సాక్షి, అమరావతి: ఐఏఎస్‌కు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఆరుగురు అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్ కలెక్టర్లుగా నియమించింది. 2017 ఐఏఎస్‌కు బ్యాచ్‌కు చెందిన ఆరుగురు అధికారులు ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని, కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీలుగా నిర్ధిష్ట కాల శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన ఆరుగురికి ప్రభుత్వం సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది.
నెల్లూరు జిల్లాలోని గూడూరుకు గోపాల కృష్ణ రోణంకి, గుంటూరు జిల్లాలోని తెనాలికి కొత్తమాసు దినేష్ కుమార్, విజయవాడకు ధాన్య చంద్ర, పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్‌కు కె.ఎస్.విశ్వనాథన్, రంపచోడవరానికి సీవీ ప్రవీణ్ ఆదిత్య, అనంతపురం జిల్లాలోని పెనుకొండకు టి.నిశాంతి సబ్ కలెక్టర్లుగా నియమితులయ్యారు. ఈమేరకు వారిని సబ్ కలెక్టర్లుగా నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి, పెనుకొండ, రంపచోడవరం సబ్ డివిజన్లకు సబ్ కలెక్టర్లను నియమించినందున ఇక్కడ రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓలుగా) పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిని తదుపరి పోస్టింగుల కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో పలువురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. దీనిలో భాగంగా 140 మంది సీనియర్ సీఐల జాబితా వడపోతకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రూపొందించిన సీఐల జాబితాను జిల్లాల వారీగా పరిశీలన కోసం ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment