పొరపాటుతో... అదృష్టం తన్నుకొచ్చింది
లండన్ : ఇంగ్లండ్‌లోని స్టాన్ఫోర్డ్షైర్కు చెందిన స్టువర్ట్ పావెల్ వృత్తిరీత్యా లారీ డ్రైవర్. ప్రతివారం లాటరీ టికెట్ కొనడం అలవాటు. అలాగే నవంబరు 20 యూరో మిలియన్ లాటరీ కోసం రెండు పౌండ్లు (రెండొందల రూపాయలు) పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. అయితే షాపు నిర్వాహకుడు బద్ధకస్తుడు. 20వ తేదీన డ్రా తీసే లాటరీకి బదులుగా 24న డ్రా ఉన్న వేరే టికెట్ ఇచ్చాడు. పావెల్ చూసుకోకుండా టిక్కెట్ జేబులో పెట్టుకొని ఇంటికెళ్లిపోయాడు. 20వ తేదీన ఫలితాలను చూసేందుకు కంప్యూటర్ ముందు కూర్చుంటేగాని అతనికి తనకు తప్పుడు టికెట్ ఇచ్చారనే విషయం తెలియలేదు.
షాపు అతన్ని తిట్టుకున్నాడు. 24న డ్యూటీలో ఉన్న అతను లారీలో కూర్చొనే భార్య డెనిస్‌కు ఫోన్ చేసి ఫలితాలను చెక్ చేయమన్నాడు. ఆమె ఒకటి రెండుసార్లు చూసి... ‘ఓ మై గాడ్’ అని అరిచేసింది. పావెల్ అతృతగా ఏం జరిగిందని అడిగాడు... దాంతో ఆమె విషయం చెప్పింది. లాటరీలో తమకు మిలియన్ పౌండ్లు (రూ. 10 కోట్ల పైచిలుకు) తగిలాయని చెప్పింది.
పావెల్ తాను నడిపే లారీలోనే భార్య డెనిస్‌ను తీసుకొని వచ్చి లాటరీ చెక్‌ను తీసుకున్నాడు. మొత్తం మీద షాపు నిర్వాహకుడు చేసిన పొరపాటుతో పావెల్‌కు అదృష్టం తన్నుకొచ్చింది... అదీ సంగతి. ఉద్యోగం మాననని... ఎదిగొచ్చిన ముగ్గురు కుమారులకు తలా ఓ ఇల్లు కొనిపెడతానని, తండ్రికి ఓ కారు కొంటాడని చెప్పాడు పావెల్.