strange shape
-
‘చిక్కుడు’ గుడ్లు
యశవంతపుర: కోడిగుడ్డు ఆకారం అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలో దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా లాయ్ల గ్రామంలో ఒక కోడి విచిత్రమైన అకారంలో గుడ్లు పెట్టింది. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉండి చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లోని నాటు కోడి ఈ ప్రత్యేక గుడ్లను వారం రోజులుగా పెడుతోంది. ప్రశాంత్ అందరికీ చెప్పడంతో విషయం బయటపడింది. అందరూ ఆయన ఇంటికెళ్లి గుడ్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
వింత : ఏనుగు ఆకారంలో పంది పిల్లలు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో వింత సంఘటన జరిగింది. గూడూరు మండలం నాయక్ పల్లి గ్రామంలో ఓ పందికి ఏనుగు ఆకారంలో ఉన్న రెండు పిల్లలు పుట్టాయి. ఏనుగు లాగ తొండం కలిగి ఉండడం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పందిపిల్లలను చూడడానికి తరలివస్తున్నారు. పిల్లలు తెల్లగా ఉండి, చూడ్డానికి బాగున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. కలియుగంలో ఇలాంటి సంఘటనలే జరుగుతాయని గ్రామంలోని కొందరు వృద్ధులు వాపోతున్నారు. 2016లో కాంబోడియా, 2014లో చైనాలలో ఇలాంటి పిల్లలు పుట్టాయి. -
కొబ్బరితోటలో వింత
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం డేరశాం గ్రామంలో వింత సంఘటన వెలుగుచూసింది. గ్రామంలోని ఓ కొబ్బరితోటలో వింత పుట్టగొడుగు స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కోబ్బరి తోటలో మనిషి చేయిన పోలిన పుట్టుగొడుగు గుర్తించిన రైతు ఎవరో గుర్తుతెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని తన తోటలో పాతిపెట్టారని హడలిపోయాడు. అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇది పుట్టగొడుగు అని స్పష్టం చేశారు. వింత పుట్టగొడుగు విషయం ధావానంలా పాకడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇది చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు.