
1. మోదీ జనాకర్షణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుజరాత్‌లో ఉన్న జనాకర్షణ ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఎన్నికల్లో మోదీ మొత్తంగా 34 ర్యాలీల్లో ప్రసంగించారు. 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా వరసగా ఆరోసారి కూడా గెలిచిందంటే అది మోదీ చలవే. ఆయనకున్న జనాకర్షణే బీజేపీ గెలుపునకు అత్యంత ప్రధానమైన కారణం.
2. బీజేపీ వ్యూహం
కాంగ్రెస్ లోపాలను గుర్తించి అందుకు తగ్గట్లుగా బీజేపీ ఎత్తుగడలను సిద్ధం చేసుకుంది. పార్టీలోని ప్రాచు ర్యం లేని నేతలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. పటేళ్లు తమకు దూరమవుతున్నారని గ్రహించి ఓబీసీలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించింది. ప్రచారంలో గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడకుండా దేశభక్తిపైకి ప్రజల దృష్టిని మళ్లించి గెలుపునకు బాటలు వేసుకుంది.
3. జీఎస్టీపై వ్యతిరేకతను తగ్గించడం
జీఎస్టీను అమలు చేసినప్పుడు గుజరాత్ సహా దేశవ్యాప్తంగా వ్యాపారులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడం తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికలు సమీపించేటప్పటికి ఆ రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించే వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం, జీఎస్టీ వల్ల దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనాల గురించి చెప్పడం ద్వారా వ్యతిరేకత తగ్గేలా చూసుకుంది.
4. కాంగ్రెస్ సాయం
కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మోదీపై చేసిన ‘నీచ్’వ్యాఖ్యలు బీజేపీకి వరంలా మారాయి. అయ్యర్ వ్యాఖ్యలను మోదీ గుజరాత్ గౌరవానికి ముడిపెట్టి లబ్ధి పొందారు. వెనుకబడిన కులాలను తమవైపుకు తిప్పుకోవడంలో బీజేపీ సఫలమైంది. ప్రచారం చివరి రోజుల్లో బీజేపీ అభివృద్ధి ఊసెత్తకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది.
5. సంస్థాగత బలం
గుజరాత్‌లో బీజేపీకి ఉన్నదీ, కాంగ్రెస్‌కు లేనిది సంస్థాగత బలం. పార్టీని ప్రజల వద్దకు చేర్చేందుకు, కిందిస్థాయి కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు బీజేపీకి మంచి యంత్రాంగం ఉంది. కాంగ్రెస్‌లో ప్రధాన నాయకుడైన శంకర్‌సింహ్ వాఘేలా ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆ పార్టీ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌కు గుజరాత్‌లో చెప్పుకోదగ్గ బలమైన నేత కూడా ఎవరూ లేరు.
Comments
Please login to add a commentAdd a comment