
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాకు ఇద్దరు నూతన సబ్‌కలెక్టర్లు నియమితులయ్యారు. ఒకర్ని విజయవాడ డివిజన్‌కు, మరొకరిని నూజీవీడు డివిజన్‌కు ప్రభుత్వం కేటాయించింది. విజయవాడ సబ్‌కలెక్టర్‌గా నియమితులైన మిషాసింగ్ 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ముస్సోరిలోని లాల్‌బహుదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత భారత ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖలో డెప్యుటేషన్‌పై అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందడంతో ఆమెను విజయవాడ సబ్‌కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నూజీవీడు సబ్ కలెక్టర్‌గా నియమితులైన పుండ్‌కర్ స్వప్నిల్ దినకర్ కూడా 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారే. ఆయన కూడా ముస్సోరిలో శిక్షణ ముగించిన తరువాత భారత ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖలో పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నూజీవీడు సబ్‌కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment