ఇక ఏపీ 03 | Andhra pradesh 03 | Sakshi
Sakshi News home page

ఇక ఏపీ 03

Published Mon, May 26 2014 1:54 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Andhra pradesh 03

మీరు కొత్త వాహనం కొంటున్నారా.. డ్రైవింగ్ లెసైన్స్, వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా.. అయితే ఈ నెల 30లోపు పూర్తి చేసుకోండి..  ఈ నెల 31, జూన్ ఒకటో తేదీల్లో రవాణశాఖ కార్యకలాపాలను  పూర్తిగా నిలిపేయనున్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ఇప్పుడున్న సర్వర్‌ను నిలిపేసి, రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా రెండు సర్వర్‌లను ఏర్పాటు చేయనున్నారు. మళ్లీ జూన్ 2వ తేదీ నుంచి సేవలను ప్రారంభించనున్నారు.
 
 సాక్షి, కడప: రాష్ట్రవిభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలో రెండు రోజులపాటు రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం  రాష్ట్రంలో త్రీటైర్ ఆర్కిటెక్చర్ సాప్ట్‌వేర్ విధానం ద్వారా రవాణశాఖ ఆన్‌లైన్ సేవలు అందిస్తోంది. దీని ప్రధాన సర్వర్ హైదరాబాద్ కేంద్రంగా ఉంది.
 
 జూన్2వ తేదీ తెలంగాణ అపాయింటెడ్ డే.  ఆ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా సర్వర్లు ఏర్పాటు చేయాలి. వేర్వేరుగా సేవలు అందించాలి. దీంతో రవాణశాఖ అధికారులు ఆదిశగా చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల31తో పాటు జూన్ ఒకటో తేదీన ప్రధాన సర్వర్‌ను పూర్తిగా ఆపేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సేవలు నిలిచిపోనున్నాయి. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించాలన్నా, డ్రైవింగ్ లెసైన్స్ పొందాలన్నా మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరగాలి. హైదరాబాద్‌లోని ప్రధాన సర్వర్‌కు అనుసంధానమైతేనే వాటికి సంబంధించిన నెంబర్లు, అనుమతులు కన్పిస్తాయి. తద్వారా రిజిస్ట్రేషన్, లెసైన్స్‌ల జారీ సాధ్యమవుతంది. సర్వర్ నిలిపేయడం వల్ల వీటిని కేటాయించేందుకు ఆరెండు రోజులు వీలుండదు.
 
 ముందు రెండురోజులు
 అదనపు సమయం:
 మే 31, జూన్ ఒకటో తేదీల్లో సేవలకు పూర్తిస్థాయిలో ఆటంకం కలగనున్న నేపథ్యంలో మే 29, 30 తేదీల్లో అదనపు వేళల్లో పనిచేసేందుకు రవాణశాఖ అధికారులు నిర్ణయించారు. సాధారణ రోజుల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ కౌంటర్‌లో సేవలు అందిస్తారు. మే 29, 30 తేదీల్లో మాత్రం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకూ సిబ్బంది కౌంటర్లలో అందుబాటులో ఉంటారు.
 
 ఆ రెండురోజులు సేవలు బంద్: కృష్ణవేణి, డీటీసీ. రవాణశాఖ.
  మే 31,జూన్ ఒకటో తేదీన రవాణశాఖలో అన్ని రకాల సేవలు నిలిపేస్తున్నాం. సర్వర్ నిలిచిపోనుండటంతో  రవాణశాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరెండురోజులు సేవలు అందుబాటులో ఉండవని వినియోగదారులు గమనించాలి.సోమవారం పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
 
 కొత్త వాహనాల క్రయవిక్రయాలకు బ్రేక్
 రెండురోజుల పాటు కొత్తవాహనాల క్రయవిక్రయాలు ఆగిపోనున్నాయి. వాహనాల విక్రయదారులు వాహనాలను విక్రయించేటప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ సంఖ్య(టీఆర్ నెంబర్)ను జారీ చేస్తారు.
 
 ఈ ప్రక్రియ జరగాలంటే రవాణశాఖ ప్రధాన సర్వర్‌తో అనుసంధానమవ్వాలి. టీఆర్ నెంబరు లేకుండా వాహనాలు షోరూం నుంచి రోడ్డెక్కే అవకాశం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండురోజుల పాటు షోరూముల్లో వాహనాల విక్రయాలు కూడా నిలిచిపోనున్నాయి. వాహనాలకు సంబంధించిన పలురకాల పన్నులు, లెర్నింగ్ లెసైన్స్‌లు, డ్రైవింగ్ లెసైన్స్‌ల రూసుముల వంటివి ఈ సేవ, మీసేవ కేంద్రాల ద్వారా రోజువారీ చెల్లింపులు జరుగుతుంటాయి. ఆ రెండు రోజుల్లో రవాణశాఖకు సంబంధించి ఎలాంటి రుసుములు, చలానాలు కట్టంచుకోరు. అన్ని రకాల లావాదేవీలు ఆగిపోనున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement