strengthen party
-
గ్రామాల వైపు.. కమలనాథుల చూపు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తుండటంతో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పార్టీ కేడర్‌ను కదిలించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పాటు నగరాలు, పట్టణాల్లో కూడా బస్తీబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బస్తీబాట కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమవ్వగా.. పార్టీ నేతలకు ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలివ్వడం గమనార్హం. బైక్ ర్యాలీలు.. దళితుల ఇళ్లలో భోజనాలు గ్రామస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కమలనాథులు దృష్టి సారించారు. ఈ నెల 15 నుంచి 28 వరకు రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో బైక్ ర్యాలీ లు నిర్వహించడంతో పాటు ఆయా గ్రామాల్లో రెండు చోట్ల ఉదయం, సాయంత్రం సమావేశాలను ఏర్పా టు చేయనున్నారు. అలాగే ఆయా గ్రామాలకు వెళ్లే పార్టీ రాష్ట్ర, జిల్లా బాధ్యులు గ్రామాల్లోని దళితుల ఇళ్లల్లో భోజనం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు కేంద్రప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్చార్జులను కూడా నియమించే కసరత్తును రాష్ట్ర నాయకత్వం పూర్తి చేసినట్టు సమాచారం. వీరి నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉం టుందని, వీరంతా లోక్‌సభ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సమాచారం మేరకు ఇన్చార్జులు వీరే! నిజామాబాద్–వెంకటరమణి, ఆదిలాబాద్–యెండ ల లక్ష్మీనారాయణ, ఖమ్మం–బండారు దత్తాత్రేయ, వరంగల్–బద్దం బాల్‌రెడ్డి, మెదక్–రామకృష్ణారెడ్డి, జహీరాబాద్–ప్రేమేందర్‌రెడ్డి, కరీంనగర్–ధర్మారా వు, నాగర్‌కర్నూల్–ఎన్.రాంచందర్‌రావు, మహబూబాబాద్–పేరాల చంద్రశేఖర్, మహబూబ్‌నగర్–జి.మనోహర్‌రెడ్డి, నల్గొండ–జి.కిషన్‌రెడ్డి, మల్కాజ్గిరి–నాగూరావు నమోజి, జాజుల గౌరి, చేవెళ్ల–ఆచారి, జనార్దనరెడ్డి, హైదరాబాద్–చింతా సాంబమూర్తి, ఎస్.ప్రకాశ్‌రెడ్డి, సికింద్రాబాద్–రాజేశ్వరరావు, వి.ఛాయాదేవి, పెద్దపల్లి–ఇంద్రసేనారెడ్డి, ఎస్.కుమార్, భువనగిరి–మురళీధర్‌రావు, కడగంచి రమేశ్. -
బీజేపీ విజయానికి ఐదు మెట్లు
1. మోదీ జనాకర్షణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుజరాత్లో ఉన్న జనాకర్షణ ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఎన్నికల్లో మోదీ మొత్తంగా 34 ర్యాలీల్లో ప్రసంగించారు. 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా వరసగా ఆరోసారి కూడా గెలిచిందంటే అది మోదీ చలవే. ఆయనకున్న జనాకర్షణే బీజేపీ గెలుపునకు అత్యంత ప్రధానమైన కారణం. 2. బీజేపీ వ్యూహం కాంగ్రెస్ లోపాలను గుర్తించి అందుకు తగ్గట్లుగా బీజేపీ ఎత్తుగడలను సిద్ధం చేసుకుంది. పార్టీలోని ప్రాచు ర్యం లేని నేతలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. పటేళ్లు తమకు దూరమవుతున్నారని గ్రహించి ఓబీసీలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించింది. ప్రచారంలో గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడకుండా దేశభక్తిపైకి ప్రజల దృష్టిని మళ్లించి గెలుపునకు బాటలు వేసుకుంది. 3. జీఎస్టీపై వ్యతిరేకతను తగ్గించడం జీఎస్టీను అమలు చేసినప్పుడు గుజరాత్ సహా దేశవ్యాప్తంగా వ్యాపారులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడం తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికలు సమీపించేటప్పటికి ఆ రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించే వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం, జీఎస్టీ వల్ల దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనాల గురించి చెప్పడం ద్వారా వ్యతిరేకత తగ్గేలా చూసుకుంది. 4. కాంగ్రెస్ సాయం కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మోదీపై చేసిన ‘నీచ్’వ్యాఖ్యలు బీజేపీకి వరంలా మారాయి. అయ్యర్ వ్యాఖ్యలను మోదీ గుజరాత్ గౌరవానికి ముడిపెట్టి లబ్ధి పొందారు. వెనుకబడిన కులాలను తమవైపుకు తిప్పుకోవడంలో బీజేపీ సఫలమైంది. ప్రచారం చివరి రోజుల్లో బీజేపీ అభివృద్ధి ఊసెత్తకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. 5. సంస్థాగత బలం గుజరాత్లో బీజేపీకి ఉన్నదీ, కాంగ్రెస్‌కు లేనిది సంస్థాగత బలం. పార్టీని ప్రజల వద్దకు చేర్చేందుకు, కిందిస్థాయి కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు బీజేపీకి మంచి యంత్రాంగం ఉంది. కాంగ్రెస్‌లో ప్రధాన నాయకుడైన శంకర్‌సింహ్ వాఘేలా ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆ పార్టీ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌కు గుజరాత్లో చెప్పుకోదగ్గ బలమైన నేత కూడా ఎవరూ లేరు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా? తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశలో పీసీసీకి అనుబంధంగా లేదా సమాంతరంగా మరిన్ని కమిటీలు ఏర్పాటు కానున్నాయా? పార్టీ సీనియర్లు, సామాజిక సమతుల్యత వంటివాటికి ప్రాధాన్యత ఇవ్వనుందా? ఇలాంటి ప్రశ్నలకు సీనియర్ నేతలు అవుననే సమాధానం ఇస్తున్నారు. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి పలు మార్పులూ చేర్పులను చేపట్టనున్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలను తీసుకున్న తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లోని సమస్యలను పరిష్కరించడానికి, పార్టీ సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి కీలకమైన చర్యలను తీసుకుంటారని చెబుతున్నారు. ఇందుకోసం పార్టీలో కొంత పేరు, పని చేయగలిగే సత్తా ఉన్న వారికి తగిన బాధ్యతలను అప్పగించాలనే ఏఐసీసీ స్థాయి లో స్థూలంగా నిర్ణయాలు జరిగాయని పార్టీ జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్న నేత ఒకరు వెల్లడించారు. సీడబ్ల్యూసీలోకి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. పొన్నాల, సర్వేలకూ అవకాశం.. కేంద్ర మంత్రిగా పలు కీలకమైన శాఖలకు పని చేసిన జైపాల్‌రెడ్డి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే సీనియర్లు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ వంటివారికి కూడా జాతీయ స్థాయిలోనే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇప్పటికే వి.హన్మంతరావు, మధు యాష్కీ, చిన్నారెడ్డి వంటివారికి ఏఐసీసీలో బాధ్యతలున్నాయి. వీరితోపాటు మరో ఇద్దరు, ముగ్గురికి ఏఐసీసీలో అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. అలాగే రాష్ట్రస్థాయిలో మరికొందరు ముఖ్యనేతలకు అవకాశాలు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరికి కీలక అవకాశం కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సినీ నటి, మాజీ ఎంపీ ఎం.విజయశాంతికి పార్టీలో తగిన వేదికను కల్పించాలనే ప్రతిపాదన ఏఐసీసీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికి కీలకమైన అవకాశాలను కల్పించాలనే యోచన ఏఐసీసీకి ఉన్నట్టు సమాచారం. వీరికి తగిన అవకాశాలను కల్పించే ప్రతిపాదనపై విజయశాంతి, కోమటిరెడ్డి సోదరులతోనూ ఏఐసీసీ ముఖ్యులు ప్రాథమికంగా చర్చలను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డికి పీసీసీలో కీలక అవకాశాన్ని కల్పిస్తారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ పూర్తిచేసి, ఎన్నికలకు పీసీసీని సన్నద్ధం చేసే ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. కొత్తగా మరో కమిటీ..! ఇప్పటికే టీపీసీసీ సమన్వయ కమిటీ ఉంది. దీన్ని పునర్వ్యవస్థీకరించే యోచనలో ఏఐసీసీ ఉంది. సమన్వయ కమిటీలో సత్తా లేని వారిని తొలగించి, పని చేయగలిగే శక్తి ఉన్న నేతలకు అవకాశం కల్పించనున్నారు. పీసీసీకి కీలకమైన రాజకీయ అంశాల్లో తోడ్పాటు అందించేలా, పార్టీ సీనియర్ల ప్రతిపాదనలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ఒక కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో పీసీసీ ఎన్నికల కమిటీ ఉంటుందని, అంతకుముందు పార్టీ నేతల అభిప్రాయాలకు తగిన వేదిక ఉండాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. -
ఆర్థిక, సామాజికాంశాలపై సమాంతర పోరు
వామపక్ష సంఘటనను బలోపేతం చేయడమే దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారమని సీపీఎం అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలోనే ఎత్తులు, పొత్తులు ఉంటాయని, ప్రభుత్వంపై పోరుకు తమతో కలసివచ్చేవారందరినీ కలుపుకుపోతామని స్పష్టంచేసింది. నాలుగు రోజులుగా విశాఖలో జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభల్లో భాగంగా శుక్రవారం కూడా ఏడు తీర్మానాలను ఆమోదించింది. విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సామాజిక అణచివేత, ఆర్థికాంశాలపై ఏకకాలంలో సమాంతర పోరాటం చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఎత్తులు, పొత్తులన్నీ ఎన్నికల సమయంలోనేనని తేల్చింది. పార్లమెంట్ లోపలైనా, వెలుపలైనా సమస్యలపై కాంగ్రెస్‌తో పని చేస్తామని స్పష్టం చేసింది. తమంట తాము ఎదుగుతూ వామపక్ష సంఘటనను బలోపేతం చేయడమే దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారమని అభిప్రాయపడింది. నాలుగు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభ శుక్రవారం కూడా రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని చర్చించింది. ఈ సందర్భంగా పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావుతో కలసి మీడియాతో మాట్లాడారు. మహాసభ ఆమోదించిన ఏడు తీర్మానాలను విడుదల చేశారు. మిగతా తీర్మానాలివే శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో కాషాయీకరణ పెరిగిపోయిందని, దీన్ని నిలువరించాలని తీర్మానించింది. దేశంలో నూటికి 30 శాతంగా ఉన్న యువతీ యువకులకు ఉపాధి చూపాలని లేదా లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడానికి బదులు ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించాలని తీర్మానించింది. ఇంటర్నెట్ అందుబాటుపై పరిమితుల్ని ఆక్షేపించింది. పార్టీ సంస్థాగత కార్యకలాపాల నివేదికను శనివారం చర్చిస్తుంది. 124 పేజీలకు పైగా ఉన్న నివేదికలో పార్టీ గతంలో చేసిన కార్యకలాపాలు, సంస్థాగత వ్యవహారాలున్నాయి. వీటిల్లో కొన్నింటిని మాత్రమే చర్చించి, మిగతావాటిపై త్వరలో ప్రత్యేక ప్లీనరీ నిర్విహ స్తారు. పొత్తులపై ఏమన్నారంటే.. సొంత బలం లేకనే పొత్తులు పెట్టుకున్నాం. దెబ్బతిన్నాం. అందుకే దిద్దుబాట పట్టాం. ఇకపై వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకే మా ప్రాధాన్యం. పొత్తులు ఎత్తులనేవి ఎన్నికల సమయంలోనే. అప్పటి దాకా ఏదైనా సమస్యపై పార్లమెంటు లోపల లేదా బయట చేసే పోరాటాలలో కాంగ్రెస్‌తో సహా చాలామంది కలసి వస్తే కలుపుకుపోతాం. పశ్చిమ బెంగాల్ సహా ఎక్కడా కాంగ్రెస్‌తో పొత్తులుండవు. మీడియాకు సీతారాం చురక ‘మీడియాలోనూ ఉద్యోగ భద్రత కొరవడింది. కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది. మీరు కూడా కాంట్రాక్ట్ జర్నలిస్టుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి. మేము నాయకత్వం వహిస్తాం. వేతనాల కోసం చేసే పోరాటానికి మద్ధతిస్తాం’ అంటూ చురకలంటించారు. మేము బలపడాలి పార్టీ సొంతంగా ఎదగడమే లక్ష్యం. ఆర్థిక, సరళీకృత విధానాలు, మతోన్మాద చర్యల ను కలగలిపి మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది దేశలౌకిక వ్యవస్థకు ముప్పు. దీన్ని ప్రతిఘటించాలి. ఇకపై ఆర్థిక పోరాటాలతోపాటు సామాజిక అణచివేతపై ఉద్యమాలను ఏకకాలంలో నడిపిస్తాం. మేక్ ఇన్ ఇండియా కాదు.. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా (ఇండియాలో తయారీ) కాస్తా మేక్ ఫర్ ఇండియా (భారత్ కోసం తయారు చేయండి) తయారైంది. స్వదేశీ విధానానికి బదులు తమ దేశంలో వ్యాపారానికి రండన్నట్టుగా మారింది.