'రూ. 20 వేల కోట్ల నిధులు లాప్స్'
'రూ. 20 వేల కోట్ల నిధులు లాప్స్'
Published Fri, Feb 10 2017 3:34 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
హైదరాబాద్: టీఆర్‌ఎస్ పాలనలో ఇప్పటివరకు రూ. 20 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు వృధా అయ్యాయని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్ లో వృధా అయిన నిధులను ప్రత్యేక నిధుల కింద కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ లో ఎస్సీలకు 15.5 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు.
బడ్జెట్ ను కేటాయింపులకు పరిమితం చేయకుండా ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసి ఖర్చుచేయాలన్నారు. దీన్ని అమలు చేయకపోతే సీఎం కేసీఆర్ చీటింగ్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బడ్జెట్లో సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులను క్వాటర్లీ వారీగా విడుదల చేయకుండా ఏడాది చివర్లో విడుదల చేసి అవి ఖర్చు కాలేదని ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.
Advertisement