subbi Rami Reddy
-
‘సైరా’ టీమ్‌కు సన్మానం
-
ఎలా వచ్చాడో.. అలాగే వెళ్ళాడు..
బంజారాహిల్స్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్న కుమారుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు రెండు కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఓ దొంగ దోచుకెళ్లాడు. ప్రముఖ బిల్డర్ అయిన తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఉత్తమ్ తన కుటుంబంతో కలసి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి భోజనం ముగించుకుని కుటుంబ సభ్యులంతా నిద్ర పోయారు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంటి వెనుక ఉన్న జపనీస్ గార్డెన్ ప్రహరీ గోడపై నుంచి దూకి ఆగంతకుడు ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఇంటి వెనుకవైపు ఉన్న అద్దం తలుపు తాళాన్ని స్క్రూ డ్రైవర్‌తో తొలగించి లోపలికి ప్రవేశించాడు. హాల్లో నుంచి మెట్లు ఎక్కి.. మొదటి అంతస్తులోని ఉత్తమ్‌రెడ్డి బెడ్రూంలోకి వెళ్లాడు. ఆ బెడ్రూం పక్కనే ఉన్న చిన్న సందు ద్వారా ముందుకు వెళ్తే కప్బోర్డు ఉంది. దాని తాళాలు పగులగొట్టి వజ్రాభరణాలను తీసుకుని వచ్చిన దారినే దొంగ ఉడాయించాడు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉత్తమ్ భార్య శ్రీలతారెడ్డి లేచి చూడగా.. ఇల్లంతా చిందర వందరగా కనిపించింది. దీంతో వెంటనే కప్బోర్డును తెరిచి చూడగా.. అందులో ఉన్న ఆభరణాలు కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులకు విషయం చెప్పగా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, డీఎస్ఐ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో క్రైం బృందం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. పోలీసు జాగిలాలతో నిందితుడి జాడ వెతికారు. జాగిలాలు జపనీస్ ప్రహారీ గోడ వరకు వెళ్లి తిరిగి వచ్చాయి. ఇవాళే బ్యాంకులో పెడదామని.. గత ఆదివారం శుభకార్యం ఉండటంతో బ్యాంకు లాకర్ నుంచి శ్రీలతారెడ్డి ఆభరణాలు తెచ్చుకున్నారు. శుభకార్యం అయిపోయిన తర్వాత ఆభరణాలను తన బెడ్రూమ్లోని కప్‌బోర్డులో భద్రపరిచారు. మంగళవారం ఆభరణాలను తిరిగి బ్యాంకు లాకర్లో పెట్టాలని భావించారు. కానీ అంతలోనే ఇలా చోరీకి గురయ్యాయి. ముసుగు ధరించిన దొంగ.. దొంగ ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రెండు గంటల ప్రాంతంలో ఇంటి లోపలికి వెళ్లిన ఆగంతకుడు.. 4 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే తెలుస్తోంది. దొంగతనానికి పాల్పడిన ఆగంతకుడి వయసు 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. జీన్స్ ప్యాంట్, టీషర్ట్ ధరించిన దొంగ ముఖానికి ముసుగు వేసుకొని చేతులకు గ్లౌజ్‌లు తొడుక్కున్నట్లుగా కనిపిస్తోంది. కాళ్లకు మాత్రం షూస్, చెప్పులు ధరించలేదు. ఎలాంటి ఆధారాలు లభించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు దొంగ కదలికలను బట్టి తెలుస్తోంది. దొంగతనంలో ఒక్కడే పాల్గొన్నట్లు స్పష్టంగా కనిపించడంతో పాత నేరస్తుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. ఏడాది కింద ఎమ్మెల్యే కాలనీలో దొంగతనానికి పాల్పడిన సత్తిరెడ్డి అనే నేరస్తుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలా వచ్చాడో.. అలాగే వెళ్ళాడు.. వెనుకవైపు నుంచి ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు ఇళ్లంతా కలియదిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇంటి ప్రధాన గేటు వద్దకు కూడా వచ్చిన దొంగ.. అక్కడినుంచి కాకుండా వచ్చిన దారి గుండానే వెళ్లిపోయాడు. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దామని ప్రధాన గేటు వద్దకు రాగా.. సెక్యూరిటీ గార్డు నిద్రిస్తున్నట్లు గమనించి మెయిన్‌డోర్ తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వెంటనే వెనుక గేటులో నుంచి లోపలికి ప్రవేశించాడు. ఉత్తమ్ దంపతులు రోజూ రాత్రి 8 గంటలకు పడుకొని తెల్లవారుజామున 3.30 గంటలకు లేస్తారు. అయితే ఘటన జరిగిన రోజు మాత్రం 5 గంటల దాకా నిద్రపోవడంపై తమపై మత్తు ప్రయోగం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంకోవైపు రోజూ తలుపు వేసుకుని పడుకునే ఉత్తమ్ దంపతులు ఈ రోజు మాత్రం డోర్ వేసుకోలేదు. తాళం చెవులు ఉన్న బ్యాగును ఉత్తమ్ తన దిండు వద్ద పెట్టుకున్నాడు. ఆ బ్యాగులో నుంచి దొంగ తాళాలు తీసుకొని కప్బోర్డ్లు తెరిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. -
నా కెరీర్ నిలబెట్టిన వ్యక్తి ఆయన
‘‘షారుక్ ఖాన్‌కు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉంది. ఏప్రిల్ 8న వైజాగ్‌లో జరపనున్న టీయస్సార్– టీవీ9 నేషనల్ ఫిలిం అవార్డు వేడుకలో ఆయనకు ‘మిలీనియమ్ స్టార్ అవార్డు’ను కూడా అందజేయనున్నాం’’ అని కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. ‘సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్’ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన వేడుకలో హిందీ నటుడు షారుక్ ఖాన్‌కు ‘యశ్ చోప్రా మెమోరియల్’ అవార్డును ప్రదానం చేశారు. షారుక్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘చూడ్డానికి నేను అంత బాగుండను. అందుకని లవర్ బాయ్ కావాలనుకోలేదు. రొమాంటిక్ పాత్రలు చేసేంత అందగాణ్ణి కాదనుకునేవాణ్ణి. కానీ, యశ్ చోప్రా ‘నువ్వు లవ్‌స్టోరీస్ చేయకపోతే నీ కెరీర్ ఎదగదు’ అనేవారు. ఆయనలాంటి వ్యక్తి చెబితే దాంట్లో కచ్చితంగా అర్థం ఉంటుంది. నాతో లవ్‌స్టోరీస్ తీసి, నా కెరీర్‌ని నిలబెట్టారాయన’’ అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు, నటుడు శత్రుఘ్న సిన్హా, నటీమణులు రేఖ, జయప్రద, పద్మినీ కోల్హాపురి, మాధురీ దీక్షిత్‌లతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
టి. సుబ్బరామిరెడ్డి సానియామీర్జాను సన్మానించారు
న్యూఢిల్లీ: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ డబుల్స్ నంబర్‌వన్ సానియామీర్జాను రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్‌తో పాటు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, నటుడు రానా కూడా పాల్గొన్నారు. -
స్వర్గీయ రామానాయుడు సంస్మరణ సభ
-
నేటి తరానికి ఆయన దిక్సూచి : దాసరి నారాయణరావు
‘‘చనిపోయాక కూడా బతికేవాళ్లు కొంతమందే ఉంటారు. అలాంటివాళ్లల్లో రామానాయుడు ఒకరు. నిర్మాతకు నిర్వచనం ఆయన. సినిమా నిర్మాణానికి సంబంధించిన ప్రతి విభాగంలోనూ ఆయనకు మంచి పట్టు ఉంది. కథ విషయంలో ఆయన అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. నేటి తరానికి ఆయన దిక్సూచి ’’ అని దర్శక రత్న దాసరి నారాయణరావు అన్నారు. ప్రముఖ నిర్మాత స్వర్గీయ రామానాయుడు సంస్మరణ సభను టి. సుబ్బిరామిరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ - ‘‘సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామానాయుడు. సమాజం పది కాలాలపాటు గుర్తుంచుకునే చక్కని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి’’ అన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ- ‘‘హిట్ దర్శకులతోనే కాకుండా ఫెయిల్యూర్ దర్శకులతో కూడా ఆయన సినిమాలు తీశారు. సురేష్‌బాబు తన ఫిలిం ఇన్స్టిట్యూట్లో తండ్రి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చితే బాగుంటుంది’’ అని సూచించారు. ‘‘నాతో రెండో సారి సినిమా తీస్తే అది ఫ్లాప్ అన్న ముద్ర నా మీద అప్పట్లో ఉండేది. అయినా తన ‘రాముడు- భీముడు’ సినిమా తర్వాత రెండో సినిమా ‘శ్రీ కృష్ణ తులాభారం’లో కూడా రామానాయుడుగారు నన్ను హీరోయిన్గా తీసుకున్నారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. చివరి శ్వాస వరకూ సినిమాకే ఆయన జీవితాన్ని అంకితం చేశారు’’ అని జమున తెలిపారు. డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ - ‘‘నాన్న చనిపోయిన తర్వాత మా కుటుంబానికి మద్దతుగా నిలిచిన అందరికీ నా కృత జ్ఞతలు’’ అన్నారు. ప్రతి ఏడాది తమ లలితాకళా పరిషత్ ఆధ్వర్యంలో రామానాయడు పేరుతో విశిష్ట పురస్కారాన్ని అందజేస్తానని టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాల రావు, పాటల రచయిత డా. సి. నారాయణరెడ్డి, బ్రహ్మానందం, మురళీమోహన్, వెంకటేశ్, రానా, నాగచైతన్య, జయసుధ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అధిష్టానం మల్లగుల్లాలు
ప్రధాన కార్యదర్శులతో సోనియా చ ర్చలు రాజు, కేవీపీల పేర్లు దాదాపు ఖరారు మూడో స్థానానికి బొత్స, సుబ్బిరామిరెడ్డి పట్టు! టీఆర్ఎస్ కోరితే నాలుగో స్థానాన్ని వదిలేయాలని నిర్ణయం! 4వ స్థానంలో పోటీ చేయాల్సివస్తే తెలంగాణ నుంచి మైనార్టీలకు చాన్స్ సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రం నుంచి బరిలో నలుగురిని పోటీ చేయించాలని, సీమాంధ్ర నుంచి గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే, నలుగురిని నిలిపితే గట్టెక్కగలమా? ముగ్గురితోటే సరిపెట్టుకోవాలా? టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతోంది.. తదితర అంశాలపై పార్టీ అధిష్టానం కూలంకషంగా చర్చిస్తోంది. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు శనివారం ఉదయం నుంచి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిలుగా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, విజయావకాశాలపై సమగ్ర నివేదికతో హస్తిన చేరిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఉదయమే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. అనంతరం సోనియాగాంధీతో దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యారు. సాయంత్రం బొత్స సత్యనారాయణతో చర్చించారు. అనంతరం బొత్స శనివారం రాత్రి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. రాహుల్‌కు సన్నిహితుడుగా పేరున్న ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, సిట్టింగ్ సభ్యుడిగా ఉన్న కె.వి.పి.రామచంద్రరావుల పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం. సీమాంధ్రలో అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతలను అప్పగిస్తూ కేవీపీని బరిలోకి దింపనున్నట్టు సమాచారం. మూడో అభ్యర్థిని కూడా సీమాంధ్ర నుంచే నిలపాలా? లేక తెలంగాణ నుంచి ఇద్దరిని నిలబెట్టాలా? అన్న మీమాంస అధిష్టానాన్ని వీడటంలేదు. అయితే, మూడో స్థానానికి మాత్రం సీమాంధ్ర నుంచి గట్టి పోటీ నెలకొంది. పార్టీ బాధ్యతలు చూస్తున్న తనకు అవకాశం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స గట్టిగా కోరుతున్నట్లు తెలిసింది. ఆయనకు దిగ్విజయ్‌సింగ్ కూడా గట్టి మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు లోక్‌సభకు పోటీ చేస్తానని చెబుతున్న టి.సుబ్బిరామిరెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా రాజ్యసభ సీటు కోరుతూ శనివారం సాయంత్రం దిగ్విజయ్‌సింగ్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. పార్టీకి పూర్తి విధే యురాలిగా ఉన్న తనకు అవకాశమివ్వాలని కోరినట్లు తెలిసింది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన నంది ఎల్లయ్యకు బదులు ఇప్పుడు సీమాంధ్రలో ఒక దళితుడికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఆ స్థానం కొప్పుల రాజుతో భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మికి అవకాశం దక్కకపోవచ్చు. అయితే, మహిళలకు అవకాశం ఇవ్వాలన్న రాహుల్ ఆలోచనలు ఆచరణలోకి వస్తే పనబాకకు రాజ్యసభ సీటు దక్కినా ఆశ్చర్యం లేదని పార్టీవర్గాలు అంటున్నాయి. టీఆర్ఎస్ కోరితే నాలుగో స్థానాన్ని ఆ పార్టీకి వదిలేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు లేదా విలీనం వ్యవహారం సజావుగా సాగేందుకు ఇది దోహదం చేస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఒకవేళ నాలుగో స్థానానికి పోటీ చేయాల్సి వస్తే తెలంగాణ నుంచి మైనారిటీలకే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ లేదా మైనారిటీ వర్గానికే చెందిన మరో నాయకుడికి గానీ అవకాశం దక్కే పరిస్థితి ఉంది. అయితే ఎం.ఐ.ఎం. వైఖరినిబట్టి అభ్యర్థి నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.