రూ.10 లక్షల ఎర్రచందనం స్వాధీనం
- మూడు వాహనాలు సీజ్
- ఆరుగురు ఎర్రకూలీల అరెస్ట్
తిరుపతి(మంగళం) : శేషాచల అడవుల్లో నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల ఎర్రచందనాన్ని స్ట్రైకింగ్ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. తిరుపతి-చిత్తూరు హైవేలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఈస్ట్ డీఎఫ్వో శ్రీనివాసులురెడ్డి సమాచారం మేరకు ఎఫ్ఆర్వో కే.మదనమోహన్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహిం చారు. ఆమార్గంలో టాటా సుమో, టాటా ఇండికాతో పాటు మినీ అశోక్లైలాన్డ్ వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. మూడు వాహనాలలో 25ఎర్రచందనం దుంగలున్నాయని, ఇవి వాహనాలు సహా రూ.10 లక్షలు చేస్తాయని ఎఫ్ఆర్వో తెలిపారు.
ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఈస్ట్ డీఎఫ్వో శ్రీని వాసులురెడ్డి తెలిపారు. ఈదాడుల్లో స్ట్రైకింగ్ ఫోర్సు అధికారులు డీవైఆర్వో జయరాములు, ఎఫ్బీవో ఎం.మునినాయక్ పాల్గొన్నారు. అదేవిధంగా నగరి మండలం నాగరాజకుప్పం దారిలో కారు సహా 10 లక్షల విలువజేసే ఎర్రచందనాన్ని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. తిరుమలోరూ.2 లక్షల విలువైన 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.