Stockbroker
-
సైబర్ దాడులు: సెబీ తాజా ఆదేశాలు
న్యూఢిల్లీ: అన్ని రకాల సైబర్ దాడులపై స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఆరు గంటల్లోగా నివేదించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశించింది. సైబర్ దాడులు, బెదిరింపులు, అతిక్రమణల సంబంధిత సంఘటనలను గుర్తించిన ఆరు గంటల్లోగా సమాచారం అందించ వలసి ఉంటుందని తెలియజేసింది. ఇలాంటి ఘటనలపై నిర్దేశిత సమయంలోగా స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు, సెబీకి తెలియజేయవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి అంశాలపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్)కు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా సమయానుగుణంగా వెల్లడించవలసి ఉంటుందని తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. వీటికి అదనంగా నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్(ఎన్సీఐఐపీసీ) రక్షణాత్మక వ్యవస్థగా గుర్తించిన స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పారి్టసిపెంట్లు సైతం సైబర్ దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందించవలసి ఉంటుంది. ఎన్‌సీఐఐపీసీకి నివేదించవలసిందిగా సెబీ వివరించింది. పార్శ్వనాథ్‌కు చెక్ లిస్టింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో సెక్యూరిటీ మార్కెట్ల నుంచి రియల్టీ రంగ కంపెనీ పార్శ్వనాథ్ డెవలపర్స్‌ను సెబీ ఆరు నెలలపాటు నిషేధించింది. అంతేకాకుండా రూ. 15 లక్షల జరిమానా సైతం విధించింది. 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాల్సింది ఆదేశించింది. కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్ల లెడ్జర్ ఖాతాలలో ఔట్‌స్టాండింగ్ మొత్తాలపై ప్రొవిజన్లు చేపట్టడంలో వైఫల్యానికి సెబీ చర్యలు చేపట్టింది. కన్స్ట్రక్షన్ కాంట్రాక్టుల విషయంలో అకౌంటింగ్ ప్రమాణాలను పాటించకపోవడంపై కొరడా ఝళిపించింది. కోటక్ ఏఎంసీకి సెబీ జరిమానా ఎస్సెల్ గ్రూపు కంపెనీల పెట్టుబడుల కేసు ఎస్సెల్ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోటక్ ఏఎంసీ, సంస్థ ఉద్యోగులకు సెబీ రూ.1.6 కోట్ల పెనాల్టీలను విధించింది. కోటక్ ఏఎంసీ ఎండీ నీలేష్ షా, కోటక్ ఏఎంసీ ఫండ్ మేనేజర్లు లక్ష్మీ అయ్యర్, దీపక్ అగర్వాల్, అభిషేక్ బిసేన్, కాంప్లియన్స్ ఆఫీసర్ జాలీభట్, నాడు పెట్టుబడుల నిర్ణయాలను ఆమోదించిన ఇన్వెస్ట్ కమిటీ సభ్యుడు గౌరంగ్‌షాలను 45 రోజుల్లోగా పెనాల్టీ చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. కోటక్ ఏఎంసీ ఆరు డెట్ పథకాల తరఫున ఎస్సెల్ గ్రూపు రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి గడువు 2019 ఏప్రిల్, మే నెలల్లో ముగిసింది. ఎస్సెల్ గ్రూపు పీకల్లోతు రుణ సంక్షోభంలో జారిపోవడంతో, ఆ గ్రూపు ప్రమోటర్లు, సంస్థలతో కోటక్ ఏఎంసీ ఒక ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థల రుణ పత్రాలకు 2019 సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అప్పటివరకు ఆరు కోటక్ డెట్ పథకాల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయకపోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా సెబీ పరిగణించింది. -
కూతురి సాయంతోనే భార్య మృతదేహం తరలింపు..?
దారుణ హత్య విషయం వెలుగు చూసిన గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ అపార్ట్మెంట్లో మంగళవారం విషాద ఛాయలు అలుముకున్నాయి. శంషాబాద్‌లోని మదనపల్లిలో భార్య శరీర భాగాలను కాల్చివేసి పట్టుబడిన రూపేష్ కుమార్ అపార్ట్మెంట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని తెలిసింది. తెలుగు, హిందీ రాకపోవటంతో అతని భార్య సింథియా కూడా బయటకు వచ్చేదికాదని సమాచారం. జైన్ శిల్ప సైబర్‌సిటీ అపార్ట్మెంట్లోని రమణారావుకు చెందిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని జి ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని రెండేళ్లుగా రూపేష్ కుమార్, సింథియాతో పాటు కూతురు సానియా, సింథియా సోదరుడు నివాసం ఉంటున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే రూపేష్ రోజూ ఉదయం 10 గంటల బయటకు వెళ్లి సాయంత్రం 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతని బావమరిది బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఫంక్షన్‌కు కలిసి వెళ్లిన రూపేష్, సింథియా, సానియా తిరిగి రాగా సింథియా సోదరుడు స్నేహితుల వద్దకు వెళ్లాడు. తన సోదరి హత్య విషయం తెలియని సింథియా సోదరుడు యథావిధిగా సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఫ్లాట్‌కు వచ్చాడు. తాళం చెవి లేకపోవడంతో అపార్ట్మెంట్లోనే తచ్చాడాడు. మీడియా ప్రతినిధులను చూసి విషయం తెలియటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రూపేష్, సింథియా గొడవ పడ్డట్లు తాము ఎప్పుడూ గమనించలేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. సింథియా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేది కాదని, రూపేష్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదని తెలిపారు. సింథియా సోదరుడే ఇంటి పనులు చేసేవాడని పేర్కొన్నారు. గుట్టుచప్పుడు కాకుండా హత్య అపార్ట్మెంట్లో ఎవరికి అనుమానం రాకుండా భార్య శరీరాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్ నుంచి కారులో వెళ్లి ఉంటాడని అపార్ట్మెంట్ వాసులు భావిస్తున్నారు. రూపేష్ ఫ్లాట్ పక్కనే లిఫ్ట్ ఉంది. కారు లిఫ్ట్ దగ్గరికి వచ్చే వీలుంది. కూతురుకు చెత్త అని చెప్పి ఆమె సాయంతోనే సూట్‌కేస్‌ను కారులో పెట్టుకొని వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కారులో ఏ సమయంలో బయటకు వెళ్లాడో తెలియని పరిస్థితి నెలకొంది. సింథియా ఎవరితోనూ మాట్లాడేది కాదు రూపేష్ పని మనుషులనెవరిని పెట్టుకోలేదు. సింథియా ఎప్పడైనా బయటకు వచ్చినా ఎవరితోనూ మాట్లాడేది కాదు. తెలుగు, హిందీ రాకపోవడంతో ఇరుగుపొరుగు వారితోను మాట్లాడేది కాదు. కూతురును ప్రతి రోజు స్కూల్ బస్సులో ఎక్కించేది. అపార్టుమెంట్లో భద్రత కరువు గచ్చిబౌలిలోని శిల్పాలేవుట్‌లో విసిరేసినట్లుగా ఉండే ఏకైక అపార్ట్మెంట్ జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ. 54 ఫ్లాట్లలో ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నివాసం ఉంటున్నారు. అపార్ట్‌మెంట్‌కు రెండు ద్వారాలున్నప్పటికీ సీసీ కెమెరా ఒక్కటీ లేదు. రాత్రి, పగలు విధులు నిర్వహించేందుకు ఇద్దరే సెక్యూరిటీ గార్డులు ఉండటం గమనార్హం. రాయదుర్గం ఎస్ఐ రాజశేఖర్ మంగళవారం అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. రూపేష్ ఫ్లాట్ యజమాని ఎవరని అక్కడి సూరప్‌వైజర్ శరణప్పను ఆరా తీశారు. సీసీ కెమెరాలను ఎన్ని ఉన్నాయని అడగగా ఒక్కటి కూడా లేదని చెప్పారు. తక్షణమే సీసీ కెమెరాలు అమర్చాలని అపార్ట్మెంట్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేస్తామని ఎస్ఐ తెలిపారు.