subramanyam swamy
-
కుప్పంలో విగ్రహాల ధ్వంసం: చంద్రబాబుపై ఎస్పీ ఫైర్..
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని పురాతన విగ్రహాల ధ్వంసం ఘటనను పోలీసులు ఛేదించారు. కుప్పం మండలం గోనుగురు సమీపంలోని దేవతామూర్తుల విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు సంఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మతిస్థిమితం లేని ఓ మహిళ విగ్రహాలు ధ్వంసం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. గుడి చాలా మారుమూల ప్రాంతంలో ఉందని, వారానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయని తెలిపారు. మతిస్థిమితం లేని మహిళ ఈ ఘటనకు కారణమని తేలిందన్నారు. విగ్రహాల ధ్వంసం చేసిన విషయాన్ని జ్యోతి అనే మహిళ ఒప్పుకుందన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసే సమయంలో మహిళ మద్యం మత్తులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా కేసులు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే, పోలీసులు, పీస్ కమిటీకి వెంటనే తెలియజేయాలని తెలిపారు. చదవండి: అడుగడుగునా మేసేశారు -
చంద్రబాబు అనుకూల పత్రికలపై పరువు నష్టం దావా వేస్తా..
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంపై(టీటీడీ) ఎల్లో మీడియాలో వస్తున్న అసత్య కధనాలపై విసుగు చెందానని, త్వరలో చంద్రబాబు, ఆయన అనుకూల పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి మండి పడ్డారు. పవిత్రమైన వెంకన్న సన్నిధిపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన అనుకూల మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయంటూ ఆరోపించారు. ఈ విషయంపై తన సహచరుడు సత్యపాల్ సభర్వాల్‌తో కలిసి త్వరలో తిరుపతి పట్టణ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయిస్తానంటూ ఆయన ట్విటర్లో షేర్ చేశాడు. -
బాబ్రీ కేసును మూసివేయాలి : స్వామి
సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి సమర్ధించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్‌లో తీర్పు వెలువరించిన బాబ్రీ కేసు మాత్రం అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటి బీజేపీ నేతలను వెంటాడుతోంది. 1992 మసీదు విధ్వంసం కేసుకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం 92 ఏళ్ల అద్వానీకి సమన్లు జారీ చేయడంపై సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం స్పందించారు. మూడు దశాబ్ధాల కిందట దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను స్వామి సమర్ధిస్తూ ఈ కేసును మూసివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. బాబ్రీ ఘటనలో వారు పాలుపంచుకుంటే ఆ స్ధలంలో ఆలయ పునర్మిర్మాణానికి సాయపడతారని అన్నారు. అయోధ్య రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి శంకుస్ధాపన జరుగుతున్న నేపథ్యంలో వృద్ధ నేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీలను అయోథ్యకు తీసుకువెళ్లేముందు వారిపై ఉన్న వెర్రి కేసును మూసివేసేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తర్వులు జారీ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఆగస్ట్ 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. కాగా 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీమసీదును కరసేవకులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మసీదు నిర్మించిన చోట ఆలయం ఉందనే వాదనతో మసీదును నేలమట్టం చేశారు. ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషీలు అప్పట్లో రామమందిర ఉద్యమానికి నేతృత్వం వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో వీరితో పాటు బీజేపీ ప్రముఖ నేతలు అశోక్ సింఘాల్, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చదవండి : అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ కోర్టు -
పీకే సినిమాకు ఐఎస్ఐ పెట్టుబడి: స్వామి
పీకే సినిమా తీయడానికి డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ప్రశ్నించారు. ఆ సినిమాకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పెట్టుబడి పెట్టిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పీకే సినిమాపై వెంటనే ప్రభుత్వం విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. అమీర్ ఖాన్ పీకే సినిమాపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు హిందూ సంస్థలు దీనిపై ఫిర్యాదులు చేయగా, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యడు కూడా వాటికి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కూడా ఆరోపణలు గుప్పించారు. -
‘నేతల నల్లధనం వివరాలను రాష్ట్రపతికి చెప్పా’
న్యూఢిల్లీ: బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. దేశంలోని రాజకీయ నేతల నల్లధనానికి సంబంధించి తాను కనుగొన్న వివరాలను ఆయనకు వెల్లడించారు. తమిళనాడులో గత 2 నెలల్లో జరిగిన హిందూ సంస్థల నేతల హత్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చానని ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిన శ్రీలంక తమిళులు తమిళనాడులోకి చొరబడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకునేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరాను. ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల ఇస్లామిక్ రాజ్యం(ఖలీఫేట్)లో తమిళనాడు ముస్లింలు చేరారని తెలిపాను. వీటిని అరికట్టేందుకు రాజ్యాంగంలోని 256 అధికరణ కింద రాష్ట్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశాను’ అని వెల్లడించారు.