Stoyinis
-
ఆసీస్‌కు సూపర్ ప్రాక్టీస్
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై భారీ విజయం చెన్నై: టీమిండియాతో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ఘనంగా ఆరంభించింది. తమ బ్యాట్స్‌మెన్‌కు ఫుల్ ప్రాక్టీస్ లభించడంతో మంగళవారం బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన ఏకైక వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ 103 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ స్టొయినిస్ (60 బంతుల్లో 76; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతడికి తోడుగా ఆరంభంలో వార్నర్ (48 బంతుల్లో 64; 11 ఫోర్లు), స్మిత్ (68 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (63 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టొయినిస్, మాథ్యూ వేడ్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభణకు ఆసీస్ చివరి 10 ఓవర్లలో 101 పరుగులు సాధించింది. వాషింగ్టన్ సుందర్, కుశంగ్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ 48.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీవత్స్ గోస్వామి (43), మయాంక్ అగర్వాల్ (42) రాణించారు. వీరి మధ్య రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏస్టన్ అగర్‌కు 4 వికెట్లు దక్కాయి. -
స్టోయినిస్ సూపర్ సెంచరీ వృథా
11 సిక్సర్లతో చెలరేగిన ఆల్‌రౌండర్ 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆక్లాండ్: 287 పరుగుల లక్ష్యం... 67 పరుగులకే ఆరు వికెట్లు ఫట్.. ఈ దశలో ఆస్ట్రేలియా కనీసం 150 పరుగులు సాధిస్తే గొప్పేనని మ్యాచ్ చూసినవారికి అనిపించింది. అయితే కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న ఆల్‌రౌండర్ స్టోయినిస్ (117 బంతుల్లో 146 నాటౌట్) మాత్రం తన అసమాన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 11 సిక్సర్లు, 9 ఫోర్లతో అతను ఎదురుదాడికి దిగడంతో కివీస్ వెన్నులో వణుకు పుట్టింది. అయితే 47వ ఓవర్లో ఆసీస్‌కు దురదృష్టం వెంటాడింది. సౌతీ వేసిన ఆ ఓవర్లో నాలుగు, ఐదో బంతులను స్టోయినిస్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఆసీస్ విజయ సమీకరణం 19 బంతుల్లో 7 పరుగులకు వచ్చింది. దీంతో కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ సెటప్ కోసం కాస్త సమయం తీసుకున్నాడు. షార్ట్ మిడాన్‌లో తనే ఫీల్డింగ్‌కు దిగాడు. ఆఖరి బ్యాట్స్‌మన్ హాజెల్‌వుడ్ నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్నాడు. చివరి బంతికి సౌతీ వేసిన యార్కర్‌ను స్టోయినిస్ మామూలుగానే ఆడగా బంతి విలియమ్సన్ వైపు వెళ్లింది. అయితే అప్పటికే హాజెల్‌వుడ్ లేని పరుగు కోసం క్రీజు వదిలి రెండు అడుగులు ముందుకు వచ్చాడు. దీంతో పక్కనే ఉన్న విలియమ్సన్ మెరుపు వేగంతో స్పందించి రనౌట్ చేయడంతో ఆసీస్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఉత్కంఠభరిత క్షణాల మధ్య ఆరు పరుగులతో విజయం సాధించిన కివీస్ సంబరాల్లో మునిగింది. చాపెల్–హ్యాడ్లీ ట్రోఫీలో 1–0తో ఆధిక్యం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో ముందుగా కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. బ్రూమ్ (73; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గప్టిల్ (61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఆసీస్ 47 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. 54 పరుగులకు ఐదు వికెట్లు పడిన దశలో క్రీజులోకొచ్చిన స్టొయినిస్ వరుసగా వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటంతో కివీస్‌ను వణికించాడు. ఫాల్క్‌నర్ (25; 1 ఫోర్)తో కలిసి ఏడో వికెట్‌కు 81 పరుగులు.. చివరి వికెట్‌కు హాజెల్‌వుడ్‌తో కలిసి 50 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యంలో హాజెల్‌వుడ్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదంటే స్టోయినిస్ విశ్వరూపం అర్థమవుతుంది. సాన్‌ట్నర్‌కు మూడు... బౌల్ట్, ఫెర్గూసన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.