హైటెన్షన్
► వెల్లువెత్తుతున్న నిరసనలు
► విస్తరిస్తున్న ఉద్యమం
► నేడు పుదుక్కోట్టైలో దుకాణాల మూత
సహజ వాయువుల నిక్షిప్త సేకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకంపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రోకార్బన్ పథకం ఆపివేయాలనే డిమాండ్‌పై నిరసనకారుల దండయాత్రతో పుదుక్కోట్టై జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. గత 14 రోజులుగా సాగుతున్న పోరాటం మంగళవారం తీవ్రస్థాయికి చేరింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై : పుదుక్కోట్టై జిల్లా నెడువాసల్ గ్రామం నుంచి సహజవాయువుల నిక్షిప్తాన్ని సేకరించేందుకు కేంద్రం అనుమతించింది. ఇందుకు గ్రామ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. సహజవాయువుల కోసం కేంద్రం జారీ చేసిన ఉత్తరు్వలను ఉపసంహరించాల్సిదిగా కోరుతూ ఈనెల 16 నుంచి ప్రజలు నిరసన పోరాటాలు సాగిస్తున్నారు. నెడువాసల్ నాడియమ్మన్ ఆలయం మధ్యలో షెడు్డను ఏర్పాటు చేసుకుని గ్రామ ప్రజలు సమష్టిగా ఆందోళనలు జరుపుతున్నారు. ఈ ఆందోళనలకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, యువతీ యువకులు, విద్యార్థి సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మంగళవారం నాటికి పోరా టం ఉగ్రరూపం దాల్చింది.
సుమారు వంద గ్రామాలకు చెందిన ప్రజలు అభిప్రాయసేకరణ నిర్వహించగా ఏకగ్రీవంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. గ్రామసభలను నిర్వహించి 11 తీర్మానాలను ఆమోదించారు. ఈ పథకాన్ని కేంద్రం ఉపసంహరించే వరకు రోజూ ఒక్కో గ్రామానికి చెందిన ప్రజలు నిరసన శిబిరంలో కూర్చోవాలని, హైడ్రోకార్బన్ పథకంపై నిరసన వ్యక్తం చేస్తూ గ్రామాలో్లని అన్ని ఇళ్లపై నల్లజెండాలను ఎగరవేయాలని, అన్ని గ్రామాల్లో సభలను నిర్వహించి తీర్మానాలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని, నెడువాసల్ నుంచి పుదుక్కోట్టై జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మానవహారం నిర్మించాలని, పర్యావరణ శాఖపై పిటిషన్ వేయాలని, తమిళనాడు ఎంపీలంతా పార్లమెంటులో నిరసన గళం వినిపించాలని, కావేరీ డెల్టా జిల్లాలను ఒకటిచేసి వ్యవసాయ రక్షణ మండలంగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని పలు తీర్మానాలు చేశారు.
అంతేగాక, నెడువాసల్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తమ రేషన్, ఓటరు, ఆధార్ కారు్డలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అప్పగించాలని, యువతీ యవకులు, విద్యారు్థలు జిల్లా కేంద్రాన్ని ముట్టడించాలని, అన్ని ఇళ్ల వద్ద దివిటిలను వెలిగించి పోరాట స్ఫూర్తిని కలిగించాలనే తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల ప్రకారం మంగళవారం కరంపకుడి, ఆలంగుడి, సుందరపేట్టై తదితర వంద గ్రామాల్లో అన్ని ఇళ్లపై నల్లజెండాలను ఉంచారు. చెనై్నలో జల్లికట్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన తిరుచ్చి, తంజావూరు, తిరువారూరు తదితర జిల్లాలకు చెందిన యువత, విద్యారు్థలు, రైతులు నెడువాసల్ గ్రామానికి చేరుకోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామంలోకి ప్రవేశించే అన్ని దారుల వద్ద పోలీసులు తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఉద్యమకారులను అడు్డకుంటున్నారు. ఇదిలా ఉండగా, బుధవారం వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేసి మద్దతు ప్రకటిస్తున్నట్లు సంఘం ప్రకటించింది. హైడ్రోకార్బన్ పథకం కారైక్కాల్‌లో సైతం అమలు చేసే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలు ఉద్యమానికి ఉద్యుకు్తలవుతున్నారు. టీవీ నటి సోనియాబోస్ వెంకట్ ఆందోళనలో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ పథకంపై కేంద్రం వెనక్కు తగ్గకుంటే మెరీనాబీచ్ వద్ద జల్లికట్టు తరహా ఉద్యమం నిర్వహిస్తామని యువజన సంఘాలు హెచ్చరించాయి.
గ్యాస్‌పైపు నుంచి మంటలు :
హైడ్రోకార్బన్ పథకం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని కేంద్రం ఓ వైపు నమ్మబలుకుతుండగా మంగళవారం చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకుంది. నెడువాసల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని వానక్కంగాడు గ్రామంలో పరిశోధన కోసం అమర్చిన సహజవాయువు పైప్ నుంచి మంగళవారం మంటలు చెలరేగాయి. సమీపంలోని గ్రామస్తులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు.