స్టెప్ ఆన్ మూన్
‘‘సినిమా రంగానికి సంబంధించిన ప్రతి శాఖలోనూ కొత్తవారు రావాలి. వారికి తగిన ప్రోత్సాహం లభించాలి. ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన జైదీప్ రవిప్రకాశ్కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. ‘స్టెప్ ఆన్ మూన్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఆరంభించారు జైదీప్. ఈ ప్రారంభోత్సవంలో తమ్మారెడ్డి భరద్వాజ్, నిఖిల్, అయోధ్యకుమార్, భూషణ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. బేనర్ లోగో, వెబ్సైట్ను భరద్వాజ్, నిఖిల్ ఆవిష్కరించారు. పుణేలో డీఎఫ్టీ చేశానని, సినిమాలు నిర్మించడం మాత్రమే కాదు మ్యూజికల్ ఆల్బమ్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్.. ఇలా అన్నీ చేయాలనుకుంటున్నామని జైదీప్ తెలిపారు.