Street lighting
-
పంచాయతీల కరెంటు బిల్లు రూ.16 కోట్లు
♦ రాబట్టేందుకు రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ ♦ శంషాబాద్ మండలంలో వీధి దీపాల కనెక్షన్ల తొలగింపు వీధి దీపాలు, నీటి సరఫరాకు సంబంధించిన కరెంటు కనెక్షన్ల బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శంషాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 16.67 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో బకాయిలను వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు నడుం బిగించారు. వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. -శంషాబాద్ శంషాబాద్ ట్రాన్స్‌కో డివిజన్ పరిధిలోని ఎయిర్‌పోర్టు కాలనీ, నర్కూడ, బహదూర్‌గూడ, చెర్లగూడ, హమీదుల్లానగర్ , దొడ్డి, కాచారం, కవ్వగూడ, కొత్వాల్‌గూడ, పోశెట్టిగూడ, రాళ్లగూడ, రషీద్‌గూడ, రాయన్నగూడ, సంఘీగూడ, శంషాబాద్, శంకరాపురం, సుల్తాన్‌పల్లిలో వీధిదీపాల బకాయిలు రూ. 4.77 కోట్లు వసూలు కావాల్సి ఉంది. పీడబ్ల్యూఎస్‌కు సంబంధించిన బకాయిలు రూ. 6.98 కోట్లు పేరుకుపోయాయి. మొత్తం కలిపి రూ. 11. 75 కోట్లు డివిజన్ పరిధిలో చెల్లించాల్సి ఉంది. పెద్దషాపూర్ డివిజన్ పరిధిలోని బోటిగూడ, గండిగూడ, ఘాంసిమీయాగూడ, జుకల్, కవేలిగూడ, కిషన్‌గూడ, మదన్‌పల్లి, మల్కారం, ముచ్చింతల్, ననాజీపూర్, పాలమాకుల, పెద్దతూప్ర, పిల్లోనిగూడ, రామాంజపూర్, పెద్దషాపూర్, తొండుపల్లి, ఊట్పల్లి తదితర గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించి విద్యుత్ బకాయిలు రూ. 1.58 కోట్లు ఉండగా పీడబ్ల్యూఎస్‌కు సంబంధించిన మొత్తం రూ. 3.33 కోట్లు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా ఇటీవల సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందనరాలేదు. దీంతో ఎలాగైనా విద్యుత్ బిల్లులు రాబట్టేందుకు విద్యుత్ అధికారులు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో వీధి దీపాలకు సంబంధించిన కనెక్షన్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. రెండురోజుల క్రితం టీఎస్ పీడీసీఎస్ ప్రత్యేకాధికారి తిరుపతయ్యగౌడ్ తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. విద్యుత్ బకాయిలను రాబట్టేందుకు ఆయా గ్రామ సర్పంచ్‌లను కలిసి పరిస్థితి వివరించారు. బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించిన కనెక్షన్లను తొలగించారు. దీంతో బకాయిలు వసూలయ్యేంత వరకు గ్రామాల్లో చీకట్లు కమ్ముకునే పరిస్థిలు నెలకొనడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు తీరు సరికాదని కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు చెల్లించాల్సిందే: రాజేంద్రనగర్ డీఈ సోమిరెడ్డి వీధి దీపాలు, పీడబ్ల్యూఎస్‌కు సంబంధించి పంచాయతీలు వినియోగించిన విద్యుత్ బిల్లులు చెల్లించాలని రాజేంద్రనగర్ డీఈ సోమిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ మండల పరిధిలో మొత్తం రూ. 16 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయా బిల్లులను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేయాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. బకాయిలు చెల్లించని కారణంగానే వీధి దీపాల కనెక్షన్లు తొలగిస్తున్నాం. -
చీకటి రాజ్యం
నిండుకున్నవీధిదీపాలు, క్లాంపులు బడ్జెట్ ఘనం..ఖర్చు అంతంత మాత్రం చాలా చోట్ల వెలగని సెంట్రల్ డివైడర్ లైట్లు రోడ్డు ప్రమాదాల బారిన ప్రజలు పట్టించుకోని ఉన్నతాధికారులు నగరంలో చాలా ప్రాంతాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారుు. రాత్రి పూట వీధిదీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే నగరంలో దొంగతనాలు జోరుగా సాగుతున్నారుు. దీనికి తోడు అసాంఘిక శక్తుల ఆగడాలు మితిమీరుతున్నారుు. చాలా రహదారుల్లో అడుగడుగునా వెలసిన గోతులు ఒకవైపు... అలముకుంటున్న చీకట్లు మరోవైపు... వెరసి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అరండల్‌పేట: నగరంలో మొత్తం 19,250 వీధిదీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు(విద్యుత్ చార్జీల చెల్లింపు, సిబ్బంది వేతనాలతో కలిపి) నెలకు రూ. 20లక్షలు చొప్పున ఏడాదికి రూ. 2.40కోట్లు వ్యయమవుతోంది. 2014-15 నగరపాలకసంస్థ వార్షిక బడ్జెట్లో రూ. 75 లక్షలు ఖర్చుచేయాలని నిర్ణయించారు. ఆ నిధులతో వీధిదీపాలు, క్లాంపులు, ఇతర మెటీరియల్ కొనుగోలు చేయూలని నిర్ణరుుంచారు. అరుుతే కొన్ని నెలలుగా నగరంలో వీధిదీపాలు, క్లాంపులు, ఇతర పరికరాలు నిండుకున్నాయి. ఇప్పటి వరకు కార్పొరేషన్ ఎలక్ట్రికల్ విభాగం తరఫున కేవలం రూ. 12 లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. మిగిలిన నిధులు సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు పరికరాలకు సంబంధించి టెండర్లు పిలవనేలేదు. నగరపాలకసంస్థ పరిధిలోకి వచ్చిన పది విలీన గ్రామాల్లో సైతం పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. గోరంట్ల, నగరాలులో వీధిదీపాలు అసలు వెలగడం లేదు. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం గోరంట్ల ప్రధాన రోడ్డులో లైట్లు వెలగకపోవడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. దీనిపై ఇప్పటికే అక్కడి స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సమస్యను పరిష్కరించడం లేదు. అలాగే రెడ్డిపాలెం, అడవి తక్కెళ్లపాడు, బుడంపాడు, ఏటుకూరు, నల్లపాడు గ్రామాల్లో వీధులు అంధకారంలో ఉన్నాయి. నగరంలోని తూర్పు నియోజకవర్గం పరిధి ఆనందపేట 2, 5 లైన్లు, పాతగుంటూరు యాదవబజారు, ఆదిత్యనగర్ 1, 2 లైన్లు, శారదాకాలనీ 5, 6 లైన్లు, మంగళదాస్‌నగర్, కొత్తపేట, ఆర్టీసీకాలనీ, శ్రీనగర్ 4, 7 లైన్లలో వీధిదీపాలు వెలగడం లేదు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ 1, 4, 5 లైన్లు, శ్యామలాగనర్ 10, 11 లైన్లు, కొరిటెపాడు, స్తంభాలగరువు, ఎస్వీఎన్కాలనీ, పట్టాభిపురం, నల్లచెరువు, ఆర్ అగ్రహారం, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, కేవీపీకాలనీ తదితర ప్రాంతాల్లో వీధిదీపాలు వెలగడం లేదు. టెండర్లవిషయంలోనూ నిర్లక్ష్యం వీధిదీపాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయడంతో ఒక్కొక్క టెండరు ఖరారు చేసేందుకు నెలల తరబడి సమయం పడుతోంది. ఇది ఒక కారణమైతే, కార్పొరేషన్ పరిధిలో వీధిదీపాల అవసరాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. అదేసమయంలో కొంతమంది ఎలక్ట్రికల్ సిబ్బంది ఆయా వీధుల్లో వీధిదీపాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చినా స్పందించడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి సైతం వీటిని తీసుకువెళ్లడం లేదు. త్వరితగతిన పరిష్కరిస్తాం వీధిదీపాల సమస్య నా దృష్టికి వచ్చింది. ఇది నగరంలో ఎంత తీవ్రంగా ఉందో గుర్తించాం. వెంటనే షార్ట్ టెండర్లు పిలిచి వీధిదీపాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తాం. ఎక్కడా ప్రజలకు సమస్యలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకుంటాం. - డి.మరియన్న, ఎస్ఈ -
పంచాయతీలకు గుదిబండ
‘‘పల్లెలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. ఇది జరగాలంటే పంచాయతీలు ఆర్థికంగా బలపడాలి. అందుకే వాటి కరెంటు భారాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకపై కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది’’ జీఓ నం 80 విడుదల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలివి. ఆయన మాట నిలుపుకున్నారు. కానీ, ఆయన తదనంతర ప్రభుత్వాలు ఈ జీఓను నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ సర్కారూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా కరెంటు బకాయిలు పంచాయతీలకు గుదిబండగా మారాయి. -మోర్తాడ్ - కలవరపెడుతున్న కరెంటు బకాయిలు - భారం దాదాపు రూ.117 కోట్లు - పన్నులతో ఆదాయం రూ.12 కోట్ల లోపే - అమలుకు నోచుకోని జీఓ నం 80 - నాడు అండగా నిలచిన వైఎస్ఆర్ మోర్తాడ్ : గ్రామపంచాయతీలకు సంబంధించిన వీధి దీపాలు, రక్షిత మంచినీటి సరఫరా పథకాలకు సంబంధించిన కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించే విధంగా జారీ చేసిన ఉత్తర్వులు (జీఓ నంబర్ 80) అమలు కావడం లేదు. దీంతో పంచాయతీలకు కరెంటు బిల్లులు గుదిబండగా మారాయి. పంచాయతీలకు ఇంటి పన్ను, నల్లాల ద్వారా లభించే ఆదా యం ఏటా రూ.12 కోట్లకు మించడం లేదు. జిల్లాలో గ్రామ పంచాయతీ లు కరెంటు సంస్థకు రూ.117 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పంచాయతీలపై భారాన్ని తగ్గించడం కోసం జీఓ నంబర్ 80ను విడుదల చేశారు. దీని ప్రకారం గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాల బిల్లులు, రక్షిత మం చినీటి సరఫరా పథకాలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వమే భరి స్తుంది. రాజశేఖరరెడ్డి మరణం తరువాత జీఓ నం. 80 అమలు నిలిచిపోయింది. దీంతో పంచాయతీల కరెంటు బకాయిలు పెరిగిపోయాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 74 మేజర్ గ్రామ పంచాయతీలు రూ.53 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 644 మైనర్ గ్రామ పంచాయతీలు రూ.64 కోట్లు బకాయి ఉన్నాయి. ఆదాయం తక్కువగా ఉండటంతో ప్రభుత్వమే కరెంటు బిల్లును చెల్లిస్తుందని వైఎస్ నిర్ణయం తీసుకున్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో సిబ్బందికి వేతనాలు, పంచాయతీ నిర్వహణ, సామాగ్రి కొనుగోలు, చిన్న చిన్న మరమ్మత్తులు చేపట్టడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. వైఎస్ మర ణం తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి జీఓ 80ను బుట్ట దాఖలు చేశారు. ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ జీఓను పట్టించుకోవడం లేదు. బకాయిల వసూలు కోసం ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పంచాయతీలపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రాత్రిపూట వీధి దీపాలకు కరెంటు సరఫరాను నిలపివేస్తున్నారు. దీంతో గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఆర్థిక సంఘం నిధుల నుంచి కరెంటు బిల్లులను చెల్లిం చాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచి కరెంటు బిల్లులు చెల్లిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. అభివృద్ధి పనులకు తక్కు వ శాతం నిధులు మంజూరు కావడం, పన్నుల వసూలు అంతంత మాత్రంగానే ఉండటంతో కరెంటు బిల్లుల చెల్లింపు పంచాయతీలకు సాధ్యం కావడం లేదు. గతంలో మాదిరిగా ప్రభుత్వం కరెంటు బిల్లును చెల్లిస్తే తమకు భారం తప్పుతుందని సర్పంచులు అంటున్నారు. ప్రభుత్వం జీఓ 80ను అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ వేల్పూర్ మండల సర్పంచులు రిలే దీక్షలను చేపట్టారు.