sub collectors
-
సబ్‌కలెక్టర్లుగా 12 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లు
సాక్షి, అమరావతి : 2018 బ్యాచ్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లను సబ్‌కలెక్టర్లుగా నియమిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కడప సబ్‌కలెక్టర్‌గా పృథ్వీతేజ్, నూజివీడు సబ్‌కలెక్టర్‌గా ప్రతిస్త, అమలాపురం సబ్‌కలెక్టర్‌గా హిమాన్షు, కందుకూరు సబ్‌కలెక్టర్‌గా భార్గవ్‌తేజ, పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా విధేకర్, నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌గా మౌర్య, నరసరావుపేట సబ్‌కలెక్టర్‌గా అజయ్‌కుమార్, రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా అంజలి, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా ధనుంజయ్, మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా జాహ్నవి, నంద్యాల సబ్‌కలెక్టర్‌గా కల్పన, రాజంపేట సబ్‌కలెక్టర్‌గా కేతన్, చిత్తూరు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎంఎస్ మురళి ఉన్నారు. -
‘రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేస్తాం’
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వాటిని భవిష్యత్తులో మరింత పటిష్టం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొత్తగా నియమితులైన జాయింట్ కలెక్టర్లు(రైతు భరోసా), ఇతర అనుబంధ శాఖల అధికారులతో మంత్రి కన్నబాబు బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కొత్త యాప్ ద్వారా రైతు ఎప్పటికప్పుడు పంటల వివరాలు నమోదు చేయ వచ్చని తెలిపారు. 5 లక్షల మంది రైతులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్లను నియమించామని తెలిపారు. మే 30 నుంచి రైతు భరోసా కేంద్రాలను ప్రజా ప్రతినిధులు సందర్శిస్తారని మంత్రి కన్నబాబు తెలిపారు. జూన్ 1 నుంచి వ్యవసాయానికి సంబంధించిన పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. పలు పథకాలతో సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేశారని తెలిపారు. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు అర్ధ రహితమన్నారు. -
ఆరుగురికి సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు
సాక్షి, అమరావతి: ఐఏఎస్‌కు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఆరుగురు అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్ కలెక్టర్లుగా నియమించింది. 2017 ఐఏఎస్‌కు బ్యాచ్‌కు చెందిన ఆరుగురు అధికారులు ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని, కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీలుగా నిర్ధిష్ట కాల శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన ఆరుగురికి ప్రభుత్వం సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది. నెల్లూరు జిల్లాలోని గూడూరుకు గోపాల కృష్ణ రోణంకి, గుంటూరు జిల్లాలోని తెనాలికి కొత్తమాసు దినేష్ కుమార్, విజయవాడకు ధాన్య చంద్ర, పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్‌కు కె.ఎస్.విశ్వనాథన్, రంపచోడవరానికి సీవీ ప్రవీణ్ ఆదిత్య, అనంతపురం జిల్లాలోని పెనుకొండకు టి.నిశాంతి సబ్ కలెక్టర్లుగా నియమితులయ్యారు. ఈమేరకు వారిని సబ్ కలెక్టర్లుగా నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి, పెనుకొండ, రంపచోడవరం సబ్ డివిజన్లకు సబ్ కలెక్టర్లను నియమించినందున ఇక్కడ రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓలుగా) పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిని తదుపరి పోస్టింగుల కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో పలువురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. దీనిలో భాగంగా 140 మంది సీనియర్ సీఐల జాబితా వడపోతకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రూపొందించిన సీఐల జాబితాను జిల్లాల వారీగా పరిశీలన కోసం ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పంపించారు. -
జిల్లాకు ఇద్దరు కొత్త సబ్కలెక్టర్లు
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాకు ఇద్దరు నూతన సబ్కలెక్టర్లు నియమితులయ్యారు. ఒకర్ని విజయవాడ డివిజన్‌కు, మరొకరిని నూజీవీడు డివిజన్‌కు ప్రభుత్వం కేటాయించింది. విజయవాడ సబ్‌కలెక్టర్‌గా నియమితులైన మిషాసింగ్ 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ముస్సోరిలోని లాల్‌బహుదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత భారత ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖలో డెప్యుటేషన్‌పై అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందడంతో ఆమెను విజయవాడ సబ్‌కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నూజీవీడు సబ్ కలెక్టర్‌గా నియమితులైన పుండ్కర్ స్వప్నిల్ దినకర్ కూడా 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారే. ఆయన కూడా ముస్సోరిలో శిక్షణ ముగించిన తరువాత భారత ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖలో పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నూజీవీడు సబ్‌కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. -
అనంతపురానికి డెప్యుటేషన్‌పై సబ్ కలెక్టర్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అనంతపురంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం డెప్యుటేషన్‌పై పంపింది. జిల్లా నుంచి ఇద్దరు సబ్ కలెక్టర్లను డెప్యుటేషన్‌పై పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. నరసాపురం సబ్‌కలెక్టర్ దినేష్‌కుమార్, కుక్కునూరు సబ్‌కలెక్టర్, ఐటీడీఏ పీవో షాన్మోహన్ను డెప్యుటేషన్‌పై పంపింది. ఇటీవల వరకూ కృష్ణా పుష్కరాలకు కూడా ఈ ఇద్దరిని ప్రత్యేక అధికారులుగా పంపిన సంగతి తెలిసిందే. కృష్ణా పుష్కరాల నుంచి రాగానే మళ్లీ అనంతపురం డెప్యుటేషన్ వేయడంతో పోలవరం భూసేకరణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడినటై్టంది.