స్మార్ట్‌సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం స్వీకరిస్తాం
ఏయూక్యాంపస్: స్మార్ట్ సిటీగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగస్వామిగా ఏయూ నిలుస్తుందని ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉదయం అమెరికా ప్రతినిధులను సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్సిటీలో ప్రత్యేకంగా నోడల్ ఏజన్సీని ఏర్పాటు చేస్తామన్నారు. స్మార్ట్సిటీపై అధ్యయనం చేసే నిపుణులకు సమన్వయం జరుపుతూ పనిచేస్తామన్నారు. దీనికి సంధాన కర్తగా ఆచార్య బాల ప్రసాద్‌ను వ్యవహరించాలని సూచించారు. జీవీఎంసీతో సమన్వయం జరుపుతూ పనిచేయాలన్నారు. స్మార్ట్ సిటీ నిర్మాణానికి సంబంధించి విభిన్న అంశాలలో ఏయూలోని నిపుణుల సూచలను స్వీకరించాలని సూచించారు. ప్రతీ రంగంలో అందుబాటులో వున్న నిపుణులను సమన్వయం చేస్తూ స్థానికంగా అభివద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ నిపుణులు తమ ఆలోచనలను పంచుకుంటే వీటిని అనుగుణంగా స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆచార్యులు పనిచేస్తారన్నారు. స్మార్ట్ సిటీలలో ఏయూను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
అమెరికన్ ఎంబసీకి చెందిన ఆల్ ఇండియా ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ అడ్వయిజర్ మనదీప్ కౌర్మాట్లాడుతూ అమెరికా దేశ నిపుణులు అలహాబాద్, ఆజ్మీర్,విశాఖ నగరాలను సందర్శించనున్నారన్నారు. ఎనర్జీ, ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంట్ రంగాలలో నిపుణులైన ఆచార్యుల సహకారం అవసరమన్నారు. సజనాత్మకంగా పనిచేయడానికి, సుస్తిర నగరాలను తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం అవసరమన్నారు. త్వరలో ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన నిపుణులు సందర్శించడం జరుగుతుందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మిన్నోసోట ఆచార్యుడు డాక్టర్ అను రామస్వామి మాట్లాడుతూ జివిఎంసీ చేస్తున్న కార్యక్రమాలకు సహాయకారిగా నిలుస్తున్నామన్నారు. ఎనర్జీ, శానిటేషన్, ఫుడ్సప్లయ్, సబ్లిక్ స్పేస్, ట్రాన్స్‌పోర్టేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ తదితర రంగాలలో పనిచేస్తామన్నారు. విశ్వవిద్యాలయాలో సంయుక్తంగా పనిచేసి అర్థవంతమైన పరిష్కారాలను చూడం జరుగుతుందన్నారు. విద్యాసంస్థల భాగస్వామ్యం అభిలషనీయమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, ఆచార్య వి.బాల ప్రసాద్, జి.వి.ఆర్ శ్రీనివాసరావు, ఇ.ఉదయ భాస్కర రెడ్డి, టి.భైరాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అను రామస్వామి, మనుదీప్ కౌర్‌లను వీసీ నాగేశ్వరరావు సత్కరించారు.