straike
-
నిలిచిన ఈ–సేవలు..! సమ్మె బాటలో ఈ–పంచాయతీ సిబ్బంది
సూర్యపేట్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట నమ్మె చేస్తున్నారు. వీరి సమ్మె బుధవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా గ్రామ పంచాయతీల్లో ఈ–సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సేవల్లో వేగం పెంచేందుకే.. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు సేవల్లో వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ–పంచాయతీలను మంజూరు చేసింది. ఇందులో సేవలందించేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. అయితే వారికి వేతనాలు గ్రామపంచాయతీలే చెల్లించాలని నిర్ణయించడంతో వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం వారి మొర ఆలకిస్తుందన్న నమ్మకంతో ఉద్యోగులు తమ డిమాండ్లతో సమ్మె బాటపట్టారు. 63 మంది ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆధారంగా గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందిస్తున్న అన్ని రకాల సేవలను కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం ఈ–పంచాయతీ కార్యక్రమాన్ని 2014–15లో ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందుగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్(డీపీఎం)లను, తర్వాత గ్రామాల్లో క్లస్టర్ల వారీగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కార్వీ సంస్థ ద్వారా వీరిగా కంప్యూటర్ ఆపరేటర్లనను నియామకాలు జరిగాయి. ఆపరేటర్లందరికి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పరిపాలన నిధుల కింద 10శాతం కేటాయించింది. నెలకు రూ.8వేలకు తగ్గకుండా వేతనాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో ఒక డీపీఎంతో పాటు ఈ–పంచాయతీ, ఆర్జేసీ ఆపరేటర్లు 63 మంది పని చేస్తున్నారు. జిల్లాలో ఒక్కో ఆపరేటర్ 8 నుంచి 10 గ్రామ పంచాయతీల్లో చేస్తున్నారు. గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేస్తూ అనుసంధానకర్తలుగా వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అలాంటి తమకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ–పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. జిల్లా స్థాయిలో పనిచేసే డీపీఎంలకు పే స్కేల్ అమలు చేయాలి. గ్రామాల్లో పని చేసే ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించి వేతనం చెల్లించాలి. మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఉద్యోగ సిబ్బందికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగి మృతి చెందితే కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలి. -
సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న ఆదాయపన్ను శాఖ ఉద్యోగులు
-
ఆందోళనబాటలో వైద్య, ఆరోగ్య ఉద్యోగులు
డిమాండ్ల సాధనకు నిరాహారదీక్షలు అనంతపురం మెడికల్ : డిమాండ్ల సాధనకు వైద్య, ఆ రోగ్యశాఖ ఉద్యోగులు ఆందోâýæన బాట పట్టారు. స్థానిక డీఎంహెచ్ఒ కార్యాలయం ఎదుట సోమవారం సా మూహిక నిరాహారదీక్షలు చేపట్టారు. ఆ సంఘం ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ రవూఫ్సాహెబ్, కన్వీనర్ నాగరాజు మాట్లాడారు. వారాంతపు సెలవు మం జూరు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానం నుంచి త మకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా ఎంపిౖకెన పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. రక్త నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం పరిధిలోనే చేయాలని, మెడాల్ సంస్థను తొలగించాలన్నారు. మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. అ¯ŒSమోల్, ఎంసీటీఎస్ తదితర కార్యక్రమాల కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లను పీహెచ్‌సీల్లో నియమించాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలోని ఉ ద్యోగుల పట్ల డీఎంహెచ్ఓ కె.వెంకటరమణ వైఖరి çసరిగాలేదని ఆరోపించారు. డీఎంహెచ్ఓ ఆందోâýæనకారుల తో మాట్లాడారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను తాను పాటిస్తున్నానని, వ్యక్తిగతంగా ఎవరి మీదా కక్ష లేదని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కాాన్రికి ఆయన హామీ ఇవ్వకపోవడంతో వారం రోజులు ఆందో âýæన కొనసాగించాలని నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్సీ గేయానంద్, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, ఐఎ¯ŒSటీయూసీ , ఏఐటీయూసీ , వైఎస్ఆర్సీపీ, ఎన్జీఓ, ఆరోగ్య సి బ్బంది ఆందోళనకు మద్దతు తెలిపారు. కమిటీ కోశాధికారి రేణుకాదేవి, కో కన్వీనర్లు సాంబశివమ్మ, చంద్రమోహన్, శ్రీధర్‌బాబు, రాఘవేంద్రకుమార్, షఫి పాల్గొన్నారు. -
సమ్మెను జయప్రదం చేద్దాం
కడప కల్చరల్: సెప్టెంబరు 2న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని యూనియన్ నాయకులు అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆలిండియా ఇన్సూ్యరెన్స్ ఎంప్లాయిస్ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఐసీఈయూ కడప డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయ ఆవరణంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 11 కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయని, ఉద్యోగులందరం కలిసి సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఎఫ్‌డీఐ పెంపును ఉపసంహరించాలని, ధరల పెరుగుదల అరికట్టాలని, అర్హులందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని,నాలుగు ప్రభుత్వ జనరల్ ఇన్సూ్యరెన్స్ కంపెనీలను కలపాలని, ఎల్ఐసీలో మూడు, నాల్గవ తరగతి ఉద్యోగుల నియామకాలను చేపట్టాలన్నది ముఖ్యమైన డిమాండ్లుగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉన్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో నిర్వీర్యం చేస్తుండడంతో కార్మికులు బాగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరిస్తూ వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణమన్నారు. దేశంలో ముఖ్యమైన రంగాలైన ఇన్సూ్యరెన్స్, రైల్వే, విమాన, రక్షణ రంగాలలో ఎఫ్‌డీఐ పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలు, సామ్రాజ్యవాద దేశాల అడుగులకు మడుగులొత్తుతూ దేశభద్రత, సార్వభౌమాధికారం లాంటి విషయాలలో రాజీ పడడం క్షేమకరమన్నారు. ఈ ప్రదర్శనలో యూనియన్ డివిజన్ నాయకులు కిరణ్‌కుమార్, మద్దిలేటి, శ్రీవాణి, డీఓ యూనిట్ నాయకులు కేసీఎస్ రాజు, అవధానం శ్రీనివాస్, శ్రీకృష్ణ, శ్రీనివాసకుమార్, పక్కీరయ్య,జేవీ రమణ అయ్యవారురెడ్డి, టి.నరసయ్య, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.