
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో వింత సంఘటన జరిగింది. గూడూరు మండలం నాయక్ పల్లి గ్రామంలో ఓ పందికి ఏనుగు ఆకారంలో ఉన్న రెండు పిల్లలు పుట్టాయి. ఏనుగు లాగ తొండం కలిగి ఉండడం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పందిపిల్లలను చూడడానికి తరలివస్తున్నారు. పిల్లలు తెల్లగా ఉండి, చూడ్డానికి బాగున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. కలియుగంలో ఇలాంటి సంఘటనలే జరుగుతాయని గ్రామంలోని కొందరు వృద్ధులు వాపోతున్నారు. 2016లో కాంబోడియా, 2014లో చైనాలలో ఇలాంటి పిల్లలు పుట్టాయి.

కాంబోడియా, చైనాలలో పుట్టిన పంది పిల్లలు
Comments
Please login to add a commentAdd a comment