subregestror office
-
చలానా మాఫియా..
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖను నకిలీ చలానాల కుంభకోణం కుదిపేస్తోంది. ఈ నెల 3వ తేదీ ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెలుగుచూసిన నకిలీ చలానాల బాగోతాన్ని మరవకముందే కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మరో మోసం బయటపడింది. జిల్లావ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లతో పాటు అధికారులు, సిబ్బంది తీరుపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నకిలీ చలానాల స్కాంతో మరిన్ని అవకతవకలు చోటుచేసుకుని ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు సబర్బన్: స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన కేవలం 550 రూపాయలకు నకిలీ చలానా సృష్టించిన విషయం కందుకూరు సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో గురువారం వెలుగుచూసింది. అయితే, కందుకూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చేయించాల్సిన రిజిస్ట్రేషన్‌కు ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ పేరిట సింగరాయకొండ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంటేషన్ చేయించారు. గుడ్లూరు మండలం మొగళ్లూరుకు చెందిన సీహెచ్ హజరత్ తన స్థిరాస్తి రిజి్రస్టేషన్‌కు స్టాంప్ డ్యూటీ చెల్లించగా, అది నకిలీ చలానాగా తేలింది. సింగరాయకొండ సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో దాఖలు చేసి కందుకూరులో రిజిస్టర్ అయిన ఈ డాక్యుమెంట్ నంబర్ 2800/2021. మొక్కుబడిగా పరిశీలన... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వెలుగు చూసిన నకిలీ ఈ–చలానాల వ్యవహారంపై జిల్లాలో పరిశీలన మొక్కుబడిగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కందుకూరులో బయటపడిన సరికొత్త నకిలీ చలానా వ్యవహారమే అందుకు నిదర్శనంగా ఉంది. జిల్లావ్యాప్తంగా జరిగిన మోసాలు బయటపడకుండా ఉండేందుకు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు రిజి్రస్టార్ కార్యాలయంలో వెలుగు చూసిన నకిలీ చలానాల వ్యవహారం కూడా అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి గత నెలలోనే ఈ కుంభకోణాన్ని అధికారులు గుర్తించినప్పటికీ బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటపెట్టి తాము డబ్బు తిరిగి కట్టించామంటూ కవర్ చేశారు. ఈ విషయంలో రిజి్రస్టేషన్ శాఖ అధికారుల తీరు చూస్తే దొంగే.. దొంగ అని అరిచినట్టు తెలుస్తోంది. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్లు అయిన జాయింట్–1, జాయింట్–2 పరిధిలో నకిలీ చలానాల ద్వారా స్థిరాస్తి రిజి్రస్టేషన్లు జరిగినట్లు తేలింది. మొత్తం 71 స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 77 ఈ–చలానాలు సృష్టించారు. వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీగా కట్టాల్సిన రూ.26,74,850 మొత్తాన్ని చెల్లించకుండానే నకిలీ చలానాల ద్వారా మోసం చేశారు. సెంట్రలైజ్డ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) ద్వారా ఆన్లైన్ చెల్లింపుల్లో మోసానికి పాల్పడ్డారు. ఒంగోలులో హైడ్రామా... ఒంగోలు కేంద్రంగా రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల ద్వారా మోసానికి పాల్పడిన వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. నకిలీ ఈ–చలానాలు ముందుగా ఒంగోలులో బయటపడినా రిజి్రస్టేషన్ శాఖ అధికారులు కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అది చివరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియడంతో హైడ్రామాకు తెరతీశారు. వాస్తవానికి నకిలీ చలానాలు ఆగస్టు 16వ తేదీనే బయటపడ్డాయి. కానీ, అధికారులు ఆ విషయం బయటకు రాకుండా ప్రయత్నించి ప్రభుత్వాన్ని మోసం చేశారు. సూత్రధారి అయిన ఒంగోలుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ కాజా పవన్‌కుమార్, రిజి్రస్టేషన్ అధికారులు కలిసి ప్రభుత్వ ఖజానాకు ఆ మొత్తాన్ని జమ చేయాలని చూశారు. ఆగస్టు 24వ తేదీ వరకు సమాలోచనలు, చర్చోపచర్చలు చేసుకున్నారు. చివరకు ఆగస్టు 24వ తేదీ డాక్యుమెంట్ రైటర్ కాజా పవన్‌కుమార్‌తో మొత్తం రూ.26,74,850 బ్యాంకు చలానా కట్టించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలోనూ జాప్యం... ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన మోసాన్ని వెంటనే బయటపెట్టకపోవడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయలేదు. విషయం బయటకు పొక్కి పత్రికల్లో వార్తా కథనాలు వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2న అర్ధరాత్రి ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెప్టెంబర్ 5వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కూడా ఎక్కడా దొరక్కుండా చూడాలన్నదే వారి ఉద్దేశంగా తెలుస్తోంది. నకిలీ చలానాలకు పాల్పడిన డాక్యుమెంట్ రైటర్ పవన్‌తో పాటు ఒంగోలు రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న పెద్ద తలల పాత్రపై కూడా ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కందుకూరు సంఘటనతో జిల్లావ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. -
దోషులపై చర్యలు తీసుకోవాలి
– కండసారా రిజిస్ట్రేషన్ పత్రాలు మాయచేసే కుట్ర – సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా హిందూపురం అర్బన్ : కండసారా షుగర్ ఫ్యాక్టరీ భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు మాయం చేయాలనే ఉద్దేశంతో కావాలనే సబ్ రిజిస్ట్రార్ కార్యాయానికి నిప్పు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. మంగళవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పార్టీ యువజన రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, ఏ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ శివ, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, నాగభూషణరెడ్డి మాట్లాడుతూ పథకం ప్రకారం కిరోసిన్ పోసి నిప్పు పెట్టి షార్ట్సర్యూ్యట్గా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కార్యాలయానికి నిప్పుపెట్టిన దోషులను వెంటనే శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్‌కు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ పట్టణ మహిళ కన్వీనర్ నాగమణి, మండల కన్వీనర్ షామింతాజ్, కౌన్సిలర్లు జబీవుల్లా, షాజియా, షాహతాజ్, జరీనా, అంజినప్ప, నాయకులు నరసింహారెడ్డి, సమద్, రమేష్, నర్సిరెడ్డి, విద్యార్థి సంఘ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, అజుబా తదితరులు పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ హస్తం ఉంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కాలిపోవడంపై స్థానిక స»Œ æరిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రూ.కోట్లు విలువ చేసే కండసారా ఫ్యాక్టరీ భూములు రిజిస్ట్రేషన్ జరగడాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు చేసిన నాటకమన్నారు. సంఘటన ప్రాంతంలో కిరోసిన్ బాటిల్ దొరికినా.. కేసును వీగించేందుకు ఓ పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2013లో స్థానిక లారీ వర్కర్స్ యూనియన్‌కు చెందిన రూ.5 కోట్లు విలువ చేసే ఆస్తిని చైర్పర్సన్ భర్త నాగరాజు రిజిష్టర్ చేసుకున్నారని.. దానిపై యూనియన్ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఆ సర్వే నంబరులో రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుపరాదని ప్రొసీడింగ్ ఇచ్చారని తెలిపారు. కానీ టీడీపీ జిల్లా నాయకుడి భార్య పేరుతో ఆ భూమిని స»Œ æరిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. అయినా ఈ అధికారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం దారుణమన్నారు.