మాగారం స్థాపనకు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఏపీఐఐసీకి చెందిన 6,663ఎకరాల భూమి ఉంది. అంబవరం, కంబాలదిన్నెతో పాటు ఇక్కడ కూడా 2927.42 ఎకరాల్లో ఉక్కుపరిశ్రమ స్థాపన కోసం కలెక్టర్ సూచించారు. అయితే ఇక్కడ నీటి సమస్య ప్రధానంగా వేధించొచ్చు. సోమశిల నుంచి నీటిని రప్పించేందుకు అప్పటి సీఎం వైఎస్ 700 కోట్లతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అయితే 20శాతం పనులు పూర్తయ్యాయి. దీన్ని కిరణ్‌సర్కారు తుంగలోకి తొక్కింది. ఇది పూర్తయితే కొప్పర్తిలో కూడా పరిశ్రమ ఏర్పాటుకు అనువుగా ఉంటుంది.
రాష్ట్రప్రభుత్వం సహకారం కూడా అవసరం:
సెయిల్ కంపెనీ పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చినా అందుకు సంబంధిం చిన భూ కేటాయింపులు, నీటి వనరుల ను రాష్ట్రప్రభుత్వమే చూసుకోవాలి. కొప్పర్తిలో పరిశ్రమ ఏర్పాటు చేయదలిస్తే ముందుగా రాష్ట్రప్రభుత్వం సోమశిల మంచినీటి పథకాన్ని పూర్తిచేయాలి. అప్పుడే సెయిల్ బృందం పరిశ్రమ స్థా పనపై ఆలోచిస్తుంది. అలాగే అంబవ రం, కంబాలదిన్నెల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా మైలవరం జలశాయం నుంచి నీటి కేటాయింపులు కల్పించాలి. మొత్తం మీద రాష్ట్రం విడిపోయిందనే బాధ ఓ వైపు ఉన్నా పరిశ్రమ ఏర్పాటుకు సెయిల్ బృందం రావడంతో జిల్లా వాసులు ఆనందంగా ఉన్నారు.
సెయిల్‌పైనే ఆశలు
Published Sun, May 25 2014 2:01 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement