subplan funds
-
వర్గపోరుతో నిధుల వాపస్
రూ.3.20 కోట్ల సబ్‌ప్లాన్ నిధులు వెనక్కి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల విభేదాలే కారణం దళితవాడల అభివృద్ధిపై చిత్తశుద్ధి కరువు ఆ నిధులు మళ్లీ తెచ్చుకోవడం కష్టమే కదిరి : కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వర్గాలకు చెందిన కౌన్సిలర్ల మధ్య విభేదాల నేపథ్యంలో దళితవాడల అభివృద్ధి కోసం మంజూరైన రూ.3.20 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ నిధులు తమ వార్డులోనే ఖర్చు చేయాలని ఒక వర్గం.. కాదు తమ వార్డులోనే వెచ్చించాలంటూ మరో వర్గం వారు పోటీపడ్డారు. ఆఖరుకు ఎక్కడా ఖర్చు చేయకుండానే వచ్చిన నిధులన్నీ తిరుగుముఖం పట్టాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్ చంద్రశేఖర్ (36వ వార్డు) గతంలో తన పదవికి రాజీనామా సమర్పించారు. కొందరు నచ్చజెప్పడంతో ఆఖరుకు తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తల్లి నారాయణమ్మ పేరుమీద అనధికారికంగా ఏర్పడిన కాలనీకే ఎక్కువ మొత్తంలో సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని కౌన్సిల్ ఆమోదం కోసం అజెండా సిద్ధం చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు సొంత పార్టీ కౌన్సిలర్లు సైతం కొందరు వ్యతిరేకించడంతో కౌన్సిల్ ఆమోదం పొందలేదు. ఎస్సీ, ఎస్టీలున్న చోటే ఖర్చు చేయాలి వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆ వర్గాల ప్రజలు ఎక్కువ శాతం నివాసమున్న ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలనే నిబంధనలున్నాయి. అయితే.. ఎస్సీ, ఎస్టీలు లేని వార్డుల్లోనూ ఆ నిధులు ఖర్చు చేయడానికి మునిసిపల్ పాలకులు ప్రయత్నించారు. తద్వారా ‘స్వామి భక్తి’ని చాటుకోవాలని వారు ప్రయత్నించగా కథ అడ్డం తిరిగింది. సబ్‌ప్లాన్ ని«ధుల కేటాయింపు విషయంలో పారదర్శకత లేకపోవడాన్ని ప్రతి కౌన్సిల్లోనూ మెజార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో ఆ అం«శం ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గడువు ముగిసిపోవడంతో నిధులు వాపసు వెళ్లిపోయాయి. అభివృద్ధికి నోచుకోని దళితవాడలెన్నో.. కదిరి మునిసిపాలిటీ పరిధిలో రాజీవ్‌గాంధీనగర్, కుటాగుళ్ల, అమీన్‌నగర్, నిజాంవలీ కాలనీ, పాత హరిజనవాడతో పాటు ఎస్సీ, ఎస్టీలు ఎక్కువమంది నివాసమున్న కాలనీలు, వీధులు చాలానే ఉన్నాయి. ఆయా ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. సబ్‌ప్లాన్ నిధులు వెచ్చించినట్లయితే రోడ్లు, వీధిదీపాలు, మురుగుకాలువలు పూర్తయ్యేవి. అయితే.. ఆ ఇద్దరు నేతల అనుచరుల కొట్లాట కారణంగా అభివృద్ధి కుంటుపడింది. ఈ పరిస్థితి ఎన్నడూ లేదు–రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్, కదిరి మంజూరైన నిధులు ఖర్చు చేయకుండా వాపసు వెళ్లిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ శాతం మంది ఉన్న చోట ఖర్చు చేయడానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కానీ టీడీపీలోని గ్రూపుల కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది. వచ్చిన నిధులు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి. నిధుల వాపసు వాస్తవమే– భవానీప్రసాద్, మునిసిపల్ కమిషనర్, కదిరి సబ్‌ప్లాన్ నిధులు సుమారు రూ.3.20 కోట్లు వాపసు వెళ్లిపోయిన మాట వాస్తవమే. ఈ అంశంపై చాలా సార్లు కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టాం. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక చివరకు నిధులు వాపసు వెళ్లాయి. మళ్లీ ఆ నిధులు తెచ్చుకోవడం కష్టమే! -
'రూ. 20 వేల కోట్ల నిధులు లాప్స్'
హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో ఇప్పటివరకు రూ. 20 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు వృధా అయ్యాయని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్ లో వృధా అయిన నిధులను ప్రత్యేక నిధుల కింద కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ లో ఎస్సీలకు 15.5 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు. బడ్జెట్ ను కేటాయింపులకు పరిమితం చేయకుండా ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసి ఖర్చుచేయాలన్నారు. దీన్ని అమలు చేయకపోతే సీఎం కేసీఆర్ చీటింగ్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బడ్జెట్లో సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులను క్వాటర్లీ వారీగా విడుదల చేయకుండా ఏడాది చివర్లో విడుదల చేసి అవి ఖర్చు కాలేదని ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. -
ఎస్సీ సబ్‌ప్లాన్ టెండర్లకు బ్రేక్
ఆనం సోదరుల ఎత్తుగడకు అజీజ్ పై ఎత్తు టెండర్లు రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు నెల్లూరు, సిటీ: టీడీపీలో ఆధిపత్యపోరు కారణంగా నెల్లూరు కార్పొరేషన్లో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. నగర మేయర్ అజీజ్, ఆనం సోదరుల మధ్య ఆది నుంచి విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దళితవాడల్లో అభివృద్ధి పనులకు విడుదలైన ఎస్సీ సబ్‌ప్లాన్ ని«ధులతో జరగాల్సిన పనులకు మరోసారి బ్రేక్ పడినట్లయింది. ఇటీవల సబ్‌ప్లాన్ నిధులు రూ.42కోట్లతో 8 ప్యాకేజీలు చేసి అధికారులు టెండర్లను పిలిచారు. వీటిని దక్కించుకుని అజీజ్‌కు చెక్ పెట్టేందుకు ఆనం సోదరులు రంగంలోకి దిగారు. ఈ టెండర్లను ఆనం సోదరులు వారి మద్దతుదారుల ద్వారా దాఖలు చేయించారు. ఈ విషయాన్ని సాక్షి పత్రిక శనివారం 'ఆదాల, అజీజ్‌కు ఆనం చెక్' అనే శీర్షికతో కథనం ప్రచురించింది. దీంతో మేయర్ అజీజ్ సబ్‌ప్లాన్ నిధుల టెండర్ల పై ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. ఆనం సోదరులు కార్పొరేషన్‌పై పట్టుకోసం వారి మద్దతుదారులైన కాంట్రాక్టర్ల ద్వారా టెండర్లు వేయించిన విషయం నిజమేనని తేలింది. దీంతో మేయర్ అజీజ్ టెండర్లు రద్దు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన టెండర్ల దాఖలు గడువు ముగినుంది. ఈ క్రమంలో టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచే యోచనలో మేయర్ ఉన్నట్లు సమాచారం. పట్టు కోసం ఆనం, అజీజ్ పాకులాట టీడీపీలో ఆనం సోదరులు తమ పట్టుకోసం అందిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచి ఆనం వివేకాను వ్యతిరేకిస్తున్న మేయర్ అజీజ్ టీడీపీలో ఆనం సోదరులు చేరికను జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆనం వివేకాందరెడ్డి సైతం కార్పొరేషన్లో తన ముద్ర ఉండే విధంగా కొంత కాలంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో పిలిచిన టెండర్లను ఆనం సోదరులు తమ వర్గ కాంట్రాక్టర్ల ద్వారా దాఖలు చేయించారు. ఇదే క్రమంలో మేయర్ అజీజ్ సైతం మరో అడుగు ముందుకేసి టెండర్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులకు టెండర్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నేడో, రేపో టెండర్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు. అన్ని కార్పొరేషన్లలో పనులు ప్రారంభించినా.. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరై దాదాపు 10 నెలలు గుడుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో సబ్‌ప్లాన్ నిధులతో పనులు పూర్తిచేశారు. నెల్లూరు కార్పొరేషన్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. టీడీపీ నాయకులు ఆధిపత్యపోరు, సొంత లాభార్జన కోసం ఇంత కాలం టెండర్లు పిలవకుండా ఆలస్యం చేశారు. వైఎస్సార్సీపీ నగర, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి ఇద్దరూ కార్పొరేషన్ వద్ద ధర్నాకు దిగడంతో ఎట్టకేలకు టెండర్లు పిలిచారు.టెండర్లు పిలిచి రోజులు గడవక ముందే టీడీపీలో ఆధిపత్యపోరు కారణంగా రద్దు చేయడంతో నగరంలో అభివృద్ధి కుంటుపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.. -
‘ఎంపీటీసీలకు 6 వేల గౌరవ వేతనమివ్వాలి’
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎంపీటీసీల ద్వారానే ఖర్చు చేయాలని, వారికి నెలవారీ గౌరవ వేతనం కింద రూ.6 వేలు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఎంపీటీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఫోరం(టీఎస్ ఎంపీటీసీ ఫోరం) కన్వీనర్ బొల్లి స్వామి డిమాండ్ చేశారు. తెలంగాణలోని 6,277 మంది ఎంపీటీసీల్లో 1,497 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని, రాష్ర్ట అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన ఫోరం ఆవిర్భావ సభలో స్వామి మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎంపీటీసీలకు అధికారాలు, హోదా కల్పించాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం కానున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఫోరం నేతలు విజయ్‌కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు.