Stronge
-
LIC of India: గ్లోబల్‌గా ఎల్ఐసీ ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) బలమైన ఇన్సూరెన్స్ సంస్థగా అవతరించింది. అలాగే ప్రపంచంలోనే పదవ అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్ఐసీ నిలిచింది. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ వెలువరించిన నివేదిక ప్రకారం. కరోనా మహమ్మారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, తక్కవ వడ్డీరేట్ల కారణంగా బీమా రంగం మందగించిందని, అయితే మహమ్మారిని ఎదుర్కొని మరీ ప్రపంచంలోని అగ్ర బీమా సంస్థలు స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ డెక్లాన్ అహెర్న్ చెప్పారు. టాప్ 10 లో ఎక్కువగా చైనా బీమా కంపెనీలు ఆధిపత్యంలో ఉండగా, యుఎస్‌కు రెండు కంపెనీలు ఉండగా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా ఒక్కొక్క కంపెనీ ఉన్నాయి. కాగా ప్రపంచంలోని టాప్-100 అత్యంత విలువైన బీమా బ్రాండ్ల మొత్తం విలువ 2020లో రూ. 34.2 లక్షల కోట్ల నుంచి 6 శాతం తగ్గి 2021లో రూ. 32 లక్షల కోట్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా బీమా కంపెనీలుకుదలేన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడం, తక్కువ వడ్డీ రేట్ల ప్రభావంతో బీమా రంగం దెబ్బతిన్నది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం. ఎల్ఐసీ బ్రాండ్ విలువ ఈ ఏడాది 6.8 శాతం పెరిగి రూ. 64 వేల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో44 బిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో చైనాకు చెందిన పింగ్అన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. అలాగే, చైనాకే చెందిన మరో సంస్థ చైనా లైఫ్ ఇన్సూరెన్స్ 22 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జర్మనీ అలియాంజ్, ఫ్రాన్స్ నుంచి ఆక్సా సంస్థలు ఉన్నాయి. ఈ నివేదిక బలమైన బీమా బ్రాండ్లను కూడా పరిశీలిస్తుంది. ఇదే నివేదిక ప్రపంచంలోనే బలమైన బీమా సంస్థల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఎల్ఐసీ మూడో స్థానంలో ఉండటం విశేషం. ఇటలీకి చెందిన పోస్టే ఇటాలియన్, స్పెయిన్ మ్యాప్ఫ్రే, తొలి రెండు స్థానాల్లోనూ, చైనా పింగ్ఆన్ ఇన్సూరెన్స్, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇటలీకి చెందిన యునిపోల్ సాయి, యుఎస్ 'అఫ్లాక్, యుకె (బెర్ముడా) హిస్కాక్స్, దక్షిణాఫ్రికా ఓల్డ్ మ్యూచువల్ , అమెరికా ప్రోగ్రెసివ్ కార్పొరేషన్ సంస్థలు ఉన్నాయి. Most valuable insurance #brands revealed! -Top 100 drop 6% due to #COVID19 -@pingan_group most valuable, US$44.8bn -@ChinaLifeBRK overtakes @Allianz to 2nd place -Chinese brands account for 30% total value; US brands up 14% -@PosteNews strongest REPORT: https://t.co/r4RdoHXClG pic.twitter.com/ZdHUVenOyp — Brand Finance (@BrandFinance) April 28, 2021 చదవండి : అదరగొట్టిన రిలయన్స్ వెయ్యి పడకలతో కోవిడ్ ఆసుపత్రి: రిలయన్స్ -
మైక్రోసాఫ్ట్ చేతికి నోకియా
ముంబై: రెండు దిగ్గజ కంపెనీలు ఒకటి కానున్నాయి. సాఫ్ట్వేర్ రంగ రారాజు మైక్రోసాఫ్ట్... మొబైల్ ఫోన్ల దిగ్గజం నోకియాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 720 కోట్ల డాలర్లను(సుమారు రూ. 47,520 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా ఇప్పటికే మొబైల్ మార్కెట్‌ను ఏలుతున్న శామ్సంగ్, యాపిల్‌కు చెక్ పెట్టాలని భావిస్తోంది. డీల్ తరువాత నోకియా కేవలం నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థగా మిగలనుండగా, సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హార్డ్‌వేర్‌లోనూ రాణించనుంది. కాగా, నోకియా ఇప్పటికే స్మార్ట్ఫోన్ల విభాగంలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ ద్వారా మొబైళ్లు, ట్యాబ్లెట్ల వృద్ధిలో ముందున్న ఇండియా మార్కెట్లో మైక్రోసాఫ్ట్ మరింత పటిష్టంకానుంది. డీల్ వెల్లడికావడంతో హెల్సింకీ స్టాక్ ఎక్స్ఛేంజీలో నోకియా షేరు 40% దూసుకెళ్లగా, నాస్డాక్లో మైక్రోసాఫ్ట్ షేరు నామమాత్రంగా లాభపడింది. డీల్‌లో భాగంగా నోకియా ఫోన్ల బిజినెస్‌తోపాటు, క్వాల్కామ్ తదితర ఐపీ లెసైన్స్‌లను కూడా మైక్రోసాఫ్ట్ చేజిక్కిం చుకోనుంది. టెలికం పరికరాల విభాగం నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వ ర్క్స్, లొకేషన్ మ్యాపింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నోకియాకు మిగులుతాయి. మళ్లీ మైక్రోసాఫ్ట్ గూటికి స్టీఫెన్ ప్రస్తుత నోకియాను నడిపిస్తున్న కెనడియన్ బాస్ ‘స్టీఫెన్ ఎలాప్’ ఒకప్పుడు మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్వేర్ బిజినెస్ విభాగాన్ని నిర్వహించిన వ్యక్తే. కాగా, నోకియాతో డీల్ కారణంగా స్టీఫెన్ తిరిగి మైక్రోసాఫ్ట్ తరఫున పనిచేయనున్నారు. 2010లో ఆయన నోకియాకు తరలి వెళ్లారు. వెరసి ఇకపై ఎలాప్తోపాటు మొత్తం 32,000 మంది నోకియా సిబ్బంది మైక్రోసాఫ్ట్ తరఫున విధులు నిర్వర్తించనున్నారు. డీల్ వల్ల బ్లాక్‌బెర్రీకి పోటీ తీవ్రంకానుందని నిపుణులు పేర్కొన్నారు. అందరికీ ప్రయోజనమే నోకియాతో డీల్ తమ రెండు కంపెనీలకూ చెందిన ఉద్యోగులతోపాటు... వాటాదారులు, వినియోగదారులకు కూడా ప్రయోజనకరమేనని మైక్రోసాఫ్ట్ సీఈవో బామర్ పేర్కొన్నారు. అటు సాఫ్ట్వేర్ విభాగంలోనూ, ఇటు ఫోన్ల మార్కెట్లోనూ తమ సంస్థతోపాటు, భాగస్వామ్య కంపెనీలు కూడా డీల్ వల్ల లబ్ధి పొందుతాయని వ్యాఖ్యానించారు. కంపెనీకి తిరిగి వస్తున్న స్టీఫెన్ ఇకపై మొబైళ్లు తదితర తమ మొత్తం పరికరాల టీమ్‌లను నిర్వహిస్తారని బామర్ తమ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. లూమియా, ఆశా బ్రాండ్లు డీల్‌లో భాగంగా లూమియా, ఆశా బ్రాండ్లతోపాటు, ఫీచర్ ఫోన్లకు నోకియా పేరును పదేళ్లపాటు మైక్రోసాఫ్ట్ వినియోగించుకోనుంది. దీంతోపాటు 8,500 డిజైన్లకు సంబంధించిన పేటెంట్లు, మ్యాపింగ్ సర్వీసుల లెసైన్స్‌ను కూడా పొందుతుంది.