strick success
-
కదంతొక్కిన కార్మిక లోకం
ఎదులాపురం(ఆదిలాబాద్): కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు కార్మికలోకం కదంతొక్కింది. రెండురోజుల సార్వత్రిక సమ్మె జిల్లాలో సక్సెస్ అయింది. చివరి రోజు బుధవారం పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో.. సార్వత్రిక సమ్మెలో భాగంగా వివిధ సంఘాలుఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ని యంత్రించి అదుపులో పెట్టాలని డిమాండ్ చేశా రు. కనీస వేతనం నెలకు రూ.18 వేలుగా నిర్ణయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకాన్ని, కార్మిక చట్టాల సవరణ ఆపాలని, వాటిని పకడ్బందీగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చట్టాలు విధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐటీయూసీరాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు, సీఐటీ యూ జిల్లా కార్యదర్శి డి.మల్లేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రాజేందర్, ఐఎఫ్ టీయూ జిల్లా అధ్యక్షుడు బి.జ గన్, కార్యదర్శి వెంకట నారాయణ, అనుబంధ సంఘాల నాయకులు ముడుపు ప్రభాకర్, కిరణ్, బండి దత్తాత్రి, లంకా రాఘవులు పాల్గొన్నారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో.. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవోస్) సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ద్వారా నిరసన తెలిపారు. ఎన్జీవోస్ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ సిబ్బంది పర్మినెంట్, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు అశోక్, తాలు కా అధ్యక్షుడు ఎ.నవీన్‌కుమార్, కార్యదర్శి మ హేందర్, సెంట్రల్ కార్యదర్శి ఎ.తిరుమల్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, తుమ్మల గోపి, గం గాధర్ చిట్ల, ఆర్.శ్రీనివాస్ పాల్గొన్నారు. వైద్య ఉద్యోగుల ఆధ్వర్యంలో.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మినిస్టీరియల్ సం ఘం ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట నిరనస ప్రదర్శన చేపట్టారు. సీపీఎస్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో సంఘం శ్రీకాంత్, మహేందర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న కార్మికుల ఆధ్వర్యంలో.. మధ్యాహ్న భోజన కార్మికులు (ఏఐటీయూసీ అనుబంధం) డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరునెలలుగా వేతనాలు అందించడం లేదని, ప్రభుత్వం కోడి గుడ్లకు రూ.4 అందిస్తోందని, బయట రూ.6కు లభిస్తుండగా అదనంగా రెండు రూపాయల భారం నిర్వాహకులపై పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా కార్యదర్శి కె.రాములు, పట్టణ కార్యదర్శి టి.పుష్పలత, పట్టణ సహా య కార్యదర్శి జి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె పాక్షికం
సూపర్‌బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక, ఉద్యోగ సంఘాల సంయుక్త అధ్వర్యంలో మంగళ, బుధవారాలలో నిర్వహిస్తున్న దేశ వ్యాపిత సమ్మె మొదటి రోజైన మంగళవారం జిల్లాలో పాక్షికంగా జరిగింది. జిల్లాలోని సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, ఎన్ఎండీసీ స్పాంజ్ ఐరన్ యూనిట్ తదితర కర్మాగారాలలో కూడా సమ్మె ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. సమ్మె నేపథ్యంలో జిల్లాలో పలు చోట్ల జేఏసీల ఆ«ధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి, కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దçహనం చేశారు. కలెక్టరేట్ ఎదుట తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జిల్లాలో ఉన్న 1.30 లక్షల మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు కనీసం రూ.18 వేలు ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, ఆదాయపన్ను పరిధి రూ.5 లక్షలకు పెంచాలని, ఉద్యోగుల విభజన సమస్యలను పరిష్కరించాలని, గ్రంథాలయం, మార్కెట్, ఎయిడెడ్ ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక సింగరేణిలోని కొత్తగూడెం రీజియన్‌లో 67 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఐటీసీ, కేటీపీఎస్, మణుగూరు భారజల కర్మాగారం, ఎన్ఎండీసీ స్పాంజ్ ఐరన్ యూనిట్లలోని కార్మికులు కూడా విధులకు హాజరు కావడంతో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. అధికార పార్టీకి సంబంధించిన యూనియన్లు సమ్మెలో పాల్గొనక పోవడం, సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాలలో ఉన్న అనైక్యతల కారణంగా సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్సులు లేక ఇబ్బందులు.. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు సరిగా తిరగకపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆటోలు యథావిధిగా తిరిగాయి. వర్తక, వాణిజ్యాలకు మాత్రం ఎలాంటి అటంకం కలుగలేదు. పాల్వంచ వంటి ప్రాంతాలలో బ్యాంకులు మామూలుగానే పనిచేశాయి. అయితే కొన్నిచోట్ల అంతర్గత లావాదేవీలను మాత్రమే నిర్వహించారు. పెట్రోల్ బంకులు కొన్ని చోట్ల మొదట పనిచేసినప్పటికీ ఆందోళనకారుల ఒత్తిడితో బంద్ చేశారు. కాగా, బంక్‌లు ముందు తెరిచి, ఆ తర్వా త బంద్ చేయడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తున్న దేశవ్యాపిత సమ్మె దేశ చరిత్రలో 18వది కావడం గమనార్హం. గత నాలుగన్నర సంవత్సరాలలో 48 గంటల దేశ వ్యాప్త సమ్మె ఇదే మొదటిసారి. సమ్మె విచ్ఛిన్నానికి సింగరేణి తదితర సంస్థలు చేసిన కృషి ఫలించడం వల్లే కర్మాగారాలలో సమ్మె మొదటి రోజు పాక్షికంగా జరిగింది. -
సార్వత్రిక సమ్మె విజయవంతం
లింగాల : సార్వత్రిక సమ్మెలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, గ్రామపంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండు వద్ద నిర్వహించిన సమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చెన్నదాస్, సీఐటీయూ మండల కార్యదర్శి రఘుపతిరాథోడ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కార్మిక హక్కు చట్టాలను అమలు చేసి పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె నిరంజన్, డీసీసీ ఉపాధ్యక్షుడు కె.టి.తిరుపతయ్య, అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు పర్వతాలు, సీపీఐ మండల కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు, చెంచు లోకం రాష్ట్ర అధ్యక్షుడు కాట్రాజు శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం
లింగాల : సార్వత్రిక సమ్మెలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, గ్రామపంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండు వద్ద నిర్వహించిన సమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చెన్నదాస్, సీఐటీయూ మండల కార్యదర్శి రఘుపతిరాథోడ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కార్మిక హక్కు చట్టాలను అమలు చేసి పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె నిరంజన్, డీసీసీ ఉపాధ్యక్షుడు కె.టి.తిరుపతయ్య, అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు పర్వతాలు, సీపీఐ మండల కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు, చెంచు లోకం రాష్ట్ర అధ్యక్షుడు కాట్రాజు శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.